సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తనకు వివిధ చిత్రలేఖనాలు, కళాకృతులను బహుమతిగా ఇచ్చిన యువ మిత్రులతో సంభాషించారు.
ప్రధాని గురించి, కొత్తగా అభివృద్ధి చెందుతున్న భారత్ గురించి కవిత చదివి వినిపించిన బాలికను శ్రీ మోదీ మెచ్చుకున్నారు. తనకు పెయింటింగ్ బహుకరించిన ఓ బాలుడితో శ్రీ మోదీ సంభాషించారు. గృహ లబ్ధిదారుడైన ఆ బాలుడిని వారి కొత్త ఇంటి పనుల పురోగతి గురించి ఆడిగి తెలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. మరో బాలిక ప్రధానమంత్రిపై ఓ కవితను వినిపించింది, ఆమెను ఆయన ప్రశంసించారు.
అనంతరం మహిళా లోకో పైలట్లతో ప్రధానమంత్రి సంభాషించారు. వారు తమ ఉద్యోగాల పట్ల సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. ఏకాగ్రతతో పనిచేయాలని వారికి సూచించి, నూతన ఉద్యోగాలు పొందినందుకు అభినందనలు తెలియజేశారు.
***
नमो भारत ट्रेन के साहिबाबाद-अशोक नगर के नए कॉरिडोर में सफर के दौरान मेरे युवा साथियों की अद्भुत प्रतिभा ने नई ऊर्जा से भर दिया। pic.twitter.com/ov7eUOFKpp
— Narendra Modi (@narendramodi) January 5, 2025