2030 వ సంవత్సరానికల్లా పాఠశాల విద్య లో 100% జిఇఆర్ తో పాటు పూర్వ విద్యాలయ స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు విద్య సార్వజనీకరణ నూతన విధానం యొక్క లక్ష్యం గా ఉంటుంది
బడి నుండి దూరం గా ఉన్నటువంటి 2 కోట్ల మంది బాలల ను తిరిగి ప్రధాన స్రవంతి లోకి ఎన్ఇపి 2020 తీసుకు వస్తుంది
3 సంవత్సరాల ఆంగన్ వాడీ/ ప్రి- స్కూలింగ్ తో మరియు 12 సంవత్సరాల పాఠశాల విద్య తో కూడినటువంటి నూతనమైన 5+3+3+4 పాఠశాల పాఠ్యక్రమం
ప్రాథమిక అక్షరజ్ఞానం, గణన చేసే మౌలిక యోగ్యత కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంపై శ్రద్ధ, స్కూల్ లలో విద్యా స్రవంతులు, పాఠ్యేతర గతివిధులు, ఇంకా వృత్తి సంబంధి విద్య స్రవంతుల కు మధ్య న ఎటువంటి ప్రముఖమైన అంతరం ఉండదు; ఇంటర్న్ శిప్ లతో కూడిన వృత్తి సంబంధి విద్య 6 వ తరగతి నుండి ఆరంభం అవుతుంది
తక్కువ లో తక్కువ గా 5వ తరగతి వరకు మాతృభాష లో/ ప్రాంతీయ భాష లో బోధన
సమగ్రమైన పురోగతి కార్డు తో పాటు మూల్యాంకన ప్రక్రియ లో సంపూర్తి గా సంస్కరణలు, నేర్చుకొనే ప్రక్రియ లో విద్యార్థినీ విద్యార్థుల ప్రగతి పట్ల సంపూర్ణం గా దృష్టి ని సారించడం
ఉన్నత విద్య లో జిఇఆర్ ను 2035వ సంవత్సరం కల్లా 50 శాతం వరకు పెంచడం జరుగుతుంది; ఉన్నత విద్య లో 3.5 కోట్ల కొత్త సీట్ల ను జోడించడం జరుగుతుంది
ఉన్నత విద్య పాఠ్యక్రమం లో విషయాల లో వైవిధ్యానికి స్థానం కల్పించబడుతుంది
యుక్తమైన ధ్రువపత్రాల జారీ తో పాఠ్యక్రమం యొక్క మధ్యకాలం లో బహుళ ప్రవేశాల ను / బహుళ నిష్క్రమణల ను అనుమతించడం జరుగుతుంది
ట్రాన్స్ ఫర్ ఆఫ్ క్రెడిట్స్ కు వీలు కల్పించడం కోసం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ను స్థాపించడం జరుగుతుంది
దేశం లో బలమైన పరిశోధన సంస్కృతి కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం నేశనల్ రిసర్చ్ ఫౌండేశన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది
ఉన్నత విద్య (హెచ్ ఇ) కోసం తేలికపాటి అయినప్పటికీ కఠినంగా ఉండే వ్యవస్థీకరణం, విభిన్న కార్యాల కోసం నాలుగు వేరు వేరు వర్టికల్స్ కు ఒక నియంత్రణదారు ఉంటారు
అఫిలియేశన్ వ్యవస్థ ను 15 సంవత్సరాల లో దశలవారీ గా తొలగించి, కళాశాలల కు గ్రేడెడ్ అటానమీ ని కల్పిస్తారు
అవసరాల కు అనుగుణం గా సాంకేతిక విజ్ఞానాన్ని అధికం గా ఉపయోంచవడాన్ని ఎన్ఇపి 2020 సమర్థిస్తుంది; నేశనల్ ఎడ్యుకేశనల్ టెక్నాలజీ ఫోరమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది
జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ను, వంచిత ప్రాంతాలు మరియు సమూహాల కోసం ప్రత్యేక విద్య మండలాల ను ఏర్పాటు చేయాలని నొక్కిచెప్తున్న ఎన్ఇపి 2020
