Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నెదర్లాండ్ ప్రధానమంత్రిని కలిసిన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నెదర్లాండ్ ప్రధానమంత్రిని కలిసిన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , నెదర్లాండ్ ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సీ మార్క్ రుట్టెని సెప్టెంబర్ 10,2023 జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా న్యూఢిల్లీలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన నెదర్లాండ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
ఇండియా జి 20 అధ్యక్ష బాధ్యతలను, శిఖరాగ్ర సమ్మేళనాన్ని  విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు.
అలాగే చంద్రయాన్ మిషన్ విజయవంతం కావడం పట్ల కూడా అభినందనలు తెలిపారు. ఆదిత్య మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఇరుదేశాల మధ్య మరింత లోతైన ద్వైపాక్షిక భాగస్వామ్యం కొనసాగేందుకు అలాగే వాణిజ్యం, పెట్టుబడులు రక్షణరంగం, భద్రత, పరిశుభ్రమైన ఇంధనం, హరిత హైడ్రోజన్, సెమీ కండక్టర్లు,
సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతికత తో పాటు పలు ఇతర అంశాల విషయంలో  సహకారానికి సంబంధించిన అవకాశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.
పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలపై కూడా ఉభయ నాయకులు చర్చించారు.

 

***