Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు. ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విధినిర్వహణలో స్ఫూర్తికి, కరుణకు పేరెన్నికగన్నది నాగా సంస్కృతి అని ఆయన అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ, ఆ సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. నాగాలాండ్ తన సంపన్న సంస్కృతికి, ఆ రాష్ట్ర ప్రజల అపురూప స్వభావానికిగాను వేనోళ్ల ప్రశంసలకు పాత్రమవుతోంది. నాగా సంస్కృతి విధి నిర్వహణ స్ఫూర్తికి, దయకు ప్రసిద్ధిగాంచింది. రాబోయే కాలాల్లో నాగాలాండ్ పురోగతి బాటలో మరింత ముందుకు పయనిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.’’

 

 

 

***

MJPS/SR