Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నే పీ టా లో మ‌య‌న్మార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు తో క‌ల‌సి ప్ర‌సార మాధ్య‌మాల ప్ర‌తినిధుల స‌మావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న పాఠం

నే పీ టా లో మ‌య‌న్మార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు తో క‌ల‌సి ప్ర‌సార మాధ్య‌మాల ప్ర‌తినిధుల స‌మావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న పాఠం

నే పీ టా లో మ‌య‌న్మార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు తో క‌ల‌సి ప్ర‌సార మాధ్య‌మాల ప్ర‌తినిధుల స‌మావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న పాఠం


శ్రేష్ఠులైన‌ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు,

గౌర‌వ‌నీయ ప్ర‌తినిధులు,

ప్ర‌సార మాధ్య‌మాల నుండి విచ్చేసిన మిత్రులారా,

మింగ్‌లాబా

ఆసియాన్ శిఖ‌ర స‌మ్మేళ‌నం జరిగినప్పుడు- 2014లో- నేను ఇక్క‌డికి వ‌చ్చాను. అయితే, మ‌య‌న్మార్ బంగ‌రు భూమిలో ఇది నా ఒకటో ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న‌. నాకు అందించిన‌టువంటి ఆత్మీయమైన స్వాగ‌త స‌త్కారాన్ని దృష్టిలో పెట్టుకొంటే నేను నా సొంత ఇంటికే వ‌చ్చినట్లు అనిపిస్తోంది. ఇందుకుగాను మ‌య‌న్మార్ ప్ర‌భుత్వానికి నేను కృత‌జ్ఞుడినై ఉంటాను.

ఎక్స్‌లెన్సీ,

మ‌య‌న్మార్ శాంతి సాధన ప్ర‌క్రియ‌లో సాహ‌సంతో కూడినటువంటి మీ నాయ‌క‌త్వం ప్ర‌శంసార్హ‌మైంది. మీరు ఎదుర్కొంటున్న స‌వాళ్ళ‌ను మేము పూర్తిగా అవ‌గాహ‌న చేసుకోగ‌లం. రాఖైన్ స్టేట్ లో ఉగ్ర‌వాదుల హింస కార‌ణంగా అమాయ‌క ప్ర‌జ‌లు మ‌రియు భ‌ద్ర‌తా ద‌ళ సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్న నేప‌థ్యంలో మీరు చెందుతున్న వేద‌న‌లో మేము కూడా పాలుపంచుకొంటున్నాం.

సుదీర్ఘ‌మైన శాంతి ప్ర‌క్రియ కావ‌చ్చు లేదా ఒక నిర్దిష్ట స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం కావ‌చ్చు- సంబంధిత వ‌ర్గాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా ఒక ప‌రిష్కార మార్గాన్ని అన్వేషిస్తాయ‌ని- మేము ఆశిస్తున్నాము. అటువంటి ప‌రిష్కారం మ‌య‌న్మార్ ప్రాదేశిక స‌మ‌గ్ర‌త మ‌రియు స‌మైక్య‌త‌ను గౌర‌విస్తూనే, అంద‌రికీ స‌మ్మానాన్ని, న్యాయాన్ని మ‌రియు శాంతిని అందించేది అవ్వాలి.

