Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నమో ఏప్ లోనివికసిత్ భారత్ ఏంబేసడర్ మాడ్యూల్ లో ప్రభావవంతం అయిన కార్యాల ను నెరవేర్చేటటువంటివంద రోజుల సవాలు ను స్వీకరించండంటూ పౌరుల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి


నమో ఏప్ (Namo App) లోని వికసిత్ భారత్ ఏంబేసడర్ మాడ్యూల్ లో ప్రభావవంతమైన కార్యాల ను నెరవేర్చడానికి సంబంధించిన వంద రోజుల సవాలు ను స్వీకరించండంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ కు ప్రచార కర్త కావడం అనేది మన యొక్క బలాల ను కలబోసుకోవడానికి, అభివృద్ధి ప్రధానమైన కార్యాచరణ ను విస్తరించడానికి మరియు అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఆశయాన్ని సాధించడం కోసం మన శక్తుల ను ఉపయోగించడానికి ఆదర్శవంతమైన మార్గం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘ప్రజలు చోదక శక్తి గా నిలచినప్పుడు అభివృద్ధి సాధన ఏ విధం గా ఉంటుందో 140 కోట్ల మంది భారతీయులు ప్రపంచాని కి చాటిచెప్పారు.

 

వికసిత్ భారత్ గా మన దేశం రూపుదాల్చడం కోసం జరిగే సమష్టి ప్రయాసల లో మనలో ప్రతి ఒక్కరం తోడ్పాటు ను అందించే వ్యక్తులమే.

https://www.narendramodi.in/ViksitBharatAmbassador

వికసిత్ భారత్ ప్రచారకర్త గా మారడం అంటే అది మన యొక్క బలాల ను కలబోసుకోవడాని కి, అభివృద్ధి కార్యాచరణ ను విస్తరింప చేయడాని కి, మరి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల లో ఒకటి గా తీర్చిదిద్దాలన్న మన ఆశయాన్ని నెరవేర్చడానికై మన శక్తుల ను ఉపయోగించడానికి ఒక ఆదర్శప్రాయం అయినటువంటి మార్గం.

నమో ఏప్ లో సభ్యత్వాన్ని తీసుకోవడం తో పాటు గా వికసిత్ భారత్ ఏంబేసడర్ మాడ్యూల్ లో సీదా సాదావే అయినప్పటికీ అమితమైన ప్రభావాన్ని ప్రసరించేటటువంటి కార్యాల ను నెరవేర్చాలన్న వంద రోజుల సవాలు ను స్వీకరించడం కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమం లో మనమంతా చేరిపోదాం, రండి.

 

విభిన్న జీవనరంగాల కు చెందిన అత్యంత శక్తివంతులు మరియు ప్రభావశీలురు అయిన ప్రచారకర్తల లో కొందరు ప్రచారకర్తలతో స్వయం గా భేటీ కావడానికి నేను ఎదురు చూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS