Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవీ ముంబయిలో ఇస్కాన్… శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయానికి ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నవీ ముంబయిలో ఇస్కాన్… శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయానికి  ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్నవీ ముంబయిలోని ఖార్‌గర్‌లో స్థాపించిన శ్రీ శ్రీ  రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవం చేశారుఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ఈ తరహా దైవిక కార్యక్రమంలో పాలుపంచుకోవడంశ్రీల ప్రభుపాద స్వామి ఆశీస్సులతోపాటు ఇస్కాన్ సంతుల అపార వాత్సల్యంప్రేమఆప్యాయతలను స్వీకరించడం తన సౌభాగ్యమన్నారుఆరాధనీయులైన సంతులందరికీ ఆయన తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారువారికి ఆయన వందనాన్ని సమర్పించారుశ్రీ శ్రీ  రాధా మదన్‌మోహన్‌జీకి ఓ దేవాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలన్న భావననూదీని ఆకృతినీ ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ… ఆధ్యాత్మికత్వంజ్ఞానం ద్వారా సంపూర్ణ సంప్రదాయానికి ఇది అద్దం పట్టిందన్నారుఈ ఆలయం దైవానికున్న వివిధ రూపాలను కళ్లకు కడుతోందనీ, ‘ఏకో అహం బహు శ్యాం’ అనే ఆలోచనను ప్రతిబింబిస్తోందనీ ఆయన అన్నారునవ తరానికున్న ఆసక్తులనుజిజ్ఞాసను తీర్చడం కోసం రామాయణమహాభారతాలను స్ఫూర్తిగా తీసుకొని ఒక మ్యూజియంను నిర్మిస్తున్నారని ప్రధాని తెలిపారుదీనికి తోడుబృందావనంలో భాగంగా ఉన్న 12 వనాల నుంచి ప్రేరణను పొంది ఒక ఉద్యానాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారని ఆయన చెప్పారుఈ దేవాలయ ప్రాంగణం భారతదేశ ధర్మావలంబనతోపాటు చేతనత్వాన్ని సుసంపన్నం చేసే ఒక పవిత్ర కేంద్రంగా వృద్ధిలోకి రాగలదన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారుఈ పవిత్ర కార్యాన్ని సాధించినందుకు సంతులకుఇస్కాన్ సభ్యులకుమహారాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

పూజనీయులు గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్‌ను శ్రీ మోదీ ఉద్వేగభరితంగా స్మరించుకొంటూమహారాజ్ దార్శనికతఆశీర్వాదాలు భగవాన్ కృష్ణుని పట్ల గాఢ భక్తితో కూడి ఉన్నాయనీఅవి ఈ ప్రాజెక్టులో అంతర్భాగమయ్యాయనీ అభివర్ణించారుమహారాజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినాఆయన ఆధ్యాత్మిక ఉనికిని అందరూ అనుభూతి చెందుతున్నారని శ్రీ మోదీ అన్నారు. మహారాజ్ చూపించిన ప్రేమాదరణలకుఆయన  జ్ఞాపకాలకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద గీతా గ్రంథాన్ని ఆవిష్కరించడానికి మహారాజ్ తనను ఆహ్వానించడాన్నిశ్రీల ప్రభుపాద జీ 125వ జయంతి సందర్బంగా ఆయన మార్గదర్శకత్వాన్ని అందుకోవడాన్ని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారుమహారాజ్ కన్న కలల్లో మరో కల సాకారమైనందుకు ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

‘‘ప్రపంచమంతటా ఉన్న ఇస్కాన్ అనుయాయులు భగవాన్ కృష్ణుని పట్ల వారికున్న భక్తి భావంతో ఒకరితో మరొకరు పెనవేసుకొని ఉన్నారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుశ్రీల ప్రభుపాద స్వామి ప్రబోధాలు భక్తులకు ప్రతి రోజూ మార్గదర్శనం చేస్తున్న మరో బంధమని శ్రీ మోదీ అన్నారుభారత్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాలంలో వేదాలువేదాంతంగీత ప్రాముఖ్యాన్ని శ్రీల ప్రభుపాద స్వామి వ్యాప్తి చేశారనీభక్తి వేదాంతాన్ని సామాన్య ప్రజానీకం చేతనతో ముడివేశారని ప్రధానమంత్రి వివరించారు.70 ఏళ్ల వయసులో చాలా మంది వారి కర్తవ్యాల నిర్వహణ పూర్తి అయిందని భావిస్తారనీశ్రీల ప్రభుపాద స్వామి ఆ వయసులో ఇస్కాన్ మిషన్‌ను మొదలుపెట్టి ప్రపంచం నలుమూలలా పర్యటించి భగవాన్ కృష్ణుని సందేశాన్ని ప్రచారం చేశారని శ్రీ మోదీ అన్నారుఆయన నిర్ణయంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ ప్రజలు ప్రయోజనం పొందారని ప్రధాని చెబుతూ… శ్రీల ప్రభుపాద స్వామి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు మనకు ప్రేరణనిస్తూ ఉంటాయని స్పష్టం చేశారు.

‘‘భారత్ ఒక అసాధారణమైనఅద్భుతమైన నేల.. భౌగోళిక హద్దులున్న భూఖండం అనుకుంటే పొరపాటు.. నిత్య చైతన్యంతోజాజ్వల్యమాన సంస్కృతితో విలసిల్లుతున్న దేశం’’ అని ప్రధానమంత్రి అభివర్ణించారుఆధ్యాత్మికమే ఈ సంస్కృతికి మూలమనిభారత్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆధ్యాత్మికత్వాన్ని అక్కున చేర్చుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారుబౌతిక వాదులు భారత్‌ను భిన్న భాషలప్రాంతాల సమాహారంగానే చూస్తారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అసలైన భారతదేశపు ఆత్మను తెలుసుకోవాలనుకునే వారుఈ దేశ సాంస్కృతిక చేతనతో మమేకం కావాల్సి ఉంటుందని ఆయన చెప్పారుదూర ప్రాచ్యంలో చైతన్య మహాప్రభు వంటి సంతులు బెంగాల్‌లో ఉదయించారనీ, పశ్చిమాన చూస్తే నాందేవ్తుకారామ్జ్ఞానేశ్వర్‌ వంటి సంతులు పుట్టారని ఆయన ప్రస్తావించారుచైతన్య మహాప్రభు సామాన్యుల కోసం మహావాక్యాన్ని ప్రచారం చేయగామహారాష్ట్రలో సాధువులు ‘రామకృష్ణ హరి’ మంత్రాన్ని అందించి ఆధ్యాత్మిక సుధను పంచారని శ్రీ మోదీ తెలిపారుభగవాన్ కృష్ణుడు బోధించిన అపార జ్ఞానాన్ని జ్ఞానేశ్వరి గీత ద్వారా అందరికీ అందుబాటులోకి సంత్ జ్ఞానేశ్వర్‌ తీసుకువచ్చారని శ్రీ మోదీ అన్నారుశ్రీల ప్రభుపాద ఇస్కాన్ మాధ్యమం ద్వారా గీతా వ్యాఖ్యానాలను ప్రచురిస్తూ గీతకు ప్రజాదరణను సంపాదించిపెట్టారనీగీత సారాన్ని ప్రజల చెంతకు చేరవేశారన్నారువేరు వేరు చోట్లవిభిన్న కాలాల్లో జన్మించిన ఈ సంతులు ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి జలాలను వారికే సొంతమైన విశిష్ట మార్గాలలో కాలవలు కట్టించి మరీ పారించారంటూ ప్రధాని చెప్పారుఈ సంతుల జన్మ కాలాల్లోభాషల్లోపద్ధతుల్లోఅవగాహనలోఆలోచనల్లో భేదాలున్నా వారిలోని అంతఃచేతన ఒకటేననీవారందరూ కలసి భక్తి వెలుగులను అందించడం ద్వారా సమాజంలోకి ఒక కొత్త ప్రాణశక్తిని ప్రసరింపచేశారనీసమాజానికి ఒక కొత్త దిశనూకొత్త శక్తినీ సంతరించారని శ్రీ మోదీ అన్నారు.

మానవ సేవే.. భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతికి మూలాధారంగా ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానిస్తూ… అలాంటి ఆధ్యాత్మికత్వంలో దైవానికి సేవ చేయడమూప్రజలకు సేవ చేయడమూ ఒకటిగా మారుతుందని స్పష్టం చేశారుభారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి సాధకులను సమాజంతో పెనవేస్తుందనీకరుణను పెంచుతుందనీవారిని సేవాపథంలో ముందుకు నడిపిస్తుందన్నారు.

నిజమైన సేవ అంటే అది స్వార్థం లేనిదనే అర్థాన్నిచ్చే శ్రీ కృష్ణుని శ్లోకాన్ని ప్రధాని ఉదాహరిస్తూ అన్ని ధర్మ గ్రంథాలూపవిత్ర గ్రంథాలూ సేవ భావనయే ప్రధానాంశంగా రూపొందాయన్నారుఒక సువిశాల సంస్థ ఇస్కాన్ ఈ సేవయే స్ఫూర్తిగా కార్యకలాపాలను నిర్వహిస్తోందనీవిద్యఆరోగ్యంపర్యావరణం రంగాలకు తోడ్పాటునిస్తోందనీ ఆయన చెప్పారుకుంభ్ మేళాలో ఇస్కాన్ సార్థక సేవ కార్యకలాపాలను చేపడుతోందని ఆయన తెలిపారు.

సేవ చేయాలనే భావనతోనే ప్రభుత్వం పౌరుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతోందని ప్రధాని చెప్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారుప్రతి ఒక్క ఇంటికీ టాయిలెట్‌ను నిర్మించడంపేద మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను సమకూర్చడంప్రతి కుటుంబానికీ నల్లా నీటిని అందించడంప్రతి నిరుపేదకూ రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సను ఉచితంగా అందించడంఇదే తరహా సదుపాయాన్ని 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు కూడా కల్పించడంఇల్లు లేని ప్రతి ఒక్కరికీ పక్కా గృహాన్ని అందజేయడం.. ఈ పనులన్నీ ఈ విధమైన సేవాభావంతో చేపడుతున్నవేనని ఆయన వివరించారు.

 

ఈ సేవ స్ఫూర్తే నిజమైన సామాజిక న్యాయాన్ని అందిస్తుందిఇది నిజమైన లౌకికవాదానికి ఒక సంకేతంగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

కృష్ణా సర్క్యూట్‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వివిధ యాత్రాస్థలాలనూధార్మిక స్థలాలనూ కలుపుతోందనీఈ సర్క్యూట్‌‌ గుజరాత్ మొదలు రాజస్థాన్హర్యానాఉత్తరప్రదేశ్ఒడిశా వరకు విస్తరించిందనీ శ్రీ మోదీ స్పష్టం చేశారుఈ స్థలాలను స్వదేశ్ దర్శన్ప్రసాద్ పథకాల్లో భాగంగా తీర్చిదిద్దుతున్నారని ఆయన చెప్పారుఈ దేవాలయాలు భగవాన్ కృష్ణుని వివిధ రూపాలను కళ్లకు కడతాయనీఈ రూపాల్లో భగవాన్ కృష్ణుడు ఆయన బాల్యం మొదలుకొని రాధాతో కలసి పూజలో పాలుపంచుకోవడంఆయన కర్మయోగి రూపంఆయనను ఒక రాజు రూపంలో ఆరాధించడం వరకు ఉన్నాయనీ ప్రధాని అన్నారుభగవాన్ కృష్ణుని జీవనంతో ముడిపడ్డ వివిధ క్షేత్రాల్ని సందర్శించడాన్ని సులభతరంగా మార్చివేయడం కృష్ణా సర్క్యూట్‌‌ ఉద్దేశమనీదీనిని నెరవేర్చడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారన్నారుకృష్ణా సర్క్యూట్‌‌తో ముడిపడ్డ ఈ శ్రద్ధా కేంద్రాలకు భక్తుల్ని చేరవేయడంలో ఇస్కాన్ తోడ్పడవచ్చంటూ ప్రధానమంత్రి సూచించారుమన దేశంలో ఈ తరహా ప్రదేశాల్ని కనీసం అయిదింటిని సందర్శించాల్సిందిగా ఇస్కాన్ తన కేంద్రాలతో అనుబంధం ఉన్న భక్తజనులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

గత పదేళ్లలో దేశం అభివృద్ధివారసత్వం.. ఈ రెండు విషయాల్లోనూ ఏకకాలంలో పురోగతి ఉందని ప్రధానమంత్రి చెబుతూవారసత్వం మాధ్యమం ద్వారా అభివృద్ధిని సాధించే క్రమంలో ఇస్కాన్ వంటి సంస్థలు చెప్పుకోదగ్గ పాత్రను పోషించాలన్నారు.

