Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేశనల్ క్రియేటర్స్ అవార్డ్ పోటీ లోపాలుపంచుకోవలసింది గా ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి


మైగవ్ (MyGov) వెబ్‌సైట్ లో లభ్యమవుతున్న నేశనల్ క్రియేటర్స్ అవార్డు స్పర్థ లో పాలుపంచుకోవలసింది గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

నేశనల్ క్రియేటర్స్ అవార్డు ను గురించి తెలియజేస్తూ ఎక్స్ మాధ్యం లో మైగవ్ఇండియా (MyGovIndia) ఉంచిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘మన సృజనకారుల సముదాయాని కి లభిస్తున్నటువంటి ఒక మహా అవకాశం ఇది, యావత్తు భారతదేశం లో నెలకొన్న అసాధారణమైన ప్రతిభావంతుల ను ఈ పోటీ వెలుగు లోకి తీసుకు రానుంది. మన యువ శక్తి ప్రతినిధులు.. వారు నూతన ఆవిష్కర్తలు కావచ్చు, లేదా ప్రేరణ ను ఇచ్చేటటువంటి వారు కావచ్చు, లేదా మార్పు ను తీసుకు వచ్చేటటువంటి వారు కావచ్చు.. వారి ని మనం సత్కరించుకొందాం.

ముందడుగు ను వేసి, ఈ పోటీ లో పాలుపంచుకోండి; ప్రతిభాశాలి సృజనకారుల కోసం దేశ ప్రజల ను కరతాళ ధ్వనులు చేయనివ్వండి..’’ అంటూ ఎక్స్ మధ్యం లో పొంపదుపరచిన ఒక సందేశం లో పేర్కొన్నారు.