Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్.ఫాంగ్నోన్ కొన్యాక్ సభాధ్యక్షత వహించడంపై ప్రధాని హర్షం


   నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ శ్రీమతి ఎస్‌. ఫాంగ్నాన్ కొన్యాక్‌ను గత వారం రాజ్యసభ అధిపతి జగదీప్ ధంకడ్‌ ఉపాధ్యక్షుల బృందంలో సభ్యురాలుగా నియమించారు. అనంతరం ఈ హోదాలో ఆమె సభకు అధ్యక్షత వహించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.

ఈ విధంగా తనకు దక్కిన గౌరవంపై ఆమె ఒక ట్వీట్‌ ద్వారా సంతోషం వ్యక్తం చేయడంపై ప్రధాని స్పందిస్తూ:

“ఇదెంతో గర్వించదగిన క్షణం” అని వ్యాఖ్యానించారు.