Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి


న్యూ ఢిల్లీ లోని పూసా లో ఐఎఆర్ఐ లో ఈ రోజు జ‌రిగిన నానాజీ దేశ్‌ముఖ్ శ‌త జ‌యంతి వేడుక ప్రారంభ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

‘‘సాంకేతిక విజ్ఞానం మ‌రియు గ్రామీణ జీవితం’’ ఇతివృత్తం పై ఏర్పాటు చేసిన ఒక ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు మ‌రియు కార్య‌క్ర‌మాలతో పాటు మంచి విధానాలు ఇంకా సేవ‌ల‌కు అద్దం ప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా లబ్ధిదారుల‌తో, కొంత మంది నూత‌న ఆవిష్క‌ర్త‌ల‌తో ప్ర‌ధాన మంత్రి ముచ్చ‌టించారు.

నానాజీ దేశ్‌ముఖ్ మ‌రియు లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ల‌కు ప్ర‌ధాన మంత్రి పుష్పాంజ‌లిని స‌మ‌ర్పించారు. నానాజీ దేశ్‌ముఖ్ స్మార‌క త‌పాలా బిళ్ళ‌ను ఆయ‌న విడుద‌ల చేశారు.

ఎంపీలు మ‌రియు ఎమ్మెల్యేలు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాలలో వేరు వేరు మంత్రిత్వ శాఖ‌ల ప‌థ‌కాలు మ‌రియు కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్న తీరును ప‌ర్య‌వేక్షించడం కోసం రూపొందించిన ఒక స్మార్ట్ గవర్నెన్స్ పోర్ట‌ల్ DISHA ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. ఈ పోర్ట‌ల్ లో 20 మంత్రిత్వ శాఖ‌ల‌కు చెందిన 41 కార్య‌క్ర‌మాలు మ‌రియు ప‌థ‌కాల‌కు చెందిన డేటా సెట్ల‌ను ఇంతవ‌ర‌కు పొందుప‌ర‌చ‌డ‌మైంది.

భార‌త‌దేశంలో గ్రామీణ పౌరుల‌కు సేవ‌ల‌ను అందించ‌డానికి మ‌రియు వారిని శ‌క్తిమంతం చేయ‌డానికి ఉద్దేశించిన ఒక పౌర ప్రధానమైన మొబైల్ యాప్ ‘గ్రామ్ సంవాద్’ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఇది వివిధ గ్రామీణాభివృద్ధి ప‌థ‌కాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఏక గ‌వాక్ష ప‌ద్ధ‌తిలో పౌరుల‌కు చేర‌వేస్తుంది. ప్ర‌స్తుతానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఏడు కార్య‌క్ర‌మాలు ఈ యాప్‌లో చోటు చేసుకొన్నాయి.

ఐఎఆర్ఐ లో ఒక ప్లాంట్ ఫినోమిక్స్ కేంద్రాన్ని మరియు 11 గ్రామీణ స్వ‌తంత్రోపాధి శిక్ష‌ణ సంస్థ‌లను (ఆర్ఎస్‌ఇటిఐ) భ‌వ‌నాల‌ను డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు.

స్వ‌యం స‌హాయక బృందాలు, పంచాయ‌తీలు, జ‌ల సంర‌క్ష‌ణ‌లో నూత‌న ఆవిష్క‌ర్త‌లతో పాటు ‘ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న’ ల‌బ్ధిదారులు.. ఈ వ‌ర్గాల‌కు చెందిన 10,000 మందికి పైగా స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు.

దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం జీవితాన్ని అంకితం చేసిన ఇద్ద‌రు మ‌హా నేత‌లు నానాజీ దేశ్‌ముఖ్‌, ఇంకా లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ల జ‌యంతి దినాన్ని ఈ రోజు జ‌రుపుకొంటున్నామ‌ని ఆయ‌న అన్నారు.

లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ కు యువ‌త‌లో మంచి ఆద‌ర‌ణ ఉన్నద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. మ‌హాత్మ గాంధీ ఇచ్చిన పిలుపు నుండి స్ఫూర్తిని పొంది లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ మ‌రియు డాక్ట‌ర్ లోహియా ల వంటి వారు ‘క్విట్ ఇండియా’ ఉద్య‌మ కాలంలో చురుకుగా ప‌ని చేశార‌ని ఆయ‌న అన్నారు. లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ఎన్న‌డూ అధికారంతో ముడిప‌డిన రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తిని వ్య‌క్తం చేయ‌లేద‌ని, అంతేకాకుండా అవినీతితో ఆయ‌న పోరాడార‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. నానాజీ దేశ్‌ముఖ్ సైతం గ్రామీణాభివృద్ధి కోసం త‌న‌ను తాను అంకితం చేసుకోవ‌డానికే మొగ్గు చూపార‌ని, మ‌న ప‌ల్లెలు స్వ‌యం స‌మృద్ధం కావాల‌ని, అవి పేద‌రికం నుండి విముక్తం పొందాల‌ని ఆయ‌న త‌పించార‌ని ప్రధాన మంత్రి అన్నారు.

అభివృద్ధి కోసం ఉత్త‌మ‌మైన ఆలోచ‌న‌లు చేస్తేనే స‌రిపోద‌ని, కార్య‌క్ర‌మాల‌ను స‌కాలంలో పూర్తి చేయాల‌ని, అభివృద్ధి ఫ‌లాలు లక్షిత ల‌బ్ధిదారుల‌కు అంది తీరాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. న‌గ‌రాల‌తో ముడిప‌డి ఉన్న సౌక‌ర్యాలు మ‌న ప‌ల్లె సీమ‌ల‌కూ ల‌భ్యం కావాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యమే ప్ర‌జాస్వామ్యం యొక్క వాస్త‌వ సారం అని, న‌గ‌రాలు మ‌రియు ప‌ల్లెల అభివృద్ధి యాత్ర‌లో ప్ర‌జ‌ల‌ను క‌లుపుకుపోవాల‌ని ఆయ‌న చెప్పారు. ప్రభుత్వాల‌తో క్ర‌మం త‌ప్ప‌క సంప్ర‌దింపులు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని కూడా ఆయ‌న తెలిపారు.

పారిశుధ్య స‌దుపాయాల లోటు ప‌ల్లెల అభివృద్ధి ప్ర‌స్థానంపైన ప్ర‌తికూల ప్ర‌భావాన్ని ప్ర‌స‌రిస్తోంద‌ని, ఈ కార‌ణంగానే ప్ర‌భుత్వం గ్రామీణ ప్రాంతాలలో మ‌రుగుదొడ్ల నిర్మాణం కోసం పనిచేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

***