Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లోని ఇస్కాన్ లో రేపటి రోజు న గీత ఆరాధ‌న మ‌హోత్స‌వాని కి హాజ‌రు కానున్న‌ ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వరి 26వ తేదీ న న్యూ ఢిల్లీ లోని కైలాస్ తూర్పు ప్రాంతం లో ఉన్న ఇస్కాన్- గ్లోరీ ఆఫ్ ఇండియా క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో జరిగే గీత ఆరాధ‌న మ‌హోత్స‌వాని కి హాజ‌రవుతారు.

ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఎస్‌కెసిఒఎన్ (‘ఇస్కాన్’) భ‌క్తుల ద్వారా రూపొందిన భ‌గ‌వ‌ద్గీత ను ఆవిష్క‌రిస్తారు. ఈ భ‌గ‌వ‌ద్గీత ప్ర‌పంచం లోనే విశిష్టమైనటువంటిది. దీని ఆకారం 2.8 మీట‌ర్లు మరియు బరువు 800 కిలోగ్రాముల‌ కు పైగా ఉంది. దీనిలో భ‌గ‌వ‌ద్గీత లోని సిస‌లైన శ్లోకాల‌ కు టీకా తాత్ప‌ర్యం కూడా ఉంది. ఈ గ్రంథం ఆధికారిక ఆవిష్కరణ కు గుర్తు గా ప్రధాన మంత్రి దీనిలోని పుటల ను తెరుస్తారు.

ఈ కార్యక్రమం లో పాల్గొనే వారిని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించనున్నారు.

**