Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూయార్క్ సిటీలో జీ-4 స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని

న్యూయార్క్ సిటీలో  జీ-4  స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని

న్యూయార్క్ సిటీలో  జీ-4  స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని

న్యూయార్క్ సిటీలో  జీ-4  స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని

న్యూయార్క్ సిటీలో  జీ-4  స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని

న్యూయార్క్ సిటీలో  జీ-4  స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని

న్యూయార్క్ సిటీలో  జీ-4  స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని


న్యూయార్క్ సిటీలో జీ-4 స‌ద‌స్సులో పాల్గొన్న ప్ర‌ధాని

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ( 26 సెప్టెంబ‌ర్ 2015) న్యూయార్క్ లో జ‌రిగిన జీ-4 స‌ద‌స్సులో పాల్గొన్నారు. బ్రెజిల్ అధ్య‌క్షురాలు దిల్మా రౌసెఫ్, జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్‌, జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబె ఈ స‌ద‌స్సుకు

హాజ‌ర‌య్యారు. భార‌త ప్ర‌ధాని త‌న ప్ర‌సంగం తొలి ప‌లుకులలో – ”మ‌నం డిజిట‌ల్ యుగంలో జీవిస్తున్నాం. ప్ర‌పంచ ఆర్థిక స్వ‌రూపం మారింది. కొత్త అభ‌వృద్ధి క‌లిగింది. మ‌రింత విస్త‌రించిన ఆర్ధిక శ‌క్తుల అంత‌రాల‌తో ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ మారింది. జ‌న సంఖ్యాప‌ర‌మైన మార్పులు, ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌, వ‌లస‌లు త‌దిత‌ర అంశాలు కొత్త స‌వాళ్ల‌ను సృష్టిస్తున్నాయి. వాతావ‌ర‌ణ మార్పులు, ఉగ్ర‌వాదం వంటివి ఆందోళ‌న క‌లిగించే అంశాలు. ఇంట‌ర్నెట్‌, అంత‌రిక్షం వంటి స‌రికొత్త రంగాలు అవ‌కాశాల‌తో పాటు స‌వాళ్ల‌నూ తీసుకువ‌స్తున్నాయి. కానీ, మ‌న సంస్థ‌లు గ‌త శ‌తాబ్ద‌పు మాన‌సిక స్థితినే ప్ర‌తిబింప‌జేస్తున్నాయి త‌ప్ప మ‌నం జీవిస్తున్న శ‌తాబ్దంలోని మార్పులు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌గ్గ‌ట్టుగా మార‌డం లేదు. ప్రత్యేకించి ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌త మండ‌లి విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. భ‌ద్ర‌తా మండ‌లిలో
సంస్క‌ర‌ణ‌లను నిర్దిష్ట కాల‌ప‌రిమితిలో పూర్తి చేయ‌డం అత్య‌వ‌స‌ర‌, అత్యంత ప్రాధాన్య‌త గ‌ల ల‌క్ష్యం” అని ప్ర‌ధాని పేర్కొన్నారు.

స‌మావేశానంత‌రం జారీ చేసిన సంయుక్త ప్ర‌క‌ట‌న : `ఇటీవ‌లి కాలంలో ప్ర‌పంచంలో పెచ్చ‌రిల్లిపోతున్న‌ సంక్షోభాల ప‌రిష్కారానికి, ఘ‌ర్ష‌ణ‌ల నివార‌ణ‌కు వీలుగా ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి మ‌రింత స‌మ‌ర్ధ‌వంత‌మైన ప్రాతినిధ్యాన్ని, న్యాయ‌బ‌ద్ధ‌త‌ను క‌లిగి ఉండ‌టం అవ‌స‌రం. 21వ శ‌తాబ్దంలోని వాస్త‌వాల‌ను ప్ర‌తిబింబింప‌చేయ‌డం ద్వారా వీటిని సాధించ‌వ‌చ్చు. ప్ర‌పంచ శాంతి, భ‌ద్ర‌త ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో ప్ర‌ధాన బాధ్య‌త‌లు స్వీక‌రించే సామ‌ర్ధ్యం గ‌ల దేశాల‌కు ఐరాస భ‌ద్ర‌త మండ‌లిలో శాశ్వ‌త స‌భ్య‌త్వానికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని భార‌త్‌, బ్రెజిల్, జ‌పాన్‌, జ‌ర్మ‌నీ దేశాలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశాయి.

శాన్ జోస్ రాక‌ :

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ -శాన్ జోస్ , కాలిఫోర్నియా చేరుకున్న సంద‌ర్భంగా ప్ర‌వాస భార‌తీయులు ఆనందోత్సాహాల‌తో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప‌లువురు ప్ర‌వాస భార‌తీయుల‌ను క‌లుసుకున్నారు.

టెస్లా మోటార్స్ సంద‌ర్శ‌న :

టెస్లా మోటార్స్ ను సంద‌ర్శించిన భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీని ఆ సంస్థ సీఈవో ఎలోన్ మ‌స్క్ సాద‌ర‌ స్వాగ‌తం ప‌లికారు. త‌మ కంపెనీ చేప‌ట్టిన నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల గురించి ఆయ‌న ప్ర‌ధానికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆ ఫ్యాక్ట‌రీ ని ప్ర‌ధాని తిల‌కించారు. ఇంధ‌న పున‌రుత్ప‌త్తి, టెస్లా బ్యాట‌రీ టెక్నాల‌జీ, ఇంధ‌న నిల్వ‌ల‌లో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన విష‌యాల‌పై ప్ర‌ధాని చ‌ర్చ‌లు జ‌రిపారు. టెస్లా మోటార్స్‌లో ప‌నిచేసే భార‌త సంత‌తికి
చెందిన ఉద్యోగుల‌ను ప్ర‌ధాని మోదీ క‌లుసుకున్నారు.

