సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమం లో భాగం గానే, విశిష్ట సేవకు గాను రాష్ట్రపతి పోలీస్ పతకం మరియు సిబిఐ కి చెందిన అతి ఉత్తమ అధికారుల కు బంగారు పతకం ల విజేతల కు ఆయా పురస్కారాల ప్రదానం సైతం చోటు చేసుకొంది. పురస్కార విజేతల కు పతకాల ను ప్రధాన మంత్రి అందజేశారు. ప్రధాన మంత్రి శిలాంగ్ లో, పుణె లో మరియు నాగ్ పుర్ లో నూతనంగా నిర్మాణం జరిగినటువంటి సిబిఐ కార్యాలయ భవన సముదాయాల ను కూడా ప్రారంభించారు. ఆయన సిబిఐ యొక్క వజ్రోత్సవ సంవత్సరానికి గుర్తు గా ఒక తపాలా బిళ్ల ను మరియు స్మారక నాణేన్ని విడుదల చేయడం తో పాటు గా సిబిఐ యొక్క ట్విటర్ హేండిల్ ను కూడాను ప్రారంభించారు. అలాగే ఆయన సిబిఐ యొక్క పరిపాలన సంబంధి తాజా సూచన ల పుస్తకాన్ని, ఏన్ ఆల్మనేక్ ఆన్ బ్యాంక్ ఫ్రాడ్స్ – కేస్ స్టడీస్ ఎండ్ లర్నింగ్, ఇన్ పర్ స్యూట్ ఆఫ్ జస్టిస్ – సుప్రీం కోర్ట్ జజ్ మెంట్స్ ఇన్ సిబిఐ కేసెస్ మరియు ఎ హేండ్ బుక్ ఆన్ ఇంటర్ నేశనల్ పీస్ కోఆపరేశన్ ఫార్ ద ఎక్స్ చేంజ్ ఆఫ్ ఫారిన్ లొకేటెడ్ ఇంటలిజన్స్ ఎండ్ ఎవిడన్స్ అనే పుస్తకాల ను కూడా ఆవిష్కరించారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, సిబిఐ యొక్క వజ్రోత్సవాల సందర్భం లో అందరి కి అభినందనల ను తెలియ జేశారు. ఈ సంస్థ దేశం లో ముఖ్య దర్యాప్తు సంస్థ గా 60 సంవత్సరాల యాత్ర ను పూర్తి చేసింది అన్నారు. ఈ ఆరు దశాబ్దాలు సంస్థ యొక్క అనేక కార్యసాధనల తో అలంకృతమయ్యాయని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, సిబిఐ కి సంబంధించినటువంటి అంశాల లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ల సేకరణ ను సైతం ఈ రోజు న ప్రారంభించడం జరిగిందని, ఆ గ్రంథం సిబిఐ యొక్క చరిత్ర తాలూకు సమగ్ర దర్శనాన్ని మనకు అందిస్తుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
బహుళ నగరాల లో, కొత్త కార్యాలయాలు అనే ఏమి, ట్విటర్ హేండల్ అనే ఏమి లేదా ఇతర సదుపాయాలు గాని వాటిని కూడాను ఈ రోజు న ప్రారంభించడం జరిగింది, అవి సిబిఐ ని బలపరచడం లో ఒక కీలకమైన పాత్ర ను పోషించగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘సిబిఐ వారు తమ శ్రమ ద్వారా ను మరియు కౌశలం ద్వారా ను దేశం లోని సామాన్య పౌరుల లో విశ్వాసాన్ని పాదుకొల్పారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు కు కూడాను పరిష్కారం అంటూ దొరకని కేసు ఏదయినా వచ్చిందా అంటే గనక, సదరు కేసు ను సిబిఐ కి అప్పగించాలి అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి అవగాహన ఉదయిస్తుంది అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి ఉదాహరణల ను చెప్తూ, ఒక్కొక్క సారి ఒక కేసు ను సిబిఐ కి అప్పగించాలి అంటూ నగరాల లో నిరసన లు కూడా తలెత్తుతాయి అన్నారు. పంచాయతీ స్థాయి లోనూ ఏదయినా విషయం తలెత్తిందా అంటే పౌరుల లో ఓ పారస్పరిక ఉమ్మడి గళం అంటూ ఏర్పడిపోయి సిబిఐ విచారణ ను డిమాండ్ చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. లోకుల నమ్మకాన్ని గెలుచుకొనే అసాధారణమైన కార్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘‘అందరి నోట సిబిఐ పేరే వినపడుతుంది. అది (సిబిఐ) సత్యాని కి మరియు న్యాయాని కి ఒక బ్రాండు వంటిది’’ అని అభివర్ణించారు. ఈ 60 సంవత్సరాల యాత్ర లో సిబిఐ తో ముడిపడ్డ ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు.
