Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దోహా లో భారతీయ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

దోహా లో భారతీయ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

దోహా లో భారతీయ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జెనీవాకు బయలుదేరడానికి కొద్ది సేపు ముందు దోహా లో భారతీయ సమూహాన్ని కలుసుకొన్నారు. వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

కతర్ లో పలువురు ఉత్సాహంగా ప్రధాన మంత్రిని కలుసుకోవడానికి తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారు భారతదేశంతో వారు తమ బంధాన్ని ఎన్నటికీ వదులుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రపంచం అంతటా భారతదేశం ప్రతిష్ట పెరుగుతోందని, భారతదేశం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని కుతూహలం నెలకొన్నదని ఆయన తెలిపారు. ఈ మార్పునకు భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజలుకారణమని ఆయన అన్నారు.

భారతదేశం ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అన్న విషయాన్ని ప్రపంచ ఏజెన్సీలు ఒప్పుకొంటున్నాయని, ప్రపంచం మాంద్యాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ గడచిన త్రైమాసికంలో భారతదేశం 7.9 శాతం జి డి పి వృద్ధిని సాధించిందని ప్రధాన మంత్రి వివరించారు.

అవినీతి భారతదేశానికి ఎంతో కాలంగా సమస్యలను సృష్టించిందని, దీనిని నిర్మూలించాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఉంద‌ని ప్రధాన మంత్రి అన్నారు.

తన కతర్ పర్యటన ఫలప్రదం అయినట్లు, ఇరు దేశాల మధ్య దృఢ‌మైన‌ మైత్రితో కూడిన ఒక కొత్త శకాన్ని ఆవిష్కరించే విధంగా సమగ్రమైన సంప్రదింపులు చోటు చేసుకొన్నట్లు ఆయన చెప్పారు. ఈ పర్యటన సందర్భంగా అపూర్వమైన ఆప్యాయతను, ఆతిథ్యాన్ని అందించినందుకు కతర్ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాన మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.