Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నైనీతాల్ లో కారు నీటి ప్రవాహం లోకొట్టుకుపోయిన ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ఉత్తరాఖండ్ లోని నైనీతాల్ లో ఒక కారు నీటి ప్రవాహం లో కొట్టుకుపోయిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో –

‘‘నైనీతాల్ జిల్లా లో ఒక కారు నీటి ఉరవళ్ల లో కొట్టుకుపోయిన శోచనీయ ఘటన తో బాధపడ్డాను. ఈ దు:ఖ ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. చిక్కుబడ్డ వ్యక్తుల కు సాయపడడానికి గాను రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

***

DS/SH