Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి డిజిటల్ ఇండియా తాలూకు వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి


డిజిటల్ ఇండియా లో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు. కామన్ సర్వీస్ సెంటర్ లు, ఎన్ఐసి సెంటర్ లు, నేశనల్ నాలెడ్జ్ నెట్ వర్క్, బిపిఒ లు, మొబైల్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ లు, ఇంకా MyGov స్వచ్ఛంద సేవకులతో సహా 50 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సంభాషణ తో సంధానమయ్యారు. ప్రభుత్వ పథకాలకు చెందినటువంటి వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశాల పరంపర లో ఇది ఆరో ముఖాముఖి సమావేశం.

లబ్ధిదారులతో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అన్ని జీవన మార్గాలకు చెందిన ప్రజలు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు డిజిటల్ సంబంధ సాధికారిత ను సంతరించుకొనేటట్టు చూసేందుకు డిజిటల్ ఇండియా ను ప్రారంభించినట్లు తెలిపారు. దీనిని సాధ్యం చేసేందుకుగాను పల్లెలను ఫైబర్ ఆప్టిక్ ద్వారా సంధానించడం, డిజిటల్ విధానం పట్ల పౌరులను చైతన్యవంతులను చేయడం, మొబైల్ ఫోన్ ల ద్వారా సేవలను అందజేయడం, ఇంకా ఎలక్ట్రానిక్ మేన్యుఫాక్చరింగ్ ను ప్రోత్సహించడం తదితర అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం పై ప్రభుత్వం కృషి చేసినట్లు ఆయన వివరించారు.

సాంకేతిక విజ్ఞ‌ానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సాంకేతిక విజ్ఞ‌ానం జీవించడంలో సారళ్యాన్ని తీసుకు వచ్చిందని, సాంకేతిక విజ్ఞ‌ానం యొక్క ప్రయోజనాలను సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటు లోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంలోని ఉద్దేశమన్నారు. BHIM APP, రైల్వే టికెట్ల ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం, ఉపకార వేతనాలను ఎలక్ట్రానిక్ విధానం లో వితరణ చేయడం, పెన్షన్ లను బ్యాంకు ఖాతా లలో వేయడం సహా పలు ఏర్పాట్లు సామాన్యులకు భారాన్ని ఎంతగానో తగ్గించివేశాయని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్ సి) ల ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, భారతదేశం అంతటా నెలకొన్న సిఎస్ సిలు గ్రామీణ భారతావనికి డిజిటల్ సేవలను అందజేస్తున్నాయన్నారు. సిఎస్ సి లు పల్లె ప్రాంతాలలో గ్రామ స్థాయి నవ పారిశ్రామికులను (విఎల్ఇ) తీర్చిదిద్దడంలో విజయవంతం అయ్యాయి. అంతేకాక 10 లక్షలకు పైగా ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కల్పించాయి కూడాను. భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాలలో 2.92 లక్షలకు పైగా ఉన్న సిఎస్ సి లు 2.15 లక్షల గ్రామ పంచాయతీ లలో వివిధ ప్రభుత్వ సేవలు, తదితర సేవల లభ్యత కు అవకాశాలను ప్రసాదిస్తున్నాయి.

ఇతోధిక డిజిటల్ చెల్లింపుల దిశ గా సాగుతున్న పయనం లో భాగంగా మధ్యవర్తుల ఉనికి మటుమాయం అవుతోందని శ్రీ నరేంద్ర మోదీ తమ సంభాషణ క్రమంలో భాగంగా పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలలో భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. దీనితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా, డిజిటల్ రూపం లోకి మారిపోయింది.

ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ (పిఎమ్ డిజిఐఎస్ హెచ్ఎ) ను గురించి ప్రధాన మంత్రి చెబుతూ, ఈ పథకం ఇప్పటికే 1.25 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ ప్రావీణ్యాన్ని మరియు శిక్షణను అందించిందని, వీరిలో 70 శాతం మంది అభ్యర్థులు ఎస్ సి, ఎస్ టి, ఇంకా ఒబిసి సముదాయాలకు చెందిన వారు ఉన్నారని వివరించారు. ఈ పథకం 20 గంటల మౌలిక కంప్యూటర్ శిక్షణ ద్వారా ఆరు కోట్ల ప్రజలకు డిజిటల్ నైపుణ్యాలతో పాటు బేసిక్ కంప్యూటర్ ట్రయినింగ్ ను అందించడానికి ఉద్దేశించిన పథకం.

