Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తం గా 10,000 ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేశ‌న్స్ (ఎఫ్‌పిఒ స్)ను 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


 

పిఎమ్ కిసాన్ ల‌బ్ధిదారులంద‌రికి కిసాన్ క్రెడిట్ కార్డుల అంద‌జేతకై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించ‌నున్నారు

పిఎమ్ కిసాన్ కు ఒక సంవత్సరం పూర్తి అయిన సంద‌ర్భం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని చిత్ర కూట్ లో జ‌రిగే కార్య‌క్ర‌మం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

 

దేశవ్యాప్తం గా 10,000 ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ ఆర్గ‌నైజేశ‌న్స్ ను 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 29వ తేదీన చిత్ర కూట్ లో జరిగే ఒక కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు.

దేశం లోని రైతుల లో దాదాపు 86 శాతం మంది చిన్న రైతులు మ‌రియు స‌న్న‌కారు రైతులే. దేశం లో స‌గ‌టు భూ క‌మ‌తం యొక్క విస్తీర్ణం 1.1 హెక్టేర్ క‌న్నా త‌క్కువ‌.  ఈ చిన్న రైతులు, స‌న్న‌కారు రైతులు మ‌రియు భూమి లేని రైతులు పంట కాలం లో భారీ స‌వాళ్ళ ను ఎదుర్కొంటున్నారు.  నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందులు, త‌గినంత నిధులు మ‌రియు సాంకేతిక విజ్ఞానం లభ్యం కాకపోవడం ఈ స‌వాళ్ళ లో కొన్ని సవాళ్లు గా ఉన్నాయి.  వారు ఆర్థిక శ‌క్తి లోపం కార‌ణం గా వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తి ని స‌రిగా మార్కెట్ చేసుకోవ‌డం లోనూ అనేక స‌వాళ్ళ కు ఎదురొడ్డ‌వ‌ల‌సి వ‌స్తున్నది. 

ఈ విధ‌మైన స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించుకొనేందుకు చిన్న‌, స‌న్న‌కారు రైతులు మ‌రియు భూమి లేని రైతుల ను స‌మీక‌రించ‌డం లో, త‌ద్వారా వారికి ఉమ్మ‌డి శ‌క్తి ని ఇవ్వ‌డం లో ఎఫ్‌పిఒ స్ స‌హాయ‌కారి గా ఉంటాయి. ఎఫ్‌పిఒ స‌భ్యులు ఉత్త‌మ‌మైన సాంకేతిక విజ్ఞానం, ఇన్ పుట్స్, ఆర్థిక స‌హాయం మ‌రియు విపణి తాలూకు మెరుగైన అందుబాటు సంబంధిత సౌల‌భ్యాన్ని క‌ల్పించి, రైతుల ఆదాయం త్వ‌రిత‌ గ‌తి న వృద్ధి చెంద‌డం లో తోడ్ప‌నున్నారు.

పిఎం-కిసాన్ కు ఒక ఏడాది పూర్తి

ఇదే కార్య‌క్ర‌మం లో పిఎమ్-కిసాన్ స్కీము ఆరంభం అయి ఒక సంవ‌త్స‌రం పూర్తి కావడాన్ని కూడా గుర్తు కు తీసుకు రానున్నారు. 

మోదీ ప్ర‌భుత్వం రైతుల కోసం ఆదాయపరంగా మ‌ద్ధ‌తిచ్చే ప‌థ‌కాన్ని ప్ర‌ధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (పిఎం-కిసాన్) స్కీము’ పేరు తో ప్రవేశ‌పెట్టింది.  దీని ద్వారా రైతుల వ్య‌వ‌సాయాని కి సంబంధించిన ఖ‌ర్చుల ను, సంబంధిత కార్యకలాపాల ఖర్చుల ను, అలాగే గృహ అవ‌స‌రాల‌ ను తీర్చుకొనగ‌లిగేలా చూడాలనేదే ఈ ప‌థ‌కం ఉద్దేశం. 

