Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకాదళ దినోత్సవం సందర్భంగా భారతీయ నౌకాదళ ధీర జవాన్లకు ప్రధానమంత్రి అభినందనలు


భారతీయ నౌకాదళ సాహసిక జవాన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నౌకాదళ దినోత్సవ అభినందనలు తెలిపారు. వారు మన దేశ ప్రజల సురక్షత, భద్రత, సమృద్ధి కోసం పాటుపడుతున్నారంటూ… వారి నిబద్ధతను ఆయన ప్రశంసించారు.

 

 

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో ఇలా పేర్కొన్నారు:

 

‘‘నౌకాదళ దినోత్సవం సందర్భంగా, మనం భారతీయ నౌకాదళ సాహసిక జవానులకు నమస్కరించుదాం. వారు సాటిలేని ధైర్యసాహసాలతో, అంకితభావంతో మన సముద్ర ప్రాంతాన్ని పరిరక్షిస్తున్నారు. వారు చాటుతున్న నిబద్ధత వల్లనే మన దేశ రక్షణ, భద్రత, సమృద్ధి సుసాధ్యం అవుతోంది. మన దేశ సంపన్న నౌకా వాణిజ్య చరిత్రను చూసుకొని కూడా మనం ఎంతో గర్వపడుతున్నాం’’