Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న‌వీ ముంబ‌యి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి; జెఎన్‌పిటి లోని నాలుగో కంటేన‌ర్ టర్మిన‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

న‌వీ ముంబ‌యి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి;  జెఎన్‌పిటి లోని నాలుగో కంటేన‌ర్ టర్మిన‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

న‌వీ ముంబ‌యి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి;  జెఎన్‌పిటి లోని నాలుగో కంటేన‌ర్ టర్మిన‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న‌వీ ముంబ‌యి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం యొక్క భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజర‌య్యారు. న‌వీ ముంబ‌యి లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని, జ‌వాహ‌ర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్ర‌స్టు లోని నాలుగో కంటేన‌ర్ ట‌ర్మిన‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, తాను మ‌హ‌నీయుడు శివాజీ మ‌హారాజ్ జ‌యంతికి ఒక రోజు ముందుగానే మ‌హారాష్ట్ర కు వ‌చ్చిన సంగ‌తిని ప్ర‌స్తావించారు.

ప్ర‌పంచీక‌ర‌ణ అన్నది ప్ర‌స్తుత కాలంలోని ఒక వాస్త‌వంక అని ఆయన చెప్తూ, ప్ర‌పంచీక‌ర‌ణ‌ వేగాన్ని అందుకొనేందుకుగాను మ‌న‌కు ఉన్న‌త‌మైన నాణ్య‌త క‌లిగినటువంటి మౌలిక స‌దుపాయాల ఆవ‌శ్య‌క‌త ఉన్నది అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. నౌకాశ్ర‌యాల అభివృద్ధికి సాగ‌ర్‌మాల ప్రాజెక్టు బాట వేయడంతో పాటు నౌకాశ్ర‌యాలకు నాయకత్వ పాత్ర ఉండే తరహా అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు బాట వేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. జ‌ల మార్గాల అభివృద్ధి దిశ‌గా భార‌త ప్ర‌భుత్వం చెప్పుకోద‌గ్గ కృషి చేయ‌డానికి అంకిత‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి వివరించారు.

న‌వీ ముంబ‌యి విమానాశ్ర‌య ప్రాజెక్టు ఏళ్ళ త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాకుండా ఉంటూ వ‌చ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. జాప్యం జరిగిన ప్రాజెక్టుల వల్ల అనేక స‌మ‌స్య‌లు తల ఎత్తుతాయం్టూ, ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డానికి ప్రాధాన్యం ఇచ్చేందుకే ప్ర‌గ‌తి (PRAGATI) కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టామ‌ని ఆయ‌న తెలిపారు.

భార‌త‌దేశంలో విమాన‌యాన రంగం గొప్ప‌గా విస్త‌రిస్తోంద‌ని, విమానాల‌లో ప్ర‌యాణిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ ప‌రిణామం విమాన‌యాన రంగంలో నాణ్య‌త క‌లిగిన అవ‌స్థాప‌నకు పెద్ద పీట వేయవలసిన ప‌రిస్థితిని క‌ల్పిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన విమాన‌యాన విధానం ఈ రంగంలో ప‌రివ‌ర్త‌న కు దారి తీస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. పటిష్టమైన విమానయాన రంగం మరిన్ని ఆర్థిక అవ‌కాశాలను ప్రసాదిస్తుందని కూడా ఆయ‌న అన్నారు. అనుసంధానం మెరుగుపడడంతో భార‌త‌దేశానికి మ‌రింత మంది ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ గ‌లుగుతుంద‌ని ప్రధాన మంత్రి వివ‌రించారు.