పురస్కార విజేతల ను ప్రధాన మంత్రి అభినందిస్తూ, బ్యూరో ను నిరంతరం ఒక మెట్టు పైనే ఉండవలసిందని సూచించారు. ప్రతిపాదిత చింతన్ శివిర్ గతం నుండి నేర్చుకోవాలి మరి ఒక ‘వికసిత్ భారత్’ ను ఆవిష్కరించాలి అనే ప్రతిజ్ఞ ను కోట్ల కొద్దీ భారతీయులు స్వీకరించినటువంటి మహత్వపూర్ణమైన అమృత కాలాన్ని దృష్టి లో పెట్టుకొని భవిష్యత్తు కోసం ప్రణాళిక ను రచించుకోవాలి అని ఆయన అన్నారు. వృత్తికుశలత కలిగినటువంటి మరియు దక్షత కలిగినటువంటి సంస్థలు లేనిదే ఒక ‘వికసిత్ భారత్’ సాధ్యపడదు, అంటే ఇది సిబిఐ భుజస్కంధాల మీద ఒక పెద్ద బాధ్యత ను ఉంచుతోందన్న మాట అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
బహుళ పార్శ్వాలు కలిగినటువంటి మరియు బహుళ విభాగాలను కలిగివున్నటువంటి సంస్థ గా పేరుతెచ్చుకొన్నందుకు గాను సిబిఐ ని ప్రధాన మంత్రి ప్రశింసించారు. ఆ సంస్థ యొక్క పరిధి విస్తరించిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. దేశం లో నుండి అవినీతి ని పారద్రోలడం అనేదే సిబిఐ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘అవినీతి అనేది ఓ సాధారణమైనటువంటి నేరం కాదు, అది పేదల యొక్క హక్కుల ను గుంజేసుకొంటుంది. అది అనేక ఇతరమైన నేరాల కు జన్మ ను ఇస్తుంది. న్యాయం మరియు ప్రజాస్వామ్యాల మార్గం లో అవినీతే ఒక అతి పెద్దదైనటువంటి అడ్డంకి గా ఉన్నది’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యవస్థ లో అవినీతి అనేది ప్రజాస్వామ్యాన్ని ఆటంక పరుస్తుంది మరి దీని వల్ల మొదట గా జరిగే నష్టం ఏమిటి అంటే అది యువతీయువకుల కల లు చెదరిపోతాయి. ఇలాగ ఎందుకు అని అంటే, అటువంటి పరిస్థితుల లో ప్రతిభ ను హతమార్చివేస్తూ ఒక విధమైన ఇకోసిస్టమ్ విస్తరిస్తుంది అని ఆయన అన్నారు. అవినీతి అనేది ఆశ్రిత పక్షపాతాన్ని, బంధు ప్రీతి ని మరియు వంశవాద వ్యవస్థ ను వృద్ధిచేస్తుంది, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి లు దేశం యొక్క బలాన్ని హరించి వేస్తాయి, ఫలితం గా అభివృద్ధి కి అడ్డు ఎదురవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
Addressing the Diamond Jubilee Celebrations of CBI. https://t.co/cFR0DOWi7c
— Narendra Modi (@narendramodi) April 3, 2023
न्याय के, इंसाफ के एक brand के रूप में CBI हर ज़ुबान पर है। pic.twitter.com/nf91S2d9oB
— PMO India (@PMOIndia) April 3, 2023
विकसित भारत का निर्माण professional और efficient institutions के बिना संभव नहीं है।
— PMO India (@PMOIndia) April 3, 2023
और इसलिए CBI पर बहुत बड़ी जिम्मेदारी है। pic.twitter.com/z1QNTI4ZW5
मुख्य रूप से CBI की जिम्मेदारी भ्रष्टाचार से देश को मुक्त करने की है। pic.twitter.com/lNFspDhu6C
— PMO India (@PMOIndia) April 3, 2023
भ्रष्टाचार, लोकतंत्र और न्याय के रास्ते में सबसे बड़ा रोड़ा होता है। pic.twitter.com/SC9tMm2dAS
— PMO India (@PMOIndia) April 3, 2023
हमने काले धन को लेकर, बेनामी संपत्ति को लेकर, mission mode पर action शुरु किया।
— PMO India (@PMOIndia) April 3, 2023
हमने भ्रष्टाचारियों के साथ-साथ, भ्रष्टाचार को बढ़ावा देने वाले कारणों पर प्रहार करना शुरु किया। pic.twitter.com/xMgRjgxDGx
आज जनधन, आधार, मोबाइल की ट्रिनिटी से हर लाभार्थी को उसका पूरा हक मिल रहा है। pic.twitter.com/gp5H3nkBQm
— PMO India (@PMOIndia) April 3, 2023
कोई भी भ्रष्टाचारी बचना नहीं चाहिए।
— PMO India (@PMOIndia) April 3, 2023
ये देश की इच्छा है, ये देशवासियों की इच्छा है। pic.twitter.com/RT3OuueM1G