Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నీతి ఆయోగ్ పాలక మండలి తొమ్మిదో సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి


నీతి ఆయోగ్ పాలక మండలి తొమ్మిదో సమావేశం న్యూ ఢిల్లీలో ఈ రోజు జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘నేను @NITIAayog పాలక మండలి తొమ్మిదో సమావేశం లో పాల్గొన్నాను.  అభివృద్ధి చెందిన భారతదేశం (‘వికసిత్ భారత్’) ను నిర్మించడం కోసం కేంద్రంతో పాటు రాష్ట్రాలు సామూహిక ప్రయత్నాలను చేయడం ఎంత ముఖ్యమో ప్రముఖంగా ప్రస్తావించాను.  పెట్టుబడులను ప్రోత్సహించవలసిన, ఎగుమతులను పెంచవలసిన, యువతకు మరిన్ని నైపుణ్యాభివృద్ధి సంబంధ అవకాశాల కల్పనకు పూచీపడవలసిన, జలశక్తిని సద్వినియోగపరచుకోవలసిన అవసరం సహా అనేక ఇతర విషయాలను గురించి నొక్కిచెప్పాను.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2037976 “

‘‘నేను @NITIAayog పాలక మండలి తొమ్మిదో సమావేశం లో పాల్గొన్నాను. ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆలకించాను.’’

 

 

 

 

***

DS