ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 17వ తేదీన ఉదయం 10 గంటలకు అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల 82వ సమావేశం ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు.
భారతదేశంలోని చట్టసభల అత్యున్నత సంస్థ అయిన అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల మహాసభ (ఏఐపీవోసీ) 2021లో శతాబ్ది వేడుకలు నిర్వహించుకుంటోంది. ‘ఏఐపీవోసీ’ శతాబ్ది సంవత్సరం నేపథ్యంలో అఖిలభారత ప్రిసైడింగ్ అధికారుల మహాసభ 82వ సమావేశం 2021 నవంబరు 17-18 తేదీలలో సిమ్లాలో నిర్వహించబడుతుంది. కాగా, ఈ మహాసభ తొలి సమావేశం కూడా 1921లో సిమ్లాలోనే నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా హాజరవుతున్నారు.
***