Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ద‌ళిత పారిశ్రామికుల జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని

ద‌ళిత పారిశ్రామికుల జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని

ద‌ళిత పారిశ్రామికుల జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని

ద‌ళిత పారిశ్రామికుల జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని

ద‌ళిత పారిశ్రామికుల జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవ‌న్ లో జాతీయ ద‌ళిత పారిశ్రామికుల స‌మావేశాన్ని ప్రారంభించారు. ద‌ళిత భార‌తీయ వాణిజ్య‌, పారిశ్రామిక మండ‌లులు (డీఐసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, త‌న “మ‌న్ కీ బాత్ ” కార్య‌క్ర‌మాల‌లో ఒక కార్య‌క్ర‌మాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను వారి హ‌క్కుల‌ను గురించి మాత్ర‌మే మాట్లాడ‌వ‌ద్ద‌ని, వారి బాధ్య‌త‌ల‌ను గురించి కూడా మాట్లాడాల‌ని సూచించారు. నేటి ద‌ళిత పారిశ్రామికుల స‌భ‌ కేవ‌లం వారి బాధ్య‌త‌ల‌ గురించి మాత్ర‌మే మాట్లాడ‌లేద‌ని, వారి బాధ్య‌త‌ల‌ను కూడా విజ‌య‌వంతంగా నెర‌వేర్చింద‌ని ప్ర‌ధాని అన్నారు.

డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌కు ప్ర‌శంస‌లు ప‌లుకుతూ, ఆయ‌న‌ను మ‌న రాజ్యాంగ శిల్పిగా ప‌లువురు కీర్తిస్తార‌ని, అలాగే ఆయ‌న ఒక గొప్ప ఆర్థిక వేత్త కూడా అని ప్ర‌ధాని అన్నారు. భార‌త దేశంలో పారిశ్రామికీక‌ర‌ణ‌పై డాక్ట‌ర్ అంబేద్క‌ర్‌కు ఉన్న దృష్టికోణాన్ని ప్ర‌ధాని శ్రీ మోదీ వివ‌రించారు. త‌మ‌కంటూ సొంత భూమి లేని ద‌ళితులు పారిశ్రామికీక‌ర‌ణ వ‌ల్ల మాత్ర‌మే పురోగ‌మించ‌గ‌ల‌ర‌న్నారు.

ఆర్థిక స‌మ్మిళితం అనేది ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ పెడుతున్న అంశాల‌లో కీల‌క‌మైన‌ద‌ని, ఇది ఉద్యోగాల‌ను కోరుకునే వారి కోసం కాక‌, ఉద్యోగాల‌ను సృష్టించే వారి కోసం ఉద్దేశించింద‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న కింద మంజూరు చేస్తున్న రుణాల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

తొలి త‌రం పారిశ్రామికులకు నెల‌కొల్పిన వెంచ‌ర్ కేపిట‌ల్ ఫండ్ ను గురించి కూడా ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా చెప్పారు.

ప్ర‌భుత్వం ద‌ళిత పారిశ్రామికుల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తోందంటూ వారికి ఆయ‌న హామీనిచ్చారు. ఈ రోజు ఇక్క‌డ గుమికూడిన స‌భ్యుల విజ‌యం, ప్ర‌తికూల‌త‌ను ఎదురొడ్డే ఎవ‌రికైనా స్ఫూర్తిని ఇచ్చేదేన‌ని ప్ర‌ధాని అన్నారు.

వ్యాపార రంగంలో ప్రావీణ్యం క‌న‌బ‌ర‌చినందుకు అయిదు పుర‌స్కారాల‌ను ప్ర‌ధాన మంత్రి ద‌ళిత పారిశ్రామికుల‌కు ప్ర‌దానం చేశారు.

కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార‌త శాఖ మంత్రి శ్రీ థావ‌ర్ చంద్ గెహ్లోత్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.