Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీలోని భార‌తీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ‌లో పి.ఎం.కిసాన్‌స‌మ్మేళ‌న్ 2022ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

న్యూఢిల్లీలోని భార‌తీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ‌లో పి.ఎం.కిసాన్‌స‌మ్మేళ‌న్ 2022ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ


 ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ  న్యూఢిల్లీలోని భార‌త్య వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ‌లో ఈ రోజు ఏర్పాటు చేసిన పిఎం కిసాన్ స‌మ్మేళ‌న్ 2022ను ప్రారంభించారు. అదే సంద‌ర్భంలో ప్ర‌ధాన‌మంత్రి కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వ‌శాఖ కింద ఏర్పాటు చేసిన‌   600 ప్రధాన‌మంత్రి కిసాన్ స‌మృద్ధి కేంద్రాల‌ను (పిఎంకెఎస్‌కె) ప్రారంభించారు. దీనికితోడు ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఊర్వార‌క్ ప‌రియోజ‌న కింద ఒక దేశం ఒక ఎరువును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధికింద (పిఎం-కిసాన్‌) ప్ర‌త్య‌క్ష న‌గ‌దుబ‌దిలీ ద్వారా ప్ర‌ధాన‌మంత్రి 12 వ విడ‌త నిధుల‌ను ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ద్వారా విడుద‌ల చేశారు.
ప్ర‌ధాన‌మంత్రి అగ్రి స్టార్ట‌ప్ స‌మ్మేళ‌నాన్ని, ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించారు. ఈకార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి ఇండియ‌న్ ఎడ్జ్ పేరుతో ఎరువుల రంగానికి సంబంధించిన ఈ మ్యాగ‌జైన్‌ను ప్రారంభించారు. స్టార్ట‌ప్ ఎగ్జిబిష‌న్ థీమ్ పెవిలియ‌న్ ను ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించి , అక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన ఉత్పత్తుల‌ను ప‌రిశీలించారు.
అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ, జైజ‌వాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్ అనేవి అన్నీ ఒకే చోట ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు. ఈ మంత్రాన్ని ప్ర‌త్య‌క్షంగా మ‌నం ఇక్క‌డ చూస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. కిసాన్‌స‌మ్మేళ‌నం అనేది రైతుల జీవితాల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు, వారి సామ‌ర్ధ్యాన్ని పెంపొందించేందుకు, అధునాత‌న వ్య‌వ‌సాయ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

600కుపైగా ప్ర‌ధాన‌మంత్ర  స‌మృద్ధి కేంద్రాల‌ను ఈరోజు ప్రారంభించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఈ కేంద్రాలు కేవ‌లం ఎరువుల అమ్మ‌కపు కేంద్రాలుగా మాత్ర‌మే కాకుండా దేశంలోని రైతుల‌తో బ‌ల‌మైన బంధాన్ని క‌లిగిఉంటాయ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి(పిఎం-కిసాన్‌) కింద తాజా వాయిదా గురించిప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఈ మొత్తం రైతుల ఖాతాల‌లోకి నేరుగా చేరుతుంద‌ని, ఇది ఎలాంటి మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా వారికిచేరుతుంద‌ని అన్నారు. మ‌రో విడ‌త రూ 16,000 కోట్ల రూపాయ‌ల‌ను కోట్లాది మంది రైతుల కుటుంబాలకు పి.ఎం కిసాన్‌స‌మ్మాన్ నిధి కింద విడుద‌ల చేసిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఈ వాయిదా మొత్తం రైతుల‌కు దీపావ‌ళికి కాస్త ముందుగా అందుతున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఉర్వార‌క్ ప‌రియోజ‌న‌- ఒక దేశం,ఒక ఎరువు కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఈ ప‌థ‌కం కింద అందుబాటు ధ‌ర‌లో నాణ్య‌మైన ఎరువులు భార‌త్ బ్రాండ్ పేరుతో రైతుల‌కు అందుతాయ‌ని ఆయ‌న అన్నారు.

2014 కు ముందునాటి ప‌రిస్థితుల‌ను గుర్తుచేస్తూ ప్ర‌ధాన‌మంత్రి, వ్య‌వ‌సాయ దారులు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవార‌ని, యూరియా బ్లాక్‌మార్కెటింగ్ ఉండేద‌ని అన్నారు. వారికి న్యాయ‌బ‌ద్దంగా ద‌క్క‌వ‌ల‌సిన‌ది ద‌క్కేది కాద‌ని అన్నారు. అయితే ఆ త‌ర్వాత యూరియాకు ప్ర‌భుత్వం నూరుశాతం వేప పూత వేసి  బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్ట‌గ‌లిగింద‌ని అన్నారు. “ఎంతో కాలంగా మూత‌ప‌డి ఉన్న దేశంలోని ఆరు అతిపెద్ద యూరియా ఫ్యాక్ట‌రీల‌ను తిరిగి తెరిపించేందుకు మేం ఎంతో కృషి చేశాం” అని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

క‌ష్టించిప‌నిచేసే రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్న ప‌లు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి,  ద్ర‌వ‌రూప నానో యూరియా ఉత్ప‌త్తిలో ఇండియా స్వావ‌లంబ‌న దిశ‌గా శ‌ర‌వేగంతో ముందుకు పోతున్న‌ద‌ని అన్నారు. నానో యూరియా అనేది త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఉత్ప‌త్తిసాధ‌న‌కు అనువైన‌ద‌ని అన్నారు. దీని ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఒక బ‌స్తా యూరియాకుగా ఒక బాటిల్ నానోయూరియా స‌మాన‌మ‌న్నారు. దీనివ‌ల్ల యూరియా బ‌స్తాల త‌ర‌లింపున‌కు అవుతున్న ఖ‌ర్చు పెద్ద ఎత్తున ఆదా అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు.యూరియా అందుబాటును కూడా పెంచుతుంద‌ని ఆయ‌న అన్నారు.

సాంకేతిక‌త ఆధారిత అధునాత‌న సాగువిధానాల‌ను అనుస‌రించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కిచెబుతూ ప్ర‌ధాన‌మంత్రి, వ్య‌వ‌సాయ‌రంగంలో నూత‌న వ్య‌వ‌స్థ‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, మ‌రింత శాస్త్రీయ , సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ను విశాల దృక్ఫ‌థంతో అనుస‌రించాల‌న్నారు. ఈ ర‌క‌మైన ఆలోచ‌న‌తో, మ‌నం వ్య‌వ‌సాయ‌రంగంలో శాస్త్రీయ ప‌ద్ధ‌తుల‌ను పెంపొందిస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్న‌ట్టుకూడా చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 22 కోట్ల భూసార ప‌రీక్షా కార్డుల‌ను పంపిణీ చేసిన‌ట్టు చెప్పారు. నాణ్య‌మైన విత్త‌నాల‌ను రైతుల‌కు అందించేందుకు శాస్త్రీయ కృషి జ‌రుగుతున్న‌ట్టు కూడా ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. గ‌త 7-8 సంవ‌త్స‌రాల‌లో 1700 వ‌ర‌కు కొత్త విత్త‌న‌ర‌కాలను, మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రైతుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చినట్టు చెప్పారు.

చిరుధాన్యాల విష‌యంలో అంత‌ర్జాతీయంగా ఆస‌క్తి పెరుగుతుండ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇవాళ దేశంలో సంప్ర‌దాయ చిరుధాన్యాలు, తృణ ధాన్యాలు, ప‌ప్పు ధాన్యాల‌కు సంబంధించి విత్త‌న హ‌బ్‌లు రూపుదిద్దుకుంటున్నాయ‌న్నారు. ఇండియాకుచెందిన ప‌ప్పుధాన్యాల ర‌కాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రోత్స‌హించే చ‌ర్య‌ల‌పై దృష్టిపెట్టిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. వ‌చ్చే ఏడాది అంత‌ర్జాతీయ ప‌ప్పుధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.
సాగుకు విచ‌క్ష‌ణా ర‌హితంగానీటి వాడ‌డం గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌తి చుక్క నీటికి మ‌రింత ఉత్ప‌త్తి దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. మైక్రో ఇరిగేష‌న్‌, డ్రిప్ ఇరిగేష‌న్‌ద్వారా దీనిని సాధిస్తున్న‌ట్టు తెలిపారు. 70 ల‌క్ష‌ల‌కు పైగా హెక్టార్ల భూమిని గ‌త 7-8 సంవ‌త్సరాల వ్య‌వ‌ధిలో మైక్రో ఇరిగేష‌న్ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

సంప్ర‌దాయ సాగును ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇది భ‌విష్య‌త్‌లో త‌లెత్తే ప‌లు స‌వాళ్ల‌కు స‌మాధానం కాగ‌ల‌ద‌ని అన్నారు. ఈ విష‌యమై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవ‌గాహ‌న పెరుగుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌లో సంప్రదాయ సాగు విష‌యంలో రైతులు పెద్ద ఎత్తున కృషిచేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. గుజ‌రాత్ లో జిల్లా, గ్రామ పంచాయ‌తి స్థాయిలో సైతం ఇందుకు పెద్ద ఎత్తున కృషి జ‌రుగుతున్న‌ట్టు తెలిపారు

 
పిఎం -కిసాన్ కార్య‌క్ర‌మం కింద జ‌రుగుతున్న మార్పును ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం వాడ‌డం ద్వారా చిన్న రైతులు ఏ విధంగా ప్ర‌యోజ‌నం పొందుతున్నార‌న్న దానికి పిఎం కిసాన్ స‌మ్మాన్‌నిధి ఒక ఉదాహ‌ర‌ణ అని ఆయ‌న అన్నారు. ఈ ప‌థ‌కం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి సుమారు 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు రైతుల బ్యాంకు ఖాతాల‌లోకి ప్ర‌త్య‌క్ష న‌గ‌దుబ‌దిలీ ద్వారా నేరుగా బ‌దిలీ అయింద‌న్నారు. దేశ రైతుల‌లో 85 శాతంగా ఉన్న చిన్న‌రైతుల‌కు ఇది పెద్ద అండ‌గా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.