రాజ్యాంగ పరిషత్తు 1949వ సంవత్సరం లో భారతదేశ రాజ్యాంగాని కి అంగీకారం తెలిపిన సంఘటన ను స్మరించుకోవడం కోసం నవంబరు 26 న దేశ ప్రజలు రాజ్యాంగ దినాన్ని వేడుక గా జరుపుకోనున్నారు. రాజ్యాంగ దినాన్ని పాటించడం అనేది 2015వ సంవత్సరం లో మొదలైంది. ఈ చరిత్రాత్మకమైన రోజు కు గల ప్రాముఖ్యాన్ని తగిన రీతి న గుర్తించడం కోసం ప్రధాన మంత్రి కనబరచిన దృష్టి కోణం ఆధారం గా ఈ దినాన్ని ఆచరించడం జరుగుతోంది. శ్రీ నరేంద్ర మోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో 2010వ సంవత్సరం లో నిర్వహించినటువంటి ‘‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’’ నాడే ఈ దృష్టి కోణం తాలూకు బీజం అంకురించింది అని కూడా చెప్పవచ్చును.
ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాల లో భాగం గా 2021 నవంబరు 26 వ తేదీన పార్లమెంటు లోను, విజ్ఞాన్ భవన్ లోను ఏర్పాటయ్యే కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు.
పార్లమెంటు లో నిర్వహించే కార్యక్రమం ఉదయం 11 గంటల కు ఆరంభం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని పార్లమెంటు యొక్క సెంట్రల్ హాల్ లో జరుపనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాన్య రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇంకా లోక్ సభ స్పీకర్ లు ప్రసంగిస్తారు. మాన్య రాష్ట్రపతి ప్రసంగించిన అనంతరం రాజ్యాంగ పీఠిక ను చదివే క్రమం లో ఆయన తో పాటు దేశ ప్రజలు ప్రత్యక్షం గా పాలుపంచుకోనున్నారు. రాజ్యాంగ పరిషత్తు చర్చల తాలూకు డిజిటల్ వర్శను ను, భారతదేశ రాజ్యాంగం యొక్క దస్తూరి ప్రతి తాలూకు డిజిటల్ వర్శను ను, అలాగే ఇప్పటివరకు భారతదేశ రాజ్యాంగం లో చోటు చేసుకొన్న అన్ని సవరణల ను చేర్చినటువంటి రాజ్యాంగం యొక్క వర్తమాన వర్శను ను కూడా మాన్య రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ‘కాన్ స్టిట్యూశనల్ డెమోక్రసీ పై ఆన్‌లైన్ క్విజ్’ ను కూడా ఆయన ప్రారంభిస్తారు.
సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో గల ప్లీనరీ హాలు లో సాయంత్రం 5:30 గంటల కు నిర్వహించే రెండు రోజుల రాజ్యాంగ దినోత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో సర్వోన్నత న్యాయస్థానాని కి చెందిన అందరు న్యాయమూర్తులు, అన్ని ఉన్నత న్యాయస్థానాల కు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, అత్యంత అనుభవజ్ఞులైనటువంటి న్యాయమూర్తుల తో పాటు జూనియర్ న్యాయమూర్తులు, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇంకా న్యాయ సమాజం లోని ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు. ప్రముఖుల సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ఇచ్చే ప్రసంగం ఈ కార్యక్రమం లో ఒక భాగం గా ఉంటుంది.
***