భారత ప్రభుత్వ నూతన కేబినెట్ సెక్రటరి గా శ్రీ రాజీవ్ గాబా నేడు పదవీ బాధ్యత లు స్వీకరించారు. ఈ పదవి ని ఇంతకు ముందు నిర్వహించిన శ్రీ పి.కె. సిన్హా సూపర్ ఆన్యుయేశన్ కారణం గా ఈ పరిణామం చోటు చేసుకొంది. శ్రీ రాజీవ్ గాబా ఝార్ఖండ్ కేడర్ (1982 బ్యాచ్)కు చెందిన ఐఎఎస్ అధికారి. కేంద్ర హోం కార్యదర్శి, భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి మరియు ఝార్ఖండ్ చీఫ్ సెక్రటరి ల వంటి ముఖ్యమైన బాధ్యతల ను ఆయన నిర్వహించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్)లో భారతదేశాని కి ప్రతినిధి గా కూడా శ్రీ రాజీవ్ గాబా వ్యవహరించారు.
శ్రీ గాబా కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లో భద్రత, పరిపాలన, ఇంకా ఆర్థిక విభాగాల లో విస్తృత శ్రేణి అనుభవం తో పాటు అంతర్జాతీయ సంస్థల లో కూడా పని చేసిన అనుభవం కూడా ఉంది.
370వ అధికరణం రద్దు చేయాలని మరియు జమ్ము & కశ్మీర్ ను పునర్ వ్యవస్థీకరించాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని అమలు పరచిన కీలక అధికారుల లో ఒక అధికారి గా శ్రీ గాబా ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఎటువంటి లోటు కు తావు ఇవ్వకుండాను, సాఫీ గాను అమలు పరచడం లో బహుళమైనటువంటి ఖ్యాతి ఆయన కు దక్కింది. ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలిస్తారని పేరు తెచ్చుకొన్న శ్రీ గాబా, ఎంహెచ్ఎ లో ఈ కార్యక్రమాల రూపకల్పన కు, ఆచరణ కు నాయకత్వం వహించారు. ఆయన చిన్నదైనటువంటి ఒక కీలక బృందం సహకారం తో భద్రత సంబంధమైన మరియు పరిపాలన సంబంధమైన ఏర్పాట్ల పై కసరత్తు చేస్తూనే, రాజ్యాంగ పరమైన మరియు న్యాయ పరమైన అంశాల కు తుది రూపు ను ఇచ్చారు.
అంత క్రితం, ఎంహెచ్ఎ లో అదనపు కార్యదర్శి గా శ్రీ గాబా తన సేవల ను అందించిన కాలం లో, వామ పక్ష ఉగ్రవాద సమస్య పరిష్కారం కోసం 2015వ సంవత్సరం లో ఒక బహుముఖీనమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ను సిద్ధం చేశారు. అంతే కాక ఆ ప్రణాళిక అమలు కు సారథ్యాన్ని కూడా ఆయన వహించారు. తత్ఫలితం గా మావోయిస్టు ల ప్రాబల్య క్షేత్రాల వ్యాప్తి గణనీయం గా కుదించుకు పోయింది.
ఎంహెచ్ఎ కు అదనం గా, పట్టణాభివృద్ధి, రక్షణ, పర్యావరణం, అడవులు, ఇలెక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ విభాగం ల వంటి విస్తృత శ్రేణి కలిగిన రంగాల లో కేంద్ర ప్రభుత్వాని కి శ్రీ గాబా సేవల ను అందించారు.
ఝార్ఖండ్ చీఫ్ సెక్రటరి గా శ్రీ గాబా పని చేసిన కాలం లో, మంత్రిత్వ శాఖల సిబ్బంది కుదింపు, పునర్ వ్యవస్థీకరణ, వృత్తి నిపుణుల కు పార్శ్విక ప్రవేశాన్ని కల్పించడం, శ్రామిక సంస్కరణల కు చోటు ఇవ్వడం వంటి పలు ప్రధాన పరిపాలన సంబంధిత మరియు ఆర్థిక సంబంధిత సంస్కరణల ను ప్రవేశపెట్టారు. ఆయన పదవీకాలం లో ఝార్ఖండ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అడుగు స్థానం నుండి మూడో స్థానాని కి ఎగబాకింది.
శ్రీ గాబా ఐఎమ్ఎఫ్ యొక్క బోర్డు లో నాలుగు సంవత్సరాల పాటు భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించారు.