Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నూట ఏభై కి పైగా చిరుధాన్యాల విత్తనాలరకాల ను భద్రపరచిన లహరీ బాయి గారి ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి


మధ్య ప్రదేశ్ లోని డిండౌరీ నివాసి 27 ఏళ్ళ వయస్సు కలిగిన ఆదివాసి మహిళ లహరీ బాయి గారు చిరుధాన్యాల కు బ్రాండ్ ఏంబాసడర్ గా మారినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు. ఆమె 150 కి పైగా చిరుధాన్యాల విత్తనాల రకాల ను భద్రపరచారు.

 

డీడీ న్యూజ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

 

‘‘లహరీ బాయి గారి ని చూసి గర్వపడుతున్నాను, ఆమె ‘శ్రీ అన్నం’ పట్ల ప్రశంసాయోగ్యం అయినటువంటి ఉత్సుకత ను చాటారు. ఆమె యొక్క ప్రయాస లు మరెంతో మంది కి ప్రేరణ ను ఇస్తాయి.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST