Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో ఆరోగ్య మంథన్ కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరు


 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 1వ తేదీన న్యూ ఢిల్లీ లో ఆరోగ్య మంథన్ ముగింపు కార్యక్రమం లో పాల్గొంటున్నారు.  ఆయుష్మాన్ భారత్ పిఎం-జెఎవై తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఆరోగ్య సంస్థ రెండు రోజుల పాటు ఆరోగ్య మంథన్ నిర్వహిస్తోంది.

ముగింపు సమావేశాల్లో పాల్గొన్నసందర్భం గా ప్రధాన మంత్రి కొత్తగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ మొబైల్ యాప్ ను ప్రారంభిస్తారు.  అలాగే “ఆయుష్మాన్ భారత్ స్టార్ట్-అప్ గ్రాండ్ ఛాలెంజ్” కార్యక్రమాన్ని, ఒక స్మారక తపాలా స్టాంప్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

ఆయుష్మాన్ భారత్ పిఎం-జెఎవై లబ్ధిదారులు కొందరిని కూడా ప్రధాన మంత్రి కలుసుకుని మాట్లాడతారు. గత ఏడాది కాలం గా ఈ స్కీమ్ పయనాన్ని ప్రతిబింబించే పిఎం-జెఎవై ఎగ్జిబిషన్ ను కూడా ప్రధాన మంత్రి సందర్శిస్తారు. 

పిఎం-జెఎవై లో భాగస్వాములైన వారందరినీ ఒక చోట సమావేశపరచి గత ఏడాది కాలం లోనూ వారు ఎదుర్కొన్న సవాళ్లపై పరస్పరం చర్చించుకునేందుకు వేదిక కల్పించడం, అమలు ను మెరుగు పరిచేందుకు మరింత మెరుగైన అవగాహన కల్పించడం, కొత్త బాట వేసుకునేలా వారిని ప్రోత్సహించడం ఆరోగ్య మంథన్ ప్రధాన లక్ష్యం.  పిఎం-జెఎవై ని మరింత మెరుగు పరచేందుకు ఆరోగ్య మంథన్ కీలక సిఫారసుల ను కూడా ఈ వేదిక పై ఆవిష్కరిస్తారు. 

ఆయుష్మాన్ భారత్ పిఎం-జెఎవై ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018 సెప్టెంబరు 23వ తేదీన ప్రారంభించారు.