పాఠశాల లు మరియు హెచ్ఇ లు.. ఈ రెంటి లో బహుభాషావాదాన్ని ప్రోత్సహించనున్న నూతన విధానం; ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ లేశన్ ఎండ్ ఇంటర్ ప్రెటేశన్ ను మరియు నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఫార్ పాలీ, పర్షియన్ ఎండ్ ప్రాక్రృత్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ‘జాతీయ విద్యా విధానం- 2020’ (ఎన్ఇపి 2020) కి ఈ రోజు న ఆమోదం తెలిపింది. దీనితో పాఠశాల విద్య, ఇంకా ఉన్నత విద్య.. ఈ రెండు రంగాల లో పెద్ద ఎత్తున పరివర్తన తో కూడిన సంస్కరణల కు బాట లు వేయబడ్డాయి. ఇది 21వ శతాబ్దాని కి చెందిన తొలి విద్య విధానం గా ఉన్నది; ఇంకా, ఇది 34 సంవత్సరాల పాతదైనటువంటి జాతీయ విద్య విధానం (ఎన్ పిఇ), 1986 యొక్క స్థానాన్ని తీసుకోనున్నది. అందరి కి ఇట్టే అందుబాటు లో ఉండడం, ఎక్విటీ, నాణ్యత, తక్కువ ఖర్చు తో కూడుకొన్నదిగా ఉండడం, జవాబుదారీతనం అనే మూల స్తంభాల పై రూపుదిద్దుకొన్న ఈ విధానం 2030 అజెండా ఫార్ సస్టెయినబుల్ డివెలప్ మెంట్ కు అనుగుణం గా ఉంటూ పాఠశాల విద్య ను, కళాశాల విద్య ను రెంటినీ మరింత సమగ్రం గా, వశ్యం గా, బహుళవిభాగాలు కలిగింది గా, 21 వ శతాబ్దపు అవసరాల కు అనువైంది గా, ఇంకా విద్యార్థినీ విద్యార్థుల లోని విశిష్ట శక్తియుక్తుల ను వెలికితీయడం ద్వారా భారతదేశాన్ని ఒక హుషారైనటువంటి జ్ఞాన సమాజం గా మరియు ప్రపంచంలో జ్ఞాన సంబంధి అత్యంత శక్తి శాలి గా మార్చివేయాలని లక్ష్యం గా పెట్టుకొన్నది.
ప్రధానాంశాలు
పాఠశాల విద్య
పాఠశాల విద్య యొక్క అన్ని స్థాయుల లో సార్వజనిక లభ్యత కు పూచీ పడడం
పూర్వ విద్యాలయం (ప్రి -స్కూలు) నుండి మాధ్యమిక స్థాయి వరకు అన్ని స్థాయుల లో పాఠశాల విద్య అందరి కి అందుబాటు లో ఉండాలని నేశనల్ ఎడ్యుకేశన్ పాలిసి (ఎన్ఇపి) 2020 నొక్కిచెప్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతిపాదించినటువంటి మార్గాల లో- మౌలిక సదుపాయాల అండదండలు, బడి కి వెళ్లడాన్ని మధ్యలోనే మానివేసిన వారిని తిరిగి ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం కోసం ఉద్దేశించిన వినూత్న విద్య కేంద్రాలు, విద్యార్థుల ను వారి నేర్చుకొనే స్థాయుల ను కనుక్కోవడం, నియత మరియు అనియత విద్య పద్ధతుల ప్రమేయం తో నేర్చుకొనేందుకు బహుళ విధ పథాల కు మార్గాన్ని సుగమం చేయడం, పాఠశాలల తో సలహాదారులు లేదా సుశిక్షితులైన సామాజిక కార్యకర్త లకు అనుబంధాన్ని ఏర్పరచడం, స్టేట్ ఓపన్ స్కూల్స్ మరియు ఎన్ఐఒఎస్ ల మాధ్యమం ద్వారా 3వ, 5వ మరియు 8వ తరగతుల కు ఓపెన్ లర్నింగ్ ను ప్రవేశపెట్టడం, పదో తరగతి కి మరియు పన్నెండో తరగతి కి సమానమైన మాధ్యమిక విద్య కార్యక్రమాలను నిర్వహించడం, వృత్తి విద్య పాఠ్యక్రమాలు, వయోజన అక్షరాస్యత ఇంకా జీవనాన్ని సంపన్నం చేసేటటువంటి కార్యక్రమాలు వంటివి- కొన్ని మార్గాలు గా ఉన్నాయి. బడుల నుండి బయటకు వెళ్లిపోయిన రమారమి 2 కోట్ల మంది బాలల ను ఎన్ఇపి 2020 లో భాగం గా ప్రధాన స్రవంతి లోకి తీసుకురావడం జరుగుతుంది.