డిజిటల్ ఇండియా బిపిఒ రంగాన్ని సైతం ఎన్నో మార్పులకు లోను చేసింది. ఇదివరకు బిపిఒ లు కేవలం పెద్ద నగరాలకు పరిమితం అయ్యాయి. ఇప్పుడు ఇవి చిన్న పట్టణాలకు మరియు పల్లె లకు విస్తరించాయి. వీటి ద్వారా ఉద్యోగ అవకాశాలు లభ్యం అవుతున్నాయి. డిజిటల్ ఇండియా లో భాగంగా ప్రారంభించిన ఇండియా బిపిఒ ప్రమోశన్ స్కీము తో పాటు, ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేకించినటువంటి ఒక బిపిఒ ప్రమోశన్ స్కీము గ్రామీణ ప్రాంతాలలో, ఈశాన్య ప్రాంతాలలో రెండు లక్షల మందికి పైగా ప్రజలకు నూతన ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దేశం అంతటా బిపిఒ యూనిట్ లు ప్రారంభం అవుతుండడంతో ప్రస్తుతం దేశ యువతీయువకులు వారి ఇళ్ల సమీపం లోనే ఉద్యోగాలు పొందుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు.

వివిధ ఎలక్ట్రానిక్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ ల యొక్క ఉద్యోగులతో ప్రధాన మంత్రి సంభాషిస్తూ, గత నాలుగు సంవత్సరాలలో భారతదేశం ఎలక్ట్రానిక్స్ హార్డ్ వేర్ మేన్యుఫాక్చరింగ్ లో ఎంతో దూరం ప్రయాణించినట్లు తెలిపారు. భారతదేశం లో ఎలక్ట్రానిక్ మేన్యుఫాక్చరింగ్ ను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మేన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఇఎమ్ సి) స్కీము ను ఆరంభించింది. ఈ పథకం లో భాగంగా 15 రాష్ట్రాలలో 23 ఇఎమ్ సి లను నెలకొల్పడం జరుగుతోంది. ఈ పథకం దాదాపు ఆరు లక్షల మంది ప్రజలకు ఉద్యోగాలను కల్పించగలదని ఆశిస్తున్నారు. భారతదేశంలో 2014 లో ఇటువంటివి కేవలం రెండు యూనిట్ లు ఉండగా, ప్రస్తుతం దేశంలో 120 మొబైల్ ఫోన్ తయారీ కర్మాగారాలు నెలకొన్నాయి. ఈ యూనిట్ లు 4.5 లక్షల మందికి పైగా పౌరులకు ప్రత్యక్ష ఉపాధిని మరియు పరోక్ష ఉపాధిని మరియు ప్రత్యక్ష ఉపాధిని కల్పించాయి.

ఒక బలమైన డిజిటల్ ఇండియా యొక్క నిర్మాణంలో నేశనల్ నాలెడ్జ్ నెట్ వర్క్ (ఎన్ కెఎన్) కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. ఎన్ కెఎన్ అనేది భారతదేశంలో సుమారు 1700 ప్రధాన పరిశోధన సంస్థలను మరియు విద్యా సంస్థలను అనుసంధానిస్తోంది. తద్వారా దాదాపు అయిదు కోట్ల మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, విద్యావేత్తలు మరియు ప్రభుత్వ అధికారులకు ఒక శక్తిమంతమైన వేదిక ను అందిస్తోంది.

MyGov ప్లాట్ ఫారమ్ యొక్క స్వచ్ఛంద సేవకుల తో కూడా ప్రధాన మంత్రి సంభాషించారు. పౌరులతో మమేకమయ్యే ఈ వేదిక ను ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల లోపలే స్థాపించడమైంది. ఈ వేదిక తో 60 లక్షలకు పైగా స్వచ్ఛంద సేవకులు అనుబంధాన్ని కలిగి వున్నారు. వీరు ఉపాయాలను, సూచనలను ఇవ్వడం మరియు వివిధ స్వచ్ఛంద కార్యకలాపాలను చేపట్టడమే కాకుండా ఒక న్యూ ఇండియా నిర్మాణంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా, ‘4E’ లు- Education (విద్య), Employment (ఉద్యోగం), Entrepreneurship (నవ పారిశ్రామికత్వం) మరియు Empowerment (సాధికారిత) లను సాధించే దిశగా సాగిపోతున్నామని కూడా ప్రధాన మంత్రి చెప్పారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమం తాలూకు వివిధ పథకాల యొక్క లబ్ధిదారులు ప్రధాన మంత్రి తో వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఈ పథకాలు వారి యొక్క జీవితాలలో పరివర్తనను తీసుకురావడంలో ఏ విధంగా ముఖ్యమైన పాత్ర ను పోషించిందీ చెప్పుకొచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్ సి) ఏ విధంగా ఉద్యోగ అవకాశాలను తీసుకు వచ్చిందీ, మరి అలాగే ఇది అందించే వివిధ సేవలు వారి జీవన విధానంలో ఎలాగ సరళత కు దోవతీసిందీ కూడా వారు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువ‌చ్చారు.

***