ఈ ప‌థ‌కం లో భాగం గా, అర్హులైన లబ్ధిదారుల కు ప్ర‌తి ఒక్క సంవ‌త్స‌రం 6,000 రూపాయ‌ల వ‌ర‌కు ల‌బ్ధి ని అందిస్తున్నారు.  ఈ మొత్తాన్ని ఒక్కొక్క‌టి 2,000 రూపాయ‌ల విలువ గ‌ల వాయిదా రూపం లో నాలుగు నెల‌ల‌ కు ఒక‌సారి చొప్పున మూడు దఫాలు గా  చెల్లిస్తారు.  ప్ర‌త్యక్ష‌ ప్రయోజన బదిలీ పద్ధతి న అర్హులైన లాభితుల బ్యాంకు ఖాతాల లో ఆన్ లైన్ ద్వారా నేరు గా ఈ సొమ్ము ను చెల్లించడం జ‌రుగుతుంది.

ఈ ప‌థ‌కాన్ని 2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నాడు ప్రారంభించ‌డ‌మైంది.  ఈ ప‌థ‌కాని కి 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నాటి కి ఒక సంవ‌త్స‌రం పూర్తి అయింది. 

పిఎమ్-కిసాన్ స్కీము ను రైతులంద‌రి కి విస్త‌రించాల‌ని మోదీ 2.0 ప్ర‌భుత్వ ఒక‌టో మంత్రివ‌ర్గ స‌మావేశం లో ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన‌టువంటి నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డం జ‌రిగింది.

పిఎమ్-కిసాన్ ల‌బ్ధిదారులందరి కి కిసాన్‌ క్రెడిట్ కార్డు (కెసిసి)ని అందించేందుకు ఉద్దేశించిన ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం

పిఎమ్-కిసాన్ స్కీము లో భాగం గా ల‌బ్ధిదారులు అంద‌రికీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ (కెసిసి) పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని కూడాను ప్రధాన మంత్రి 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ నాడు ప్రారంభించ‌నున్నారు.

పిఎమ్-కిసాన్ స్కీము లో భాగం గా దాదాపు 8.5 కోట్ల ల‌బ్ధిదారులు ఉండ‌గా, వారి లో 6.5 కోట్ల కు పైగా ఈసరికే కిసాన్ క్రెడిట్ కార్డు ల‌ను క‌లిగివున్నారు.

తాజా గా చేప‌ట్టేట‌టువంటి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం లో భాగం గా, మిగతా దాదాపు 2 కోట్ల పిఎమ్-కిసాన్ లాభితుల‌కు కూడాను కిసాన్ క్రెడిట్ కార్డుల ను పంపిణీ చేయ‌నున్నారు.

పిఎమ్-కిసాన్ ల‌బ్ధిదారులు అంద‌రికీ రాయితీ తో కూడిన సంస్థాగ‌త ప‌ర‌ప‌తి ని అందుబాటు లోకి తీసుకొని రావ‌డం కోసం ఒక 15 రోజుల ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ మొద‌లుకొని ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ వ‌ర‌కు అమ‌లు చేయ‌డ‌మైంది.  దీని లో భాగం గా, బ్యాంకు ఖాతా సంఖ్య‌, భూమి రికార్డు వివ‌ర‌ణ మ‌రియు తాను మ‌రే ఇత‌ర బ్యాంకు శాఖ నుండి కెసిసి లాభితుడి గా ప్ర‌స్తుతం లేన‌ట్లు వెల్లడి చేసే ఒక ప్ర‌క‌ట‌న స‌హా ప్రాథ‌మిక డేటా ను ఒక పేజీ లో వ్రాసి ఆ పత్రాన్ని స‌మ‌ర్పించ‌వ‌ల‌సి ఉంటుంది.

ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల ను అందించిన పిఎమ్-కిసాన్ లాభితులు అంద‌రిని కిసాన్ క్రెడిట్ కార్డు ల‌ను అప్ప‌గించ‌డం కోసం ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ నాడు వారి ని బ్యాంకు శాఖ‌ ల వ‌ద్ద‌కు పిలిపించ‌నున్నారు.