Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాలుగు దేశాల నాయకుల మొదటి దృశ్య సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు

నాలుగు దేశాల నాయకుల మొదటి దృశ్య సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభ వ్యాఖ్యలు


గౌరవనీయులైన అధ్యక్షులు బైడెన్, ప్రధానమంత్రి మొర్రిసన్, ప్రధానమంత్రి సుగా, 

స్నేహితులను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది.

అధ్యక్షుడు బైడెన్ చేసిన ఈ ప్రయత్నానికి, నా కృతజ్ఞతలు.

గౌరవనీయులారా, 

మన ప్రజాస్వామ్య విలువలతో, మనందరం ఐక్యంగా ఉన్నాము.  ఉదారమైన, బహిరంగ, సమగ్ర ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల మనం నిబద్ధత కలిగి ఉన్నాము. 

టీకాలు, వాతావరణ మార్పు,  అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి ప్రాంతాలపై దృష్టి సారిస్తూ, మన నాలుగు దేశాల బృందాన్ని ప్రపంచ మంచి కోసం ఒక శక్తిగా రూపొందించడమే – ఈ రోజు మన సమావేశంలోని ప్రధానాంశం. 

ఈ సానుకూల దృక్ఫధమే, ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే “వసుధైవ కుటుంబకం” యొక్క పురాతన తత్వశాస్త్రం యొక్క కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. 

మన భాగస్వామ్య విలువలను పెంపొందించుకోడానికీ, సురక్షితమైన, స్థిరమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని ప్రోత్సహించడానికీ, మనం గతంలో కంటే కలిసికట్టుగా పనిచేద్దాం.

నేటి శిఖరాగ్ర సమావేశం ద్వారా మన నాలుగు దేశాల కూటమి కి మంచి సమయం వచ్చిందని భావిస్తున్నాను. 

ఇది ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థిరత్వానికి ప్రధానమైన కేంద్రంగా నిలుస్తుంది. 

మీ అందరికీ ధన్యవాదములు. 

*****