మిత్రులారా,

భార‌త‌దేశపు ప్ర‌జాస్వామ్యానుభ‌వం మ‌య‌న్మార్ విష‌యంలోనూ వ‌ర్తిస్తుంద‌నే నేను న‌మ్ముతున్నాను. మరి ఇందుకోసం, కార్య‌నిర్వ‌హ‌ణ శాఖ, చ‌ట్ట స‌భ‌లు, ఎన్నిక‌ల సంఘం మ‌రియు ప్రెస్ కౌన్సిల్ ల వంటి సంస్థ‌ల సామ‌ర్ధ్యం పెంపుద‌ల విష‌యంలో స‌మ‌గ్ర స‌హ‌కారాన్ని అందించినందుకు మేం గ‌ర్విస్తున్నాం. ఇరుగుపొరుగు దేశాలు కావ‌డంతో, భ‌ద్ర‌త రంగంలో మ‌న ప్ర‌యోజ‌నాలు ఒకే విధమైనటువంటివి. మ‌న దీర్ఘ ప్రాదేశిక మ‌రియు కోస్తా తీర స‌రిహ‌ద్దులలో స్థిర‌త్వాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డం కోసం మ‌నం క‌ల‌సి ప‌ని చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ర‌హ‌దారులు మ‌రియు వంతెన‌ల నిర్మాణం, శ‌క్తి రంగంలో సంబంధాలు, అనుసంధానాన్ని మెరుగుప‌ర‌చుకోవ‌డం కోసం మ‌నం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక మంచి భ‌విష్య‌త్తు దిశ‌గా సంకేతాల‌ను అందిస్తున్నాయి. కాలాదాన్ ప్రాజెక్టులో భాగ‌మైన సిత్వే ఓడ‌రేవు మ‌రియు ప‌లేత్వా దేశీయ జ‌ల మార్గాల టెర్మిన‌ల్‌ల ప‌నుల‌ను పూర్తి చేయ‌డం జ‌రిగింది. ర‌హ‌దారి ప‌నులు మొద‌ల‌య్యాయి. ఎగువ మ‌య‌న్మార్ అవ‌స‌రాల‌ను తీర్చ‌డం కోసం భార‌త‌దేశం నుండి అధిక వేగ‌వంత‌మైన డీజిల్ ట్ర‌క్కుల రాక‌పోక‌లు కూడా ఆరంభ‌మ‌య్యాయి. మ‌న అభివృద్ధి సంబంధిత భాగ‌స్వామ్యంలో భాగంగా మ‌య‌న్మార్ లో అధిక నాణ్య‌త‌తో కూడిన ఆరోగ్యం, విద్య మ‌రియు ప‌రిశోధ‌న స‌దుపాయాల‌ను అభివృద్ధి ప‌ర‌చ‌డం సంతోషం క‌లిగిస్తోంది. ఈ సంద‌ర్భంగా ‘మ‌య‌న్మార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జి’, ఇంకా ‘అడ్వాన్స్‌డ్ సెంట‌ర్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిస‌ర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్’ ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సి ఉంటుంది. ఈ రెండు సంస్థ‌లు విద్యా బోధ‌న‌కు ప్ర‌ధాన కేంద్రాలుగా త‌ళుకులీనుతున్నాయి. భవిష్య‌త్తులో మ‌య‌న్మార్ అవ‌స‌రాలు మ‌రియు ప్రాథమ్యాల‌కు అనుగుణంగానే మ‌న ప్రాజెక్టులు అమ‌ల‌వుతాయి. ఉభ‌య దేశాల మ‌ధ్య ఈ రోజు కుదిరిన ఒప్పందాలు మ‌న బ‌హుముఖీన ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని మ‌రింత వ‌ర్ధిల్ల‌జేసేవే.

మిత్రులారా,

భార‌త‌దేశానికి రావాల‌న్న ఆస‌క్తి క‌లిగిన మ‌య‌న్మార్ పౌరులంద‌రికీ గ్రాటిస్ వీసాను ఇవ్వాల‌ని మేము నిర్ణ‌యించామ‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంతేకాకుండా, భార‌త‌దేశంలోని జైళ్ళ‌లో ఉన్న మ‌య‌న్మార్ పౌరులు 50 మందిని విడుద‌ల చేయాల‌ని కూడా మేం నిర్ణ‌యించామ‌ని మీకు తెలియ‌జేయ‌డం సైతం న‌న్ను ఆనందప‌రుస్తోంది. వారు త్వ‌ర‌లోనే మ‌య‌న్మార్ లోని తమ కుటుంబ స‌భ్యుల‌ను కలుసుకొంటార‌ని మేం ఆశిస్తున్నాం.

ఎక్స్‌లెన్సీ,

నే పీ టా లో నా ప‌ర్య‌ట‌న సార్థకమైంది. మ‌య‌న్మార్ లో నేను పాల్గొన‌బోయే మిగ‌తా కార్య‌క్ర‌మాల‌ను త‌ల‌చుకొంటేనే ఎంతో ఉద్వేగంగా ఉంది. ఇవాళ నేను బాగాన్ లో ఆనందా దేవాల‌యానికి వెళ్లబోతున్నాను. గ‌త సంవ‌త్స‌రం భూకంపం బారిన ప‌డి ధ్వంస‌మైన ఆనంద దేవాల‌యం, మ‌రికొన్ని చారిత్ర‌క, సాంస్కృతిక భ‌వ‌నాల మ‌ర‌మ్మతు ప‌నులు భార‌త‌దేశం తోడ్పాటుతో కొన‌సాగుతున్నాయి. యంగూన్ లో భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లతో భేటీ తో పాటు, మ‌తప‌ర‌మైన మ‌రియు చారిత్ర‌క ప్రాముఖ్యం క‌లిగిన క‌ట్ట‌డాల వ‌ద్ద నేను నివాళులు అర్పించ‌నున్నాను. రానున్న కాలంలో మ‌న‌కు ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం సిద్ధించే విధంగా ఒక బ‌ల‌మైన మ‌రియు స‌న్నిహిత‌మైన భాగ‌స్వామ్యాన్ని ఆవిష్క‌రించ‌డం కోసం మ‌నం క‌లిసి కృషి చేస్తామ‌న్న న‌మ్మ‌కం నాకుంది.

మీ కంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

చేజూ తిన్ బా దె

***