Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేష‌న‌ల్ మేరిటైమ్ డే నాడు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి; జ‌ల శ‌క్తి పై శ్ర‌ద్ధ వ‌హించ‌డంలో బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ను ఒక ప్రేర‌ణ‌గా స్మ‌రించిన ప్ర‌ధాన మంత్రి.


నేష‌న‌ల్ మేరిటైమ్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

‘‘భార‌తదేశం లో సుసంప‌న్న‌మైన చ‌రిత్ర‌ను క‌లిగి వున్నటువంటి స‌ముద్ర సంబంధిత రంగానికి మ‌న దేశం యొక్క ప‌రివ‌ర్త‌న‌ కు దోహదం చేయగల సామర్థ్యం ఉన్నది. మ‌న స‌ముద్ర సంబంధిత శ‌క్తుల‌ను వినియోగించుకొని దేశ ప్ర‌జ‌ల స‌మృద్ధికి పాటుప‌డాల‌న్న మ‌న వ‌చ‌నబ‌ద్ధ‌త‌ ను నేష‌న‌ల్ మేరిటైమ్ డే సందర్భంగా పున‌రుద్ఘాటిద్దాం.

ఒక గ‌తిశీలమైనటువంటి సముద్ర సంబంధిత రంగం ఆవిష్కార దిశ‌ గా మ‌నం చేస్తున్న ప్ర‌య‌త్నాలకు డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ స్ఫూర్తిదాత. జ‌ల శ‌క్తి సూచిక‌లైన జ‌ల మార్గాలు, సేద్య‌పు నీటి పారుద‌ల‌, కాలువల శ్రేణి, ఇంకా నౌకాశ్ర‌యాల‌కు అగ్ర‌తాంబూలాన్ని ఇచ్చారు బాబాసాహెబ్. ఈ రంగంలో ఆయ‌న చేసిన కృషి భార‌త‌దేశ ప్ర‌జానికానికి ఎంతో మేలు ను చేకూర్చింది’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

****