Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దోహాలో కార్మిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని


దోహాలో కార్మిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని


ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఆదివారం దోహా డౌన్ టౌన్ లోని మెషీరెబ్ లో ఉన్న భారత కార్మికుల శిబిరాన్ని సందర్శించారు. ప్రధాని సందర్శనను పురస్కరించుకుని సమావేశమైన కార్మికులనుద్దేశించి ప్రసంగిస్తూ దోహాలో తన తొలి కార్యక్రమం వారిని కలవడమేనని చెప్పారు.

కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని, వాటిని ఖతార్ నాయకులతో సమావేశం సమయంలో చర్చిస్తానని వారికి ప్రధాని హామీ ఇచ్చారు. కార్మికులతో ముఖాముఖి మాట్లాడడానికి వచ్చే ముందు అక్కడ ఉన్న వైద్యశిబిరాన్ని సందర్శించిన ప్రధాని కార్మికుల ఆరోగ్య సంరక్షణలో వైద్యుల కృషిని ప్రశంసించారు. కార్మికులతో ముఖాముఖి సమావేశం అనంతరం ప్రధాని ఒక్కో టేబుల్ వద్దకు వెళ్తూ ఒక్కో బృందంతో వేర్వేరుగా మాట్లాడుతూ కాలం గడిపారు. వారితో కలిసి భోజనం చేశారు.