Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిని సందర్శించిన ప్రధాని.. అంబేడ్కర్‌ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన


డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

నాగ్‌పూర్‌లో దీక్షాభూమి సందర్శనలో ఉన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

 

నాగపూర్‌లోని దీక్షాభూమిని సామాజిక న్యాయానికి, అణగారిన వర్గాల సాధికారతకు చిహ్నంగా అభివర్ణించిన ప్రధాని.. అంబేడ్కర్ కలలుగన్న భారతదేశాన్ని సాకారం చేసేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

 

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.

 

 

“ నాగపూర్‌లోని దీక్షభూమి సామాజిక న్యాయానికి, అణగారిన వర్గాల సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది.

 

 

గౌరవాన్ని, సమానత్వాన్ని ప్రజలకు అందేలా చూసుకునే రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు తరతరాల భారతీయులు రుణపడి ఉంటారు.

 

పూజ్యనీయులైన బాబాసాహెబ్ చూపిన మార్గంలో ఎల్లప్పుడూ మా ప్రభుత్వం నడుస్తోంది. ఆయన కలలుగన్న దేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టపడి పనిచేయడానికి మా నిబద్ధతను నేను మరోసారి తెలియజేస్తున్నాను.”