Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నర్మద ఉద్గమ్ స్థలం వద్ద ప్రధాన మంత్రి అర్చనలు; అమర్ కంటక్ లో నమామి నర్మదే – నర్మదా సేవా యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు

నర్మద ఉద్గమ్ స్థలం వద్ద ప్రధాన మంత్రి అర్చనలు; అమర్ కంటక్ లో నమామి నర్మదే – నర్మదా సేవా యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు

నర్మద ఉద్గమ్ స్థలం వద్ద ప్రధాన మంత్రి అర్చనలు; అమర్ కంటక్ లో నమామి నర్మదే – నర్మదా సేవా యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు

నర్మద ఉద్గమ్ స్థలం వద్ద ప్రధాన మంత్రి అర్చనలు; అమర్ కంటక్ లో నమామి నర్మదే – నర్మదా సేవా యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నర్మద నది పుట్టిన చోటు అయినటువంటి నర్మద ఉద్గమ్ స్థల్ వద్ద నెలకొన్న దేవాలయాన్ని ఈ రోజు సందర్శించి, అక్కడ అర్చనలలో పాలు పంచుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని అమర్ కంటక్ లో ‘‘నమామి నర్మదే-నర్మద సేవా యాత్ర’’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో స్వామి అవధేశానంద జీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రిని ‘‘వికాస్ అవతార్’’ గా అభివర్ణించారు. జల సంరక్షణ అంశంపై ప్రజలలో గొప్ప చైతన్యాన్ని రగిలించారని కూడా ఆయన అన్నారు.

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ, నర్మద నదిని ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచంలో అతి నిర్మలమైన నదులలో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. మధ్య ప్రదేశ్ లో నర్మద నది తీరం వెంబడి ఉన్న 18 నగరాలలో నీటి శుద్ధి ప్లాంటులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగదని, ఇతర నదులకు కూడా దీనిని విస్తరిస్తామని తెలిపారు.

ప్రధాన మంత్రి నాయకత్వంలో భారతదేశం ‘‘విశ్వ గురువు’’గా మారగలదన్న విశ్వాసాన్ని శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటై త్వరలో 3వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా ప్రధాన మంత్రికి ఆయన అభినందనలు తెలియజేశారు.

ప్రధాన మంత్రి నర్మద నది కోసం ఉద్దేశించినటువంటి ‘నర్మద ప్రవాహ్ – ది మిషన్ వర్క్ ప్లాన్’ ను ఆవిష్కరించారు.

సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, నర్మద సేవా యాత్ర – యాత్రికులకు శిరస్సు వంచి ప్రమాణాలు అర్పిస్తున్నానన్నారు. వారి ప్రయాస ఫలిస్తుందని, వారి శ్రమ తాలూకు ఫలితం భారతదేశంలో పేదలలోకెల్లా పేదలు అయినటువంటి వారికి అందగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

నర్మద నది శతాబ్దాల తరబడి ప్రాణ ప్రదాతగా ఉంటూ వచ్చిందని, ఇటీవలి కాలంలో నర్మద నది అమానుషమైన తరహాలో దోపిడికి గురైందని, ఈ కారణం వల్లనే నర్మద సేవా యాత్ర అవసరపడినట్లు చెప్పారు. మనం మన నదులను పెంచి పోషించుకోక పోయినట్లయితే నష్టపోయేది మానవాళే అని ఆయన అన్నారు.

సుమారు 150 రోజుల పాటు నర్మద సేవా యాత్ర సాగడం, ప్రపంచ ప్రమాణాల రీత్యా చూసినా అసాధారణమైనటువంటిదని ప్రధాన మంత్రి అన్నారు. నర్మద నది మంచు నుండి కాక వృక్షాల నుండి అవతరించిందని ప్రధాన మంత్రి చెబుతూ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం కూడా మానవ జాతికి చేస్తున్న ఒక గొప్ప సేవా కార్యక్రమమేనని చెప్పారు.

నర్మద నది నుండి ప్రయోజనాలు పొందే గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రజలు, రైతుల తరఫున ప్రధాన మంత్రి నర్మద సేవా యాత్ర ను నిర్వహించినందుకు గాను మధ్య ప్రదేశ్ ప్రజలకు, మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

‘స్వచ్ఛ భారత్ అభియాన్’లో 100 అగ్రగామి స్థానాలను పొందిన నగరాలలో 22 నగరాలు మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవే ఉన్నట్లు ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ ఘనతను సాధించినందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నర్మద సేవా మిషన్ పత్రం భవిష్యత్తును దర్శింపజేసేదిగా ఉందని, ప్రాకృతిక వనరులను సంరక్షించేందుకు తగిన దార్శనికత ఈ పత్రంలో చోటుచేసుకొందని ప్రధాన మంత్రి అన్నారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. ఈ విషయంలో మధ్య ప్రదేశ్ ఒక చక్కని దార్శనిక పత్రాన్ని రూపొందించిందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొనే 2022 సంవత్సరానికల్లా దేశానికి ఒక సానుకూలమైన తోడ్పాటును అందించే సంకల్పాన్ని స్వీకరించవలసిందిగా ప్రజలకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

స్వామి అవధేశానంద ప్రశంసాపూర్వకమైన అభినందన వాక్యాలు పలికినందుకు గాను ఆయనకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగింపులో యాత్ర ముగిసి ఉండవచ్చని, యజ్ఞం మాత్రం ఇప్పుడే ఆరంభమైందన్నారు; నర్మద నది కోసం ప్రజలు వారి వంతుగా తోడ్పాటును అందించేందుకు, త్యాగ బుద్ధిని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉండాలని శ్రీ మోదీ ఉద్బోదించారు.

***