దేశవిదేశాల్లో అత్యంత నాణ్యమైన ‘శ్రీ అన్న’ ఉత్పత్తులకు ప్రోత్సాహం దిశగా కీలక చర్యలు తీసుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చిరుధాన్యాల లభ్యతకు భరోసా ఇస్తూ భారత ఆహార భద్రత-ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) 15 రకాల చిరుధాన్యాలకు 8 రకాల నాణ్యత పారామితులతో ప్రమాణాన్ని రూపొందించిందని మంత్రి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్‌పై శ్రీ మోదీ స్పందించారు.
ఈ మేరకు ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ అత్యుత్తమ నాణ్యతగల ‘శ్రీ అన్న’ ఉత్పత్తులకు ప్రోత్సాహం దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు.” అని అందులో పేర్కొన్నారు.
Important step towards encouraging top quality Shree Anna products in India and internationally. https://t.co/HQ0ayxtLFv
— Narendra Modi (@narendramodi) February 26, 2023