నూతన నేశనల్ ఇన్స్ టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి స్)కు
2021-2022 వరకు మొత్తం 4371.90 కోట్ల రూపాయల వ్యయం తో శాశ్వత కేంపస్ ల ను ఏర్పాటు చేయడం కోసం సవరించిన వ్యయ అంచనాల కు (ఆర్సిఇ) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎన్ఐటి లను 2009వ సంవత్సరం లో స్థాపించడమైంది. ఇవి వాటికి ఉద్దేశించిన తాత్కాలిక కేంపస్ ల లో చాలా పరిమితమైనటువంటి జాగా లో పరిమిత మౌలిక సదుపాయాల తో 2010-2011 విద్యా సంవత్సరం నుండి పని చేయడం మొదలుపెట్టాయి. నిర్మాణానికి కావలసినటువంటి భూమి ని తుది నిర్ణయం చేయడం లో జాప్యం కావడం తో పాటు నిర్మాణ పనుల కు ఆమోదం తెలిపిన వ్యయం వాస్తవిక ఆవశ్యకతల కన్నా బాగా తక్కువ గా ఉన్నాయన్న కారణాల రీత్యా శాశ్వత కేంపస్ లో పథకాల ను అనుకున్న విధం గా పూర్తి చేయడం జరుగలేదు.
ఆమోదం లభించినటువంటి సవరించిన వ్యయ అంచనాల తో, ఈ ఎన్ఐటి లు 2022వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ కల్లా వాటి వాటి శాశ్వత కేంపస్ ల లో నుండే పూర్తి స్థాయి లో విధుల ను నిర్వహించ గలుగుతాయి. ఈ కేంపస్ ల లో సంపూర్ణ విద్యార్థుల సామర్ధ్యం 6320గా ఉంటుంది.
ఎన్ఐటి లు జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంస్థ లు. ఇవి ఇంజినీరింగ్ మరియు సాంకేతిక విజ్ఞాన రంగం లో ఉత్తమమైన బోధన సంస్థలు గా పేరు తెచ్చుకొన్నాయి. అధిక నాణ్యత తో కూడిన సాంకేతిక విద్య ను అందించడం ద్వారా ఇవి తమకంటూ ఒక విశేషమైన ఉనికి ని సంపాదించుకొన్నాయి. ఈ సంస్థ లు ఉన్నత నాణ్యత తో కూడిన సాంకేతిక మానవ వనరుల ను అందించగలిగే సామర్ధ్యం కలిగి ఉన్నాయి. వీటి వల్ల దేశవ్యాప్తం గా నవ పారిశ్రామికత్వాని కి దన్ను లభించడమే కాకుండా ఉద్యోగ అవకాశాల కల్పన కు ప్రోత్సాహం కూడా లభిస్తుంది.
**