Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నట్వర్ సింగ్ మృతిపపై ప్రధాని మోదీ సంతాపం


   భారత విదేశాంగ శాఖ మాజీమంత్రి శ్రీ నట్వర్ సింగ్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

   దౌత్య లోకానికి అందించిన సేవలతోపాటు విదేశీ విధానాల విషయంలో ఆయన విశేష కృషి చిరస్మరణీయమని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఒక మేధావిగానే కాకుండా అనేక రచనలు చేసిన రచయితగానూ సదా గుర్తుండి పోతారని పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘శ్రీ నట్వర్ సింగ్ మరణ వార్త నన్నెంతో బాధించింది. దౌత్య ప్రపంచానికి విశేష సేవలతోపాటు విదేశాంగ విధానాల రూపకల్పనలో ఆయన కృషి ఎనలేనిది. ఓ మేధావిగానే కాకుండా అద్భుత రచనలు చేసిన రచయితగానూ ఆయన సుప్రసిద్ధులు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను… ఓం శాంతి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/SS/SR