నవరాత్రులలో దేవీ మాతను ఆరాధించడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. పండిత్ భీమ్‌సేన్ జోషి ఆలపించిన ఒక భజనగీతాన్ని కూడా ఈ సందర్భంగా ప్రధాని పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని ప్రధాని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:
‘‘నవరాత్రి సందర్భంగా దేవీ మాతను ఆరాధించడం వల్ల మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పండిత్ భీమ్‌సేన్ జోషి జీ గానం చేసి, మాతకు అంకితమిచ్చిన ఈ భావగర్భిత భజన గీతం మంత్రముగ్ధుల్ని చేసేదిగా ఉంది’’ అని పేర్కొన్నారు.
नवरात्रि पर देवी मां की आराधना मन को असीम शांति से भर देती है। माता को समर्पित पंडित भीमसेन जोशी जी का यह भावपूर्ण भजन मंत्रमुग्ध कर देने वाला है…https://t.co/bMydkzyjPp
— Narendra Modi (@narendramodi) April 1, 2025