Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

“ద బర్డ్ స్ ఆఫ్ బన్ని గ్రాస్ లాండ్” పేరుతో ఉన్న పుస్తకాన్ని విడుదల చేసిన ప్రధాన మంత్రి

“ద బర్డ్ స్ ఆఫ్ బన్ని గ్రాస్ లాండ్” పేరుతో ఉన్న పుస్తకాన్ని విడుదల చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ “ద బర్డ్ స్ ఆఫ్ బన్నీ గ్రాస్ లాండ్” పేరుతో ఉన్న పుస్తకాన్ని ఈ రోజు న్యూ ఢిల్లీ లో విడుదల చేశారు. ఈ గ్రంథాన్ని గుజరాత్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెజర్ట్ ఇకాలజి (జి యు ఐ డి ఇ) కి చెందిన శాస్త్రవేత్తలు ప్రధాన మంత్రికి బహూకరించారు.

గుజరాత్ లోని కచ్ లో బన్నీ ప్రాంతంలో కానవచ్చే 250 కి పైగా జాతుల పక్షులకు సంబంధించిన పరిశోధనల సంకలనమే ఈ పుస్తకం.

రణ్ ఆఫ్ కచ్ లోని మొక్కలు, పక్షులు, సముద్ర జల చరాల జీవన శైలులపై భుజ్ లోని ద గుజరాత్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెజర్ట్ ఇకాలజి 15 సంవత్సరాలకు పైబడి అధ్యయనం చేస్తోంది.