దేవాలయాలుధార్మిక స్థలాలు వందల ఏళ్లుగా సామాజిక చైతన్య ప్రబోధ కేంద్రాలుగా ఉంటూ వచ్చాయనీవిద్యాబోధనలోనైపుణ్యాభివృద్ధిలో గురుకులాలు కీలక పాత్రను పోషించాయనీ ఆయన తెలిపారుఇస్కాన్ తన కార్యక్రమాల నిర్వహణ ద్వారా యువజనులు వారి జీవనాల్లో ఆధ్యాత్మికతను ఒక భాగంగా చేసుకోవాలనే ప్రేరణనిస్తోందన్నారుఇస్కాన్‌లో యువ సాధకులు వారి సంప్రదాయాల్ని పాటిస్తూనేఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని కూడా అలవర్చుకొంటున్నారనీదీంతో వారి ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ఇతరులకు ఒక నమూనాగా మారుతోందనీ ప్రధాని అన్నారుఇస్కాన్ మార్గదర్శకత్వంలో యువత సేవ చేయడాన్నీఅంకితభావాన్నీ స్ఫూర్తిగా తీసుకొంటూ దేశ హితం కోరి పనిచేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారుదేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భక్తివేదాంత ఆయుర్వేదిక ఉపచార కేంద్రంవైదిక విద్య కోసం ఉద్దేశించిన భక్తివేదాంత కళాశాలలు సమాజానికీదేశానికీ ఉపయోగపడతాయని శ్రీ మోదీ వెల్లడించారు. ‘హీల్ ఇండియా’ అంటూ తాను ఇచ్చిన పిలుపును ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

సమాజం ఆధునిక బాటలో పయనిస్తున్నకొద్దీసమాజంలో కరుణప్రతిస్పందన స్వభావం పెరగాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ అన్నారుమానవత్వంఆత్మీయతలు ఉట్టిపడేస్పందించే గుణమున్న వ్యక్తులతో నిండిఉండేలా సమాజాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని ఆయన ప్రధానంగా చెప్పారుఇస్కాన్ తన భక్తి వేదాంత ప్రచారం ద్వారా ప్రపంచంలో ప్రతిస్పందన స్వభావానికి సరికొత్త ప్రాణశక్తిని ప్రసాదించడంతోపాటు మానవీయ విలువలను ప్రోత్సహించగలుగుతుందని ప్రధాని చెప్పారుఆయన తన ప్రసంగం చివర్లో… శ్రీల ప్రభుపాద స్వామి ఆదర్శాల పరిరక్షణను ఇస్కాన్ ప్రముఖులు కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారురాధా మదన్‌మోహన్‌జీ దేవాలయాన్ని ప్రారంభించుకొన్న సందర్భంగా ఇస్కాన్ కుటుంబంతోపాటు పౌరులందరికీ ఆయన మరోసారి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మహారాష్ట్ర గవర్నరు శ్రీ సి.పిరాధాకృష్ణన్మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ శిందే సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

నేపథ్యం

నవీ ముంబయిలోని ఖార్‌ఘర్‌లో ఇస్కాన్ చేపట్టిన ప్రాజెక్టే శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయంఇది ఎకరాల్లో విస్తరించిందిదీనిలో అనేక దేవతలతో కూడిన ఓ ఆలయంఒక వైదిక విద్యాకేంద్రంఏర్పాటు చేయాలనుకొంటున్న మ్యూజియంలుఒక సభా భవనంఉపచార కేంద్రం వంటివి కూడా భాగంగా ఉండబోతున్నాయివైదిక బోధనలను కొనసాగిస్తుండడం ద్వారా ప్రతి ఒక్కరిలో సోదర భావననూశాంతినీసద్భావననూ పెంపొందించాలన్నదే ఈ దేవాలయ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.