Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూక్లియ‌ర్ ట్రాయడ్ ను పూర్తి చేసినందుకు ఐఎన్ఎస్ అరిహంత్ నావిక సిబ్బంది కి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్ట్రటీజిక్ స్ట్రయిక్ న్యూక్లియర్ సబ్ మరీన్ (ఎస్ఎస్‌బిఎన్‌) ఐఎన్ఎస్ అరిహంత్ నావిక సిబ్బంది కి ఈ రోజున స్వాగ‌తం ప‌లికారు. ఈ జ‌లాంత‌ర్గామి ఇటీవ‌లే త‌న తొలి నివార‌క గ‌స్తీ నుండి తిరిగి వ‌చ్చింది. దీనితో దేశం లో ఈ తరహా న్యూక్లియ‌ర్ ట్రాయడ్ స్థాపన కొలిక్కివచ్చింది.

ఐఎన్ఎస్ అరిహంత్ యొక్క విజ‌య‌వంతమైన మోహరింపు యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కిప‌లుకుతూ నావిక సిబ్బంది తో పాటు ఈ కార్యసిద్ధి తో అనుబంధాన్ని కలిగివున్న అందరినీ అభినందించారు. ఈ కార్యసాధన ఎస్ఎస్‌బిఎన్ ల‌కు రూప‌క‌ల్ప‌న చేయడం, వాటిని నిర్మించే, ఇంకా నిర్వ‌హించే సామ‌ర్ధ్యాన్ని క‌లిగివున్నటువంటి అతి కొద్ది దేశాల సరసన భార‌త‌దేశాన్ని కూడా ఒక దేశంగా నిలిపింది.

ఎస్ఎస్‌బిఎన్ ను దేశీయం గా అభివృద్ధిప‌ర‌చ‌డం మ‌రియు దానిని ప‌ని చేయించ‌డం ద్వారా దేశ సాంకేతిక శ‌క్తి యుక్తుల‌కు దీనిని అనుసంధానించడాన్ని, ఈ ప్రక్రియ లో అనుబంధాన్ని క‌లిగివున్న అన్ని వ‌ర్గాల‌ ను స‌మ‌న్వ‌యం తో క‌లుపుకొని పోవ‌డం లో ఈ తరహా మార్గదర్శక కార్యసాధన ద్వారా దేశ భ‌ద్ర‌త ను ఎన్నో రెట్లు పెంచిన సిబ్బంది యొక్క అంకిత భావానికి, నిబ‌ద్ధ‌త కు గాను వారికి ప్రధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.

భార‌త‌దేశం యొక్క సాహ‌స‌వంతులైన జ‌వానుల ధైర్యాన్ని, దీక్ష‌ ను, అలాగే భార‌త‌దేశ శాస్త్రవేత్త‌ల యొక్క ప్రతిభ ను, పట్టుదల ను ప్ర‌ధాన మంత్రి శ్లాఘించారు. వారి అవిశ్రాంత కృషి ప‌ర‌మాణు ప‌రీక్ష‌ల శాస్త్రీయ సాఫల్యం రూపు రేఖ‌ ల‌ను మార్చివేసి అత్యంత జటిలమైన మరియు విశ్వసనీయమైన న్యూక్లియర్ ట్రాయడ్ ను నెలకొల్పుకొనేటట్లు చేసిందని, ఈ విష‌యం లో భార‌త‌దేశానికి ఉన్న సామ‌ర్ధ్యం పట్ల, సంక‌ల్పం ల ప‌ట్ల తలెత్తిన ఎన్నో సందేహాలను, ప్ర‌శ్న‌ లను ప‌టాపంచ‌లు చేసిందని ఆయ‌న అన్నారు.

‘శ‌క్తిమంత‌మైన భార‌త్’ కోసం, అలాగే, ఒక ‘న్యూ ఇండియా’ నిర్మాణం కోసం భార‌త‌దేశం ప్ర‌జ‌లు ఒక ఆకాంక్షిస్తున్నార‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఈ మార్గం లో అన్ని స‌వాళ్ళ ను అధిగ‌మించ‌డం కోసం వారు అవిశ్రాంతంగా శ్రమించార‌ని ఆయ‌న చెప్పారు. ఒక శక్తిమంత‌మైన భార‌త‌దేశం బిలియ‌న్ కు పైబ‌డిన భార‌తీయుల ఆశ‌ల‌ ను, ఆకాంక్ష‌ల‌ ను నెర‌వేర్చ‌గలుగుతుంద‌ని, అంతేకాక ప్రత్యేకించి అనిశ్చితులు, ఆందోళ‌న‌ల‌ తో నిండిన ప్ర‌పంచం లో విశ్వ‌ శాంతి కి, స్థిర‌త్వానికి ఒక ముఖ్య‌ స్తంభం కాగ‌లుగుతుంద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ దివ్వెల‌ పండుగ ‘దీపావ‌ళి’ శుభాకాంక్ష‌లు అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. చీక‌టి ని, అన్ని భ‌యాలను వెలుగు పార‌దోలేటట్టుగానే ఐఎన్ఎస్ అరిహంత్ దేశానికి నిర్భ‌య‌త్వాన్ని ప్రసాదించడం లో అగ్రగామి గా నిల‌బ‌డుతుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

బాధ్య‌తాయుత‌మైన ఒక దేశం గా భార‌త‌దేశం ఒక ప‌టిష్ట‌మైనటువంటి న్యూక్లియ‌ర్ క‌మాండ్ మరియు కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ ను, దీటైన భ‌ద్ర‌త‌ కు పూచీప‌డేట‌టువంటి వ్య‌వ‌స్థ‌ ను, ఇంకా నిష్క‌ర్ష‌ అయిన రాజ‌కీయ నియంత్ర‌ణ ను త‌న న్యూక్లియ‌ర్ క‌మాండ్ అథారిటీ ప‌రిధి లో ఉంచింది. అది 2003 వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 4వ తేదీ నాడు అప్ప‌టి ప్ర‌ధాని కీర్తిశేషులు అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గారి అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన భ‌ద్రత అంశాల మంత్రివ‌ర్గ సంఘం స‌మావేశం లో తీసుకొన్న నిర్ణ‌యం లో ఉల్లేఖించిన‌టువంటి క్రెడిబల్ మినిమమ్ డిటరన్స్ అండ్ నో ఫ‌స్ట్ యూస్ సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉంటుంది.