Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్రధానితో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

నేపాల్ ప్రధానితో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ


ఐరాసా సాధారణ సభ (యుఎన్‌జిఎ) 79వ సమావేశం సందర్భంగా ఈ రోజు నేపాల్ ప్రధాని శ్రీ కె.పి.శర్మ ఓలీతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
భారతదేశానికి, నేపాల్ కు మధ్యగల అద్వితీయ, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను ఇద్దరు నేతలూ సమీక్షించారు. అభివృద్ధి ప్రధానమైన భాగస్వామ్యం, జలవిద్యుచ్ఛక్తి రంగంలో సహకారం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర బంధం సహా వివిధ రంగాలలో నమోదైన ప్రగతి పట్ల, అంతేకాకుండా భౌతిక సంధానాన్ని, డిజిటల్ మాధ్యమంలో సంధానాన్నీ, శక్తి రంగంలో సంధానాన్ని పెంచుకోవడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేషనల్ సోలర్ అలయెన్స్- ఐఎస్ఎ)లో పూర్తి సభ్యత్వాన్ని స్వీకరించిన 101వ దేశంగా నేపాల్ చొరవను తీసుకొన్నందుకు ప్రధాన మంత్రి అభినందనలను తెలియజేశారు. వాతావరణ మార్పు సంబంధిత సవాలుకు ప్రాంతీయ సమాధానాన్ని వెదకడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘పొరుగు దేశాలకు ప్రధమ ప్రాధాన్యం’ అన్న భారత విధానంలో భాగంగా- నేపాల్ ఒక ప్రాధాన్య భాగస్వామిగా ఉంది. మన నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీని మరింత ముందుకు తీసుకుపోవడానికి భారత్, నేపాల్ ద్వైపాక్షిక ఉన్నత స్థాయి చర్చలు  కొనసాగుతూనే ఉంటాయి.