Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధర్మ చక్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


మాన్య రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గారు, ఇతర విశిష్ట అతిథులారా.  ఆషాఢ పూర్ణిమ సందర్భం లో నా అభినందనల ను తెలియజేస్తూ నా ప్రసంగాన్ని మొదలుపెట్టదలచాను.  ఇది గురు పూర్ణిమ గా కూడా వ్యవహారం లో ఉందని మనం ఎరుగుదుము.  ఇది మనకు విద్య ను నేర్పినటువంటి గురువుల ను స్మరించుకొనే రోజు.  ఇదే భావన తో భగవాన్ బుద్ధుని కి మనం శ్రద్ధాంజలి ని ఘటిస్తాము.

మంగోలియా భాష లోని కంజూర్ తాలూకు ప్రతుల ను మంగోలియా ప్రభుత్వానికి బహూకరిస్తుండటం నాకు ప్రసన్నత ను కలిగిస్తున్నది.  ఈ మంగోలియన్ కంజూర్ అంటే మంగోలియా లో ఎనలేని ఆదరణ ఉన్నది.  చాలా వరకు మఠాల లో దీని యొక్క ప్రతి ఒకటి లభ్యం అవుతున్నది.

మిత్రులారా, భగవాన్ బుద్ధుని అష్టాంగ మార్గం అనేక సమాజాల కు మరియు దేశాల కు శ్రేయోపథాన్ని దర్శింపచేస్తున్నది.  అది దయాళుత్వం, ఇంకా కరుణ  ల యొక్క మహత్వాన్ని చాటుతున్నది.  భగవాన్ బుద్ధుని ఉపదేశాలు మన ఆలోచనల లో మరియు మన చేతల లో సీదాసాదా తనానికి ప్రాముఖ్యమివ్వాలని సూచిస్తాయి.  ఎదుటి వారి ని ఎలాగ ఆదరించాలన్నది బౌద్ధం నేర్పుతున్నది.  ప్రజల కు గౌరవం; పేదల కు సమ్మానం; మహిళల కు ఆదరణ; శాంతి అన్నా, మరి అలాగే అహింస అన్నా గౌరవాదరణ లు చూపాలి.   అందుకనే, బౌద్ధ ధర్మం యొక్క ప్రవచనాలు మనుగడకు యోగ్యమైన అటువంటి ఓ చిరస్థాయి గ్రహానికి సాధనాలు గా ఉన్నాయి మరి.

మిత్రులారా, సారనాథ్ లో తన ఒకటో ధర్మోపదేశం లో, అటు తరువాత తన బోధల లో భగవాన్ బుద్ధుడు రెండు అంశాల ను గురించి వివరించారు; అవి ఒకటి ఆశ, ఇంకా రెండోది ఉద్దేశ్యం.  వాటి రెండిటి మధ్య ఒక ప్రగాఢమైనటువంటి సంబంధం ఉన్నట్లు ఆయన గమనించారు.  ఆశ నుండి ఉద్దేశ్యం యొక్క భావన రేకెత్తుతుంది.  భగవాన్ బుద్ధుని దృష్టి లో అది మానవ క్లేశాల ను పరిహరించేటటేవంటిది గా ఉండింది.  మనం ఈ కాలానుగుణం గా మేల్కొనాలి; ఇంకా, ప్రజల లో ఆశ ను పెంపు చేయడం కోసం మనం చేయగలిగిందల్లా చేసి తీరాలి.

మిత్రులారా,  నేను 21 వ శతాబ్దాన్ని గురించి చాలా ఆశాభావం తో ఉన్నాను.  ఈ ఆశ నాకు నా యొక్క యువ మిత్రులు- మన యువత నుండి లభిస్తున్నది.  మీరు ఆశ, నూతన ఆవిష్కరణ, ఇంకా కరుణ అనేవి వేదన ను ఎలాగ నిర్మూలించగలుగుతాయో ఒక గొప్ప ఉదాహరణ ను గురించి తెలుసుకోవాలి అని అనుకొంటే గనక దాని ని మన స్టార్ట్- అప్ రంగం లో కాంచవచ్చును. ప్రతిభాన్విత యువ మస్తిష్కాలు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల కు సమాధానాల ను అన్వేషిస్తున్నాయి.  అతి పెద్ద స్టార్ట్- అప్ ఇకోసిస్టమ్స్ లో ఒకటి భారతదేశం లో నెలకొన్నది.

