Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్లో వైమానిక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి


నేపాల్ లో ఓ విమానం కూలిపోయిన ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నేపాల్ లో జరిగిన దు:ఖదాయకమైనటువంటి విమాన ప్రమాద ఘటన లో భారతదేశ పౌరులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి బాధపడ్డాను. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. మరణించిన వ్యక్తుల ఆత్మశాంతి కై ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH