ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలో నైజీరియాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, నైజీరియాలోని హిందీ భాషా ప్రేమికులు ఆయనకు స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనలో రేకెత్తిన ఉత్సాహాన్ని ఈ రోజున సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు.
సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’ లో ఇటీవల పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘నైజీరియాలో హిందీ భాషా ప్రేమికులు అక్కడ నేను పర్యటించవలసి వుండగా అంతకు ముందే ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన తీరు మనసుకు హత్తుకొనేలా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ పర్యటనకు బయలుదేరివెళ్తానా అని నా మనసు ఉరకలు వేస్తోంది.’’
ప్రధాన మంత్రి ఈ నెల 16, 17 తేదీలలో నైజీరియాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నైజీరియా ప్రజలు స్వాగతం పలకడం గురించి నైజీరియాలోని భారత హై కమిషన్ అధికారిక ఖాతా @india_nigeria లో హిందీ భాషలో ఓ సందేశాన్ని ఉంచగా దానికి ప్రధాని స్పందించి, తన సందేశాన్ని పొందుపరిచారు.
नाइजीरिया के हिन्दी प्रेमियों ने जिस प्रकार वहां के मेरे दौरे को लेकर उत्साह दिखाया है, वो हृदय को छू गया है! अपनी इस यात्रा को लेकर बहुत उत्सुक हूं। @MEAIndia@NigeriaMFA https://t.co/KtQJYUFjty
— Narendra Modi (@narendramodi) November 14, 2024