భగవాన్ బుద్ధుని భావాల తో కూడా జతపడి ఉండండి అంటూ నా యువ మిత్రుల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.  అవి మీకు ప్రేరణ ను అందిస్తాయి, ఇంకా ముందు ఉన్న దారి ని కూడా చూపుతాయి.  ఒక్కొక్క సారి, అవి మిమ్మల్ని ప్రశాంతపరచడం గాని లేదా ప్రసన్నులను గా గాని చేయగలవు.  నిజాని కి, భగవాన్ బుద్ధుని యొక్క బోధల లో ఒకటి అప్ప: దీపో భవ: అనేటటువంటిది; మీకు మీరే ఒక దారి ని చూపే దీపం కండి అని దీని భావం.  ఈ బోధ ఒక అద్భుతమైనటువంటి నిర్వహణ పాఠం, కదూ.

మిత్రులారా,  ప్రస్తుతం ప్రపంచం అసాధారణమైన సవాళ్ల తో పోరాటం చేస్తున్నది.  ఈ సవాళ్ల కు చిరకాల పరిష్కార మార్గాలు భగవాన్ బుద్ధుని యొక్క ఆదర్శాల లో లభ్యం అయ్యేందుకు అవకాశం ఉన్నది.  అవి భూతకాలం లోనూ ఉపయుక్తమైనటువంటివి గా ఉన్నాయి.  అవి వర్తమానం లో సైతం సముచితమైనవే అయి ఉన్నాయి.  మరి, అవి భవిష్యత్తు కాలం లో కూడాను తప్పనిసరి కాగలవు.

మిత్రులారా,  బౌద్ధ వారసత్వ స్థలాల తో మరింత మంది ప్రజల ను కలుపుతూ పోవలసిన తత్ క్షణ అవసరం ఎంత అయినా ఉంది.  భారతదేశం లో ఉంటున్న మన దగ్గర  అటువంటి అనేక స్థలాలు అనేకం ఉన్నాయి.  నా పార్లమెంటరీ నియోజకవర్గం వారాణసీ ని గురించి కూడా ప్రజలు ఎలాగ గుర్తు పెట్టుకొన్నారో మీకు తెలుసునా?  అది సారనాథ్ కు నిలయం అయిన కారణం గానే.  మేము బౌద్ధ స్థలాల కు సంధానం పట్ల శ్రద్ధ వహించదలచాము.  కొద్ది రోజు ల క్రితం, భారతదేశ మంత్రిమండలి కుశీనగర్ విమానాశ్రయాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయం గా తీర్చిదిద్దడం జరుగుతుందని ప్రకటించింది.  ఇది ఎంతో మంది ప్రజలను, యాత్రికులను మరియు పర్యటకుల ను తీసుకురాగలదు.  ఇది చాలా మంది కి ఆర్థిక అవకాశాల ను కూడా కల్పించగలదు.

మీ కోసం భారతదేశం నిరీక్షిస్తున్నది.

మిత్రులారా, మీకు అందరి కి మరొక్క మారు ఇవే నా అభినందన లు.  భగవాన్ బుద్ధుని యొక్క భావధార ప్రకాశాన్ని, కలిసికట్టుతనాన్ని మరియు సోదరభావాన్ని ఇనుమడింపచేయు గాక.  వారి యొక్క ఆశీస్సులు మంచి ని చేయడం కోసం మనల ను ప్రేరేపించు గాక.
మీకు ధన్యవాదములు. అనేకానేక ధన్యవాదములు.

https://youtu.be/dmHedhLr3N8

**