శాన్‌జోస్‌లో ప్ర‌ముఖ ఐటీ కంపెనీల సీఈవోల‌తో స‌మావేశం :

భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, యాపిల్ ఇంక్ సంస్థ సీఈవో టిమ్ కుక్ తో స‌మావేశ‌మ‌య్యారు. త‌మ సంస్థ‌కు భార‌త దేశం ప‌ట్ల‌ గౌర‌వ‌పూర్వ‌క‌మైన స్థానం ఉంద‌ని , త‌మ కంపెనీ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు స్టీవ్ జాబ్స్, భార‌త్ నుంచి స్ఫూర్తి పొందార‌ని ఈ సంద‌ర్భంగా టిమ్ కుక్ పేర్కొన్నారు. డిజిట‌ల్ ఇండియా ప్రారంభ‌లో యాపిల్ ఇంక్ భాగ‌స్వామ్యం ఏ మేర‌కు ఉండ‌డ‌బోతున్న‌ద‌నే అంశం పైనా చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనంత‌రం స‌త్య నాదెళ్ల ( మైక్రోసాఫ్ట్ ), సుంద‌ర్ పిచ్చ‌య్ ( గూగుల్ ) శంత‌ను నారాయ‌ణ్ ( అడోబ్ ) పాల్ జాక‌బ్స్ ( క్వాల్‌కామ్) జాన్ ఛాంబ‌ర్స్ (సిస్కో) త‌దిత‌రులు డిజిట‌ల్ ఇండియా డిన్న‌ర్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన వేదిక‌పై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని క‌లిసారు.

డిజిట‌ల్ ఇండియా స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం :

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగిస్తూ – డిజిట‌ల్ ఇండియా విజ‌న్ గురించి వివ‌రించారు.. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ – ఇది డిజిట‌ల్ యుగం. ఇది ప్ర‌జ‌ల జీవితాల‌ను ఇంత‌గా ప్ర‌భావితం చేసి మార్పు తేగ‌ల‌ద‌ని
రెండు ద‌శాబ్దాల కింద‌ట ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. మనం ఇటీవ‌ల‌ వ‌దిలిపెట్టి వ‌చ్చిన శ‌తాబ్ది నుంచి ఇదే మ‌న‌ల్ని దూరం చేసింది. డిజిట‌ల్ ఎకాన‌మీ కేవ‌లం సంప‌న్నులు, విద్యావంతులకు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని ఇప్ప‌టికీ కొంద‌రు భావిస్తుండ‌వ‌చ్చు. కానీ భార‌త్‌లో ఒక టాక్సీ డ్రైవ‌ర్ ను కానీ, వీధి వ్యాపారిని కానీ – సెల్ ఫోన్ తో ఎటువంటి ప్ర‌యోజ‌నం క‌లిగింది ? అని అడిగిన‌ట్ల‌యితే అటువంటి చ‌ర్చ అక్క‌డితోనే ముగిసిపోతుంది. నా దృష్టిలో , టెక్నాల‌జీ అంటే – ఆశ‌లు, అవ‌కాశాల‌కు మ‌ధ్య గ‌ల దూరాన్ని దాటేందుకు వార‌ధిగా ఉప‌యోగించే ఒక సాధనమ‌ని అర్ధం . సామాజిక క‌ట్టుబాట్ల‌ను సామాజిక మాధ్య‌మాలు నిలువ‌రిస్తున్నాయి. మాన‌వ‌తా విలువ‌ల బ‌లం ప్రాతిప‌దిక‌న మాత్ర‌మే అవి మ‌నుషుల‌ను క‌లుపుతున్నాయి త‌ప్ప గుర్తింపు వ‌ల్ల కాదు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కుల ద్వారా సాధికార‌త‌కు నేడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంత‌గానో తోడ్ప‌డుతోంది. ఇటువంటి టెక్నాల‌జీ అందిస్తున్న డేటా, స‌మాచారం కార‌ణంగా ప్ర‌భుత్వాలు 24 గంట‌లు కాదు, కేవ‌లం 24 నిముషాల వ్య‌వ‌ధిలోనే స్పందించ‌వ‌ల‌సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. దీనితో ఆశ‌ల అంచున బ‌తుకుల‌ను వెళ్ల‌దీస్తున్న వారిలో మార్పు తీసుకు రావ‌డం సుసాధ్య‌మౌతుంది. ఇటువంటి న‌మ్మ‌కానికి ప్రాణం పోసింది డిజిట‌ల్ ఇండియా ఆలోచ‌న‌. ప్ర‌పంచ మాన‌వాళి చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా భార‌త్‌లో ఇంత పెద్ద
ఎత్తున మార్పు తీసుకు వ‌చ్చే సాహ‌స య‌త్నం జ‌రుగుతోంది. దీని ద్వారా దేశంలోని సుదూర ప్రాంతాల‌లో ఉన్న నిరుపేద‌, బ‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌లకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్నిఅందుబాటులోకి తీసుకు రావ‌డం మాత్ర‌మే కాక‌ – మ‌న జీవ‌న విధానాల‌లోను, ప‌నిచేసే తీరులోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.