దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వంద మంది కి పైగా ఆంగన్‌వాడీ వర్కర్ల బృందం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమైంది. ఆంగన్‌వాడీ వర్కర్ల గౌరవ భృతి లో మరియు ఇతర ప్రోత్సాహకాల లో పెంపుదల కు సంబంధించిన ఇటీవలి ప్రకటన కు గాను ప్రధాన మంత్రి సమక్షం లో తమ సంతోషాన్ని వ్యక్తం చేసి ఆయన కు ధన్యవాదాలు తెలిపేందుకుగాను వారు విచ్చేశారు.
ఆంగన్‌వాడీ వర్కర్ల అభినందనల ను ప్రధాన మంత్రి స్వీకరిస్తూ, వారు తనతో భేటీ కావడం కోసం దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఈ రోజు ఇక్కడకు రావడం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు.
ఒక చిన్నారి శారీరికంగాను, జ్ఞానం లోను ఎదుగుదల ను సాధించడంలో పోషణ సంబంధ జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి వివరించారు. ఈ కోణం లో నుండి చూసినప్పుడు ఆంగన్‌వాడీ వర్కర్లు ఒక కీలకమైన భూమిక ను పోషించవలసివుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నిర్వహించుకొంటున్న ‘పోషణ్ మాహ్’ (పోషణ విజ్ఞాన మాసం) ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ఈ ప్రచార ఉద్యమం లో లభించినటువంటి వేగ గతి ని సడలిపోనివ్వరాదని సూచించారు. పోషణ సంబంధ జ్ఞానార్జనకు నిరంతర శ్రద్ధ, మంచి అలవాట్ల ను అలవరచుకోవడం అవసరమంటూ, ఆంగన్‌వాడీ వర్కర్లు వీటిని అందించగలుగుతారని ఆయన అన్నారు. లబ్ధిదారులకు అందజేస్తున్న పోషక విలువల జ్ఞానానికి సంబంధించినట సహాయాన్ని తగిన విధంగా అందేటట్టు చూడవలసిందిగా ఆంగన్‌వాడీ వర్కర్ల కు ఆయన ఉద్బోధించారు.
ఆంగన్‌వాడీ వర్కర్ల మాట లను బాలలు మరింత శ్రద్ధ తో వింటారు; చైతన్యాన్ని వ్యాప్తి చేయడం లో వారిది ఒక కీలక పాత్ర. ఆంగన్‌వాడీ ల మధ్య పరస్పరం ఆరోగ్యదాయకమైన స్పర్ధ ఉండాలని ప్రధాన మంత్రి చెప్తూ, పోషణ సంబంధ జ్ఞానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మరియు కృషి ల పరంగా ఆంగన్‌వాడీ వర్కర్లు ఒకరికి మరొకరు ప్రేరణ గా నిలవాలంటూ ఆయన వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమం లో మహిళలు మరియు బాలల వికాస శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి మేనకా గాంధీ కూడా పాలుపంచుకొన్నారు.
***
Had a delightful interaction with Anganwadi workers from all over India. They were extremely happy with the recent announcement of various incentives for their welfare. https://t.co/aYMkdh9SaS pic.twitter.com/yumpNj2aF8
— Narendra Modi (@narendramodi) September 19, 2018
Anganwadi workers have a vital role in India’s development. During today’s interaction we spoke about aspects relating to nutrition, welfare of children and healthcare, among more issues. pic.twitter.com/wT53TRvRpl
— Narendra Modi (@narendramodi) September 19, 2018