నూతన పాఠ్యక్రమం మరియు బోధనశాస్త్ర నిర్మాణం ద్వారా ప్రారంభిక బాల్యం యొక్క సంరక్షణ, ఇంకా విద్య బోధన
బాల్యాన్ని సంరక్షించడం మరియు విద్యబోధన ను ప్రోత్సహిస్తూ పాఠశాల పాఠ్యక్రమ సంబంధి వ్యూహాన్ని అమలుపరచడం జరుగుతుంది. 10 + 2 స్వరూపం స్థానం లో 5 + 3 + 3 + 4 తాలూకు నూతన పాఠ్యక్రమాన్ని ఆచరణ లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది క్రమానుగతం గా 3-8, 8-11, 11-14, 14-18 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్ధుల కోసం ఉద్దేశించినటువంటిది. దీనిలో ఇంతవరకు దూరం గా ఉంచబడిన 3- 6 సంవత్సరాల వయస్సు బాలల కు పాఠశాల పాఠ్య ప్రణాళిక క్రిందకు తీసుకు వచ్చే ఏర్పాటు ఉన్నది. దీని ని అంతర్జాతీయ స్థాయి లో బాలల మానసిక వికాసం కోసం అనువైన దశ గా గుర్తించడమైంది. కొత్త ప్రణాళిక లో మూడు సంవత్సరాల పాటు ఆంగన్ వాడీ/ ప్రీ స్కూలింగ్ తో సహా 12 సంవత్సరాల పాఠశాల విద్య కలసి ఉంటుంది.
8 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న బాలల కోసం ఒక నేశనల్ కరిక్యులర్ ఎండ్ పెడగాగికల్ ఫ్రేం వర్క్ ఫార్ అర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎండ్ ఎడ్యుకేశన్ (ఎన్ సిపిఎఫ్ సిసిఇ) ని ఎన్ సిఇఆర్ టి అభివృద్ధిపరుస్తుంది. ఇసిసిఇ బోధన శాస్త్రం మరియు పాఠ్యక్రమం లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మరియు ఆంగన్ వాడీ కార్యకర్తలు పనిచేసే పూర్వ విద్యాలయాలు (ప్రి-స్కూల్స్) మరియు ఆంగన్ వాడీలు ఒక విస్తరించినటువంటి మరియు బలపరచబడినటువంటి సంస్థల ప్రణాళికా మాధ్యమం ద్వారా ఇసిసిఇ ని అందజేయడం జరుగుతుంది. ఇసిసిఇ యొక్క పథక రచన మరియు ఆచరణ ల బాధ్యత ను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మహిళలు మరియు బాల వికాస మంత్రిత్వశాఖ (డబ్ల్యు సిడి), ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (హెచ్ ఎఫ్ డబ్ల్యు), ఇంకా ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లు సంయుక్తం గా వహిస్తాయి.
మౌలిక అక్షరాస్యత ను మరియు సాంఖ్యాత్మక జ్ఞానాన్ని సంపాదించడం
మౌలిక అక్షరాస్యత ను మరియు సాంఖ్యాత్మక జ్ఞానాన్ని పొందడాన్ని నేర్చుకోవడానికి అత్యంత అవసరమైన మరియు ముందస్తు ఆవశ్యకత గా గుర్తిస్తూ, మానవ వనరుల వికాస మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ ఆర్ డి) ద్వారా ఒక నేశనల్ మిశన్ ఆన్ ఫౌండేశనల్ లిటరసీ ఎండ్ న్యూమరసీ ని ఏర్పాటు చేయడం అనేది జరగాలి అని ఎన్ఇపి 2020 పిలుపునిస్తున్నది. 2025వ సంవత్సరానికల్లా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో గ్రేడ్ 3 వరకు అందరు విద్యార్జనపరులు లేదా విద్యార్థుల ద్వారా సార్వజనిక మౌలిక అక్షరాస్యత మరియు సాంఖ్యాత్మక జ్ఞానార్జన కోసం ఒక ఆచరణాత్మక ప్రణాళిక ను రాష్ట్రాలు సిద్ధం చేస్తాయి. ఒక జాతీయ పుస్తక ప్రోత్సాహక విధానాన్ని రూపొందించడం జరుగుతుంది.
పాఠశాల పాఠ్యక్రమ ప్రణాళికల లో మరియు బోధన శాస్త్రం లో సంస్కరణ లు
నేర్చుకొనే వారి సమగ్ర వికాసాన్ని పాఠశాల పాఠ్య ప్రణాళిక లు, బోధన శాస్త్రం దృష్టి లో పెట్టుకొంటాయి. 21 వ శతాబ్దపు కీలక నైపుణ్యాల ను వారికి అందిస్తాయి. అత్యవసరం గా నేర్చుకోవలసిన అంశాల ను పెంపు చేయడం పరమార్థం గా పాఠ్యక్రమాల లో కంటెంట్ తగ్గింపు, కీలకమైనవి ఆలోచించేటట్టు చూడడం మరియు ప్రయోగాత్మక అభ్యాసాని కి వీలు కల్పించడం జరుగుతుంది. సబ్జెక్టు ల ఎంపిక లో విద్యార్ధులకు ఎక్కువ స్వేచ్ఛ ను ఇవ్వడం జరుగుతుంది. ఆర్ట్స్ మరియు సైన్స్ ల మధ్య, పాఠ్యక్రమ సంబంధిత మరియు పాఠ్యేతర సంబంధిత కార్యక్రమాల కు మధ్య, విద్య విభాగాల కు మరియు వృత్తి విద్య విభాగాలకు నడుమ దృఢమైన వేర్పాటు అంటూ ఏదీ ఉండదు.
పాఠశాలల్లో 6వ గ్రేడ్ నుండి వృత్తి విద్య మొదలవుతుంది. దీనిలో ఇంటర్న్ శిప్ కలసి ఉంటుంది.
కొత్తదైనటువంటి మరియు సమగ్రమైననటువంటి నేశనల్ కరిక్యులం ఫ్రేంవర్క్ ఫార్ స్కూల్ ఎడ్యుకేశన్, ఎన్ సిఎఫ్ ఎస్ ఇ 2020-21 ని ఎన్సిఇఆర్టి అభివృద్ధి పరుస్తుంది.
బహుభాషావాదం మరియు భాష యొక్క శక్తి
తక్కువ లో తక్కువ గా గ్రేడ్ 5 వరకు, ఆఁ.. గ్రేడ్ 8 వరకు అయితే మరీ మంచిది, ఇంకా అంతకు మించి కూడాను- బోధన మాధ్యమం గా మాతృభాష గాని లేదా స్థానిక భాష గాని లేదా ప్రాంతీయ భాష ఉండాలి అని పాలిసీ నొక్కిచెప్పింది. విద్యార్థినీవిద్యార్థులు పాఠశాల లోని అన్ని స్థాయుల లో మరియు ఉన్నత విద్య లోను సంస్కృతాన్ని ఒక ఐచ్ఛికం రూపం లో ఎంచుకొనేందుకు అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. త్రి-భాషా సూత్రం లో కూడాను ఈ ఐచ్ఛికం కలసివుంటుంది. భారతదేశం లోని ఇతర ప్రాచీన భాషలు మరియు సాహిత్యాలు సైతం ఐచ్ఛికాల రూపం లో అందుబాటులో ఉంచాలి. ఏ భాష ను ఏ విద్యార్థిని పైన గాని, ఏ విద్యార్థి పైన గాని రుద్దడం జరగదు. విద్యార్థులు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమం లో భాగం గా ఏదైనా ఆనందదాయకమైన ప్రాజెక్టు లో గాని, లేదా కార్యకలాపం లో గాని పాలుపంచుకోవలసి ఉంటుంది. మాధ్యమిక విద్య స్థాయి లో అనేక విదేశీ భాషల ను కూడా ఒక వికల్పం రూపం లో ఎంచుకోవచ్చును. భారతీయ సంకేత భాష (ఐఎస్ఎల్) ను దేశం అంతటా ప్రమాణీకరించడం జరుగుతుంది. ఇంకా, వినికిడి శక్తి కి దూరమైనటువంటి విద్యార్థుల ద్వారా ఉపయోగం కోసమని జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పాఠ్యక్రమ సామగ్రి ని అభివృద్ధిపరచడం జరుగుతుంది.
నిర్ధారణ లో సంస్కరణ లు
సంకలిత మూల్య నిర్ధారణ కు బదులు నియమిత మరియు నిర్మాణాత్మక మూల్య నిర్ధారణ ను అనుసరించాలని ఎన్ఇపి 2020 లో పేర్కొనడమైంది. ఇది అధిక యోగ్యత ఆధారితమైందీ, నేర్చుకోవడం తో పాటే వికాసాన్ని ప్రోత్సహించేదీ, ఇంకా విశ్లేషణ సామర్థ్యం, అవసరమైన ఆలోచన-మననం చేసుకొనే దక్షత, ఇంకా భావనపరం గా స్పష్టతల వంటి ఉన్నత స్థాయి నైపుణ్యాల ను పరీక్షించేదీ గా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులు అందరూ గ్రేడ్ 3, 5 మరియు 8 లో పాఠశాల పరీక్షల కు హాజరు అవుతారు, ఈ పరీక్షల ను సముచిత అధికార సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. గ్రేడ్ 10 మరియు గ్రేడ్ 12 లకు బోర్డ్ పరీక్షల ను కొనసాగించడం జరుగుతుంది, అయితే సమగ్ర వికాసం లక్ష్యం గా వీటికి ఒక నవీనమైన స్వరూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ‘పరఖ్’ పేరిట ఒక నూతనమైన నేశనల్ అసెస్ మెంట్ సెంటర్ ను ఓ ప్రమాణ నిర్దేశక సంస్థ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నామం లోని ప్రతి ఒక్క అక్షరం వేరు వేరు విధుల ను సంకేతీకరిస్తాయి. పిఎఆర్ఎకెహెచ్ లో ‘పి ఎ’ లు పనితీరు యొక్క మూల్యనిర్ధారణ [ Performance Assessment ]) కు, ‘ఆర్’ సమీక్ష [ Review ] కు, ఎకెహెచ్ లు సమగ్ర అభివృద్ధి సంబంధి జ్ఞాన విశ్లేషణ [Analysis of Knowledge for Holistic Development ] కు సూచకాలు.
సమానమైన మరియు సమ్మిళితమైన విద్య
బాలలు వారి యొక్క జన్మ లేదా నేపథ్యం తో జతపడ్డ పరిస్థితుల కారణం గా జ్ఞానార్జన లేదా నేర్చుకొనే మరియు శ్రేష్ఠత్వాన్ని దక్కించుకొనే ఎటువంటి అవకాశాల నుండి వంచింపబడకుండా చూడాలి అన్నది ఎన్ఇపి 2020 యొక్క లక్ష్యం గా ఉన్నది. సామాజికం గా మరియు ఆర్థికం గా వంచితులైన సమూహాల (ఎస్ఇడిజి స్) పై ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. దీనిలో బాలుడు-బాలిక, సