Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూయార్క్ సిటీలో భూటాన్‌, శ్రీలంక‌, స్వీడ‌న్‌, సైప్ర‌స్ దేశాధినేత‌ల‌తో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ భేటీ

భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భూటాన్ ప్ర‌ధాని షెరింగ్ టోబ్‌గే తో స‌మావేశ‌మ‌య్యారు. ఐక్య‌రాజ్య స‌మితి స‌ర్వ ప్ర‌తినిధి స‌భ ఆమోదించిన – 2015 అనంత‌ర అభివృద్ధి ఎజెండా పై శ్రీ న‌రేంద్ర మోదీ మార్గ‌ద‌ర్శ‌కమైన‌ ప్ర‌క‌ట‌న చేయ‌డాన్ని భూటాన్ ప్ర‌ధాని అభినందించారు. ఈ భూటాన్‌లో జ‌ల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి జ‌రుగుతున్న ప్ర‌గ‌తిని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. ఐరాస భ‌ద్ర‌తా మండ‌లిలో శాశ్వ‌త స‌భ్య‌త్వం కోసం భార‌త్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు త‌మ దేశ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని భూటాన్ ప్ర‌ధాని పున‌రుద్ఘాటించారు.

అనంత‌రం ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీలంక అధ్య‌క్షుడు శ్రీ మైత్రిపాల‌ సిరిసేన ను క‌లుసుకున్నారు. ఈ ఏడాది శ్రీలంక లో రెండు మార్లు ఎన్నిక‌లను విజ‌యవంతంగా నిర్వ‌హించినందుకు శ్రీలంక అధ్య‌క్షుడిని శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. ఇది శ్రీలంక ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయ విలువ‌ల దృఢ‌ చిత్తాన్ని ప్ర‌తిబింబింప చేస్తోంద‌ని, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అక్క‌డ ఎంత‌గా బ‌ల‌ప‌డిందో తెలుస్తోంద‌ని భార‌త ప్ర‌ధాని పేర్కొన్నారు. ఉభ‌య దేశాల మ‌ధ్య రాజీ చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన అంశాల‌తో పాటు శ్రీలంక లోని వివిధ రంగాల‌లో భార‌తీయ పెట్టుబ‌డుల గురించి కూడా ఈ స‌మావేశంలో ఇరు దేశాల అధినేత‌లు చ‌ర్చించారు.అనంత‌రం స్వీడ‌న్ ప్ర‌ధాన మంత్రి స్టెఫాన్ లోఫ్ వాన్ తో శ్రీ మోదీ స‌మావేశ‌మ‌య్యారు. ఇటీవ‌ల భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్వీడ‌న్ ప‌ర్య‌ట‌న ఫ‌ల‌వంత‌మైంద‌ని ఆయ‌న‌ సంతృప్తి వ్య‌క్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాల‌లో స్వీడ‌న్ పాలు పంచుకుంటున్న‌ద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.సైప్ర‌స్ అధ్య‌క్షుడు నికొల‌స్ అనాస్టాసియాడ్స్ ను భార‌త ప్ర‌ధాని క‌లుసుకున్నారు. భౌతికంగా రెండు దేశాల మ‌ధ్య‌ చాలా దూరం ఉన్న‌ప్ప‌టికీ , మాన‌సికంగా ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య భావాత్మ‌క‌మైన స‌న్నిహిత సంబంధాలు నెల‌కొని ఉన్నాయ‌ని పేర్కొన్నారు. సైప్ర‌స్ తో మైత్రీ బంధం నెర‌పే దేశాల‌లోకెల్లా భార‌త్ అత్యంత శ‌క్తిమంత‌మైన‌ మిత్ర దేశ‌మ‌ని సైప్ర‌స్ అధ్య‌క్షుడు అభివ‌ర్ణించారు.