నాగ్ పుర్ మరియు బిలాస్ పుర్ ను కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నాగ్ పుర్ రైల్ వే స్టేశన్ లో ఆకుపచ్చటి జెండా ను చూపి, ఆ రైలు ను ప్రారంభించారు.
ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ యక్క రైటు పెట్టెల ను పరిశీలించారు. ఆ రైలు పెట్టెల లో ప్రయానించేటప్పుడు లభించే సౌకర్యాలను ఆయన గమనించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క లోకోమోటివ్ ఇంజను యొక్క నియంత్రణ కేంద్రాన్ని శ్రీ నరేంద్ర మోదీ చూశారు. నాగ్ పుర్ మరియు అజ్ నీ రైల్ వే స్టేశన్ ల అభివృద్ధి ప్రణాళికల ను కూడా ఆయన పరిశీలించారు. ఈ రైలు తో నాగ్ పుర్ నుండి బిలాస్ పుర్ వరకు పట్టే ప్రయాణ కాలం 7-8 గంటల నుండి తగ్గిపోయి 5 గంటల 30 నిమిషాలు అయిపోతుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘నాగ్ పుర్ మరియు బిలాస్ పుర్ ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టాను. ఈ రైలు వల్ల కనెక్టివిటీ బాగా పెరిగిపోనుంది.’’ అని పేర్కొన్నారు.
Flagged off the Vande Bharat Express between Nagpur and Bilaspur. Connectivity will be significantly enhanced by this train. pic.twitter.com/iqPZqXE4Mi
— Narendra Modi (@narendramodi) December 11, 2022
नागपूर-बिलासपूर वंदे भारत एक्स्प्रेसला हिरवा झेंडा दाखवला. या ट्रेनमुळे दळणवळणात लक्षणीय वाढ होईल. pic.twitter.com/KLWGbnQwPr
— Narendra Modi (@narendramodi) December 11, 2022
ప్రధాన మంత్రి నాగ్ పుర్ రైల్ వే స్టేశన్ కు చేరుకొన్నప్పుడు ఆయన వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే, మహారాష్ట్ర గవర్నరు శ్రీ భగత్ సింహ్ కోశ్యారీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్ లతో పాటు రహదారి రవాణా మరియు రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ కూడా ఉన్నారు.
పూర్వరంగం
ఈ రైలు ను ప్రవేశపెట్టినందువల్ల ఆ ప్రాంతం లో పర్యటన రంగాని కి ప్రోత్సాహం లభించడం లో తోడ్పాటు అందడం తో పాటు గా ప్రయాణికుల కు సౌకర్యవంతం గా ఉండేటటువంటి మరియు వేగవంతమైనటువంటి యాత్ర మాధ్యం అంది వస్తుంది. నాగ్ పుర్ నుండి బిలాస్ పుర్ కు ప్రయాణ కాలం 5 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దేశం లో ప్రారంభించిన వందే భారత్ రైళ్ళ లో ఇది ఆరోది అవుతుంది. మరి ఇది మునుపటి వందే భారత్ రైళ్ల తో పోలిస్తే ఒక ఆధునిక వర్షన్ గా ఉంది. ఇది చాలా తేలికైందే కాక తక్కువ వ్యవధి లో అధిక వేగాన్ని అందుకొనే సామర్థ్యాన్ని కూడాను కలిగివుంది. వందే భారత్ 2.0 లో మరిన్ని అదనపు సౌకర్యాల ను జతపరచడమైంది. ఈ రైలు కు కేవలం 52 సెకన్ లలో గంట కు 0 నుండి 100 కిలోమీటర్ వేగాన్ని అందుకోగలగడం వంటి మెరుగైన లక్షణాల ను సంతరించడమైంది. ఈ రైలు గంట కు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందిపుచ్చుకొంటుంది. ఈ సరికొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ బరువు, ఇదివరకటి 430 టన్నుల వర్శన్ తో పోల్చి చూసినప్పుడు, 392 టన్నుల బరువే ఉంటుంది. దీనిలో వై- ఫై కంటెంట్ ఆన్- డిమాండ్ సౌకర్యం సైతం లభిస్తుంది. ప్రతి ఒక్క రైలు పెట్టె లో 32 అంగుళాల తెర లు ప్రయాణికులకు సమాచారం తో పాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. మునుపటి వర్శన్ లో 24 అంగుళాల తెర లు అమర్చడమైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ పర్యావరణ పరం గా చూసినప్పుడు ప్రయాణికుల కు అనుకూలం గా ఉంటుంది. ఎలాగంటే దీని లోని ఏసీ లు శక్తి ని 15 శాతం అధికం గా ఆదా చేయగలుగుతాయి. దీని లోని ట్రాక్శన్ మోటారు కు ధూళి రహిత స్వచ్ఛ శీత గాలి ని వెలువరించే సదుపాయం కల్పించడం తో దీనిలో ప్రయాణించడం మరింత సుఖప్రదం గా ఉంటుంది. ఇదివరకటి వందే భారత్ రైలు లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించే వారికి మాత్రమే అందించిన సైడ్ రిక్లైనర్ సీట్ సౌకర్యాన్ని ఇప్పుడు అన్ని క్లాసుల కు అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ రైలు పెట్టెల కు 180 డిగ్రీ లు వంపు తిరిగే సీట్ ల సౌకర్యాన్ని కూడా కల్పించడమైంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క కొత్త రూపు రేఖల లో భాగం గా గాలి ని శుభ్రపరచడం కోసం రూఫ్ మౌంటెడ్ పేకేజ్ యూనిటు (ఆర్ఎంపియు) లో ఒక ఫోటో కేటలిటిక్ అల్ట్రా వాయ్ లెట్ ఎయర్ ప్యూరిఫికేశన్ సిస్టమ్ ను నెలకొల్పడమైంది. చండీగఢ్ లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ఆర్గనైజేశన్ (సిఐఎస్ఒ) సిఫారసు చేసిన ప్రకారం ఈ వ్యవస్థ ను రూపుదిద్దడమైంది. ఆర్ఎమ్ పియు యొక్క రెండు చివరల లోను దీనిని అమర్చడమైంది. వీచే గాలి లో మరియు తిరిగి బయటకు పోయే గాలి లో రోగకారక క్రిములు, కీటకాలు, సూక్ష్మ జీవులు, వైరస్ లు వంటి వాటి ని వడగట్టి, స్వచ్ఛమైన వాయువు ను అందించడానికే ఈ ఏర్పాటు ను చేయడమైంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 లో ప్రయాణికుల కు విమానం లో లభ్యం అయ్యేటటువంటి అనేక ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటు లో ఉంటాయి. దేశీయం గా రూపొందించిన అటువంటి ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం అయిన ‘కవచ్’ సహా అత్యాధునిక సురక్ష సంబంధి పరికరాల ను ఈ రైలు కు జోడించడమైంది.
*****
DS/TS
Flagged off the Vande Bharat Express between Nagpur and Bilaspur. Connectivity will be significantly enhanced by this train. pic.twitter.com/iqPZqXE4Mi
— Narendra Modi (@narendramodi) December 11, 2022
नागपूर-बिलासपूर वंदे भारत एक्स्प्रेसला हिरवा झेंडा दाखवला. या ट्रेनमुळे दळणवळणात लक्षणीय वाढ होईल. pic.twitter.com/KLWGbnQwPr
— Narendra Modi (@narendramodi) December 11, 2022