Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగ్ పూర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాగ్ పూర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాగ్ పూర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాగ్ పూర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


• దీక్షాభూమిని సందర్శించారు

• అనేక అభివృద్ధి ప్రాజెక్టులు మరియు పథకాలను ప్రారంభించారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నాగ్ పూర్ లోని దీక్షాభూమి ని సందర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు అక్కడ పుష్పాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి కోరాడీ థర్మల్ పవర్ స్టేషన్ ను కూడా సందర్శించారు. ఆ విద్యుత్కేంద్రం ప్రారంభ సూచకంగా ఒక శిలాఫలకాన్ని అక్కడ ఆయన ఆవిష్కరించారు. పవర్ స్టేషన్ లో కార్యకలాపాల నియంత్రణ గదిని సైతం సందర్శించారు.

నాగ్ పూర్ లో ఐఐఐటీ, ఐఐఎమ్ మరియు ఎఐఐఎమ్ఎస్ లకు శంకుస్థాపన చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్లేక్ లను మన్ కాపూర్ ఇన్ డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ కు చెందిన ‘దీక్షాభూమి’పై వెలువరించిన ఒక స్మారక తపాలా బిళ్ల ను ప్రధాన మంత్రి విడుదల చేశారు. ‘లకీ గ్రాహక్ యోజన’ మరియు ‘డిజి-ధన్ వ్యాపార్ యోజన’లలో భాగంగా నిర్వహించిన మెగా డ్రా లో విజేతలయిన వారికి అవార్డులను కూడా ఆయన ప్రదానం చేశారు.

బొటనవేలి ముద్ర ను గుర్తుపట్టే బయోమెట్రిక్ ఆధారితంగా పనిచేసే నగదురహిత చెల్లింపు సాధనమైన ‘భీమ్ ఆధార్’ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, అంబేడ్కర్ జయంతి నాడు నాగ్ పూర్ లో ఉన్నందుకు సంతోషిస్తున్నానన్నారు. దీక్షాభూమి లో ప్రార్థన చేసే అవకాశం దక్కడం తనకు లభించిన గౌరవం అని ఆయన చెప్పారు.

డాక్టర్ అంబేడ్కర్ లో ద్వేషం గాని, ప్రతీకారం గాని లేశమాత్రమైనా లేవు అని శ్రీ మోదీ అన్నారు. ఇది అంబేడ్కర్ ప్రత్యేకత అని ఆయన చెప్పారు.

కోరాడీ విద్యుత్తు కేంద్రాన్ని గురించి ప్రస్తావిస్తూ, 21వ శతాబ్దంలో గొప్ప ప్రాముఖ్యం కలిగిన రంగం ఇంధన రంగం అని ప్రధాన మంత్రి అన్నారు. నవీకరణయోగ్య శక్తి రంగంలో ప్రభుత్వం ప్రముఖంగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు.

భారతదేశం స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. భారతీయులందరూ వారిదైన సొంత ఇల్లును, ఆ ఇంటికి విద్యుత్తు, నీరు తదితర కనీస సదుపాయాలను కలిగివుండాలని ఆయన స్పష్టంచేశారు.

భీమ్ యాప్ దేశవ్యాప్తంగా పలువురి జీవితాలపై సకారాత్మకమైన ప్రభావాన్ని కలగజేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. డిజి-ధన్ ఉద్యమమనేది అవినీతి భూతంతో పోరాడేందుకు ఉద్దేశించిన ఒక పరిశుభ్రతా ఉద్యమం కూడా అని ఆయన చెప్పారు.