Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేడు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని న‌యా రాయ్‌పూర్‌లో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. దీనితో పాటు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలోని కురుభ‌ట్‌లో శ్యామాప్ర‌సాద్ ముఖ‌ర్జీ జాతీయ రుర్బ‌న్ మిష‌న్‌ను ప్రధాని ప్రారంభిచనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామాల పురోగతి క్లస్టర్లను అభివృద్ధి చేయటం.. తద్వారా ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేందేలా చేయటమే రుర్బన్‌ పథకం ముఖ్యోద్దేశం. ఆర్థిక కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, అన్ని వసతులు కల్పించటం ద్వారా స్థానికంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు.

ఒడిశాలోని బార్‌గఢ్‌లో బహిరంగసభలో శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటారు. సాయంత్రం కోల్‌కతాలో జరిగే.. గౌడియా మిషన్ అండ్ మఠ్ వ్యవస్థాపక శతాబ్ది ఉత్సవాలను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.