Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ జీలండ్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి  

న్యూ జీలండ్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి  


ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో న్యూ జీలండ్ ప్రధాని శ్రీ క్రిస్ హిప్ కిన్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇద్దరు ప్రధాను ల మధ్య ఈ విధమైన సమావేశం జరగడం ఇదే మొదటి సారి.

 

 

ఇద్దరు నేత లు ఇప్పటికే అమలవుతున్న ద్వైపాక్షిక సహకార పూర్వక కార్యక్రమాల ను గురించి చర్చించారు. వ్యాపారం మరియు వాణిజ్యం, విద్య, ఇన్ ఫర్ మేశన్ టెక్ నాలజీ, పర్యటన, సంస్కృతి, క్రీడ లు మరియు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా వివిధ రంగాల లో సహకారాన్ని విస్తరింప చేసుకోవాలని కూడా నేత లు సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

 

***