ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ దౌత్యపరమైన, అధికారిక పాస్‌పోర్టులు గల వారికి వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ ఒక నమూనా అంగీకారానికి ఆమోద ముద్ర వేసింది. దీని వల్ల ఆయా దేశీయులు వీసా లేకుండానే దేశంలోకి ప్రవేశించి 180 రోజుల (అంతకన్నా ఎక్కువ )కాలపరిమితిలో 90 రోజుల వరకు (అంతకన్నా తక్కువ) భారత భూభాగంలో ఎక్కడైనా బస చేయవచ్చు లేదా దేశంలో ఎక్కడికైనా తిరగవచ్చు.
దౌత్యపరంగా దేశంలోకి వచ్చేవారికి, అధికారిక కార్యకలాపాలపై వచ్చే వారికి వీసా రహిత ప్రయాణానికి అనుమతి ఇచ్చే వెసులుబాటు కల్పించడంలో భాగంగా 69 దేశాలతో కుదుర్చుకున్న వీసా రహిత ఒప్పందాలకు కొనసాగింపు ఇది. ఇండియా ఇంకా 130కి పైగా దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది.