Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నారీ శక్తి వందన్అధినియమ్  ను సమర్థిస్తూ వోటువేసిన రాజ్య సభ ఎంపీ లు అందరికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి


నారీ శక్తి వందన్ అధినియమ్ ను సమర్థిస్తూ వోటుల ను వేసినటువంటి రాజ్య సభ ఎంపీ లు అందరికి ధన్యవాదాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. మన దేశం యొక్క ప్రజాస్వామ్య యాత్ర లో ఇది ఒక నిర్ణాయక క్షణం అని ఆయన అభివర్ణించారు. దేశం లో 140 కోట్ల మంది పౌరుల కు అభినందనల ను ఆయన వ్యక్తం చేశారు.

 

ఇది ఒక శాసనం మాత్రమే కాదు, ఇది మన దేశాన్ని రూపొందించినటువంటి అసంఖ్యక మహిళల ను సమ్మానించుకోవడం. అంతేకాక, ఇది వారి యొక్క అభిప్రాయాలను మరింత ప్రభావవంతమైన రీతి న ఆలకించడానికి పూచీ పడే వచనబద్ధత ను ప్రకటించినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి చర్య గా కూడా ను ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో

‘‘మన దేశం యొక్క ప్రజాస్వామ్య యాత్ర లో ఒక నిర్ణాయక క్షణమిది. 140 కోట్ల మంది భారతీయుల కు అభినందన లు.

నారీ శక్తి వందన్ అధినియమ్ కై వోటు వేసిన రాజ్య సభ ఎంపీలు అందరి కి నేను ధన్యవాదాల ను తెలియజేస్తున్నాను. ఈ విధమైనటువంటి ఏకగ్రీవ సమర్థన నిజంగా సంతోషదాయకమైంది.

నారీ శక్తి వందన్ అధినియమ్ పార్లమెంటు లో ఆమోదం పొందడం తో పాటు గా, మనం భారతదేశం లో మహిళల కు బలమైన ప్రాతినిధ్యం మరియు సశక్తీకరణ సంబంధి యుగాని కి నాంది పలుకుతున్నాం. ఇది ఒక శాసనం మాత్రమే కాదు; ఇది మన దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మరియు భారతదేశాన్ని సుదృఢమైంది గాను సమృద్ధమైంది గాను చేయడం లో తోడ్పడ్డ అసంఖ్యక మహిళల కు సమ్మానించుకోవడం కూడాను అని చెప్పాలి.

మనం ఈ రోజు న సంబురాల ను జరుపుకొంటూ ఉన్న తరుణం లో మనకు మన దేశం లో మహిళలు అందరి యొక్క శక్తి, సాహసం మరియు అజేయమైనటువంటి భావన లు గుర్తు కు వస్తున్నాయి. వారి అభిప్రాయాల ను మరింత ప్రభావవంతం అయిన రీతి న ఆలకించేందుకు పూచీ పడే నిబద్ధత యే ఈ చరిత్రాత్మకమైనటువంటి చర్య అని చెప్పాలి.’’ అని పేర్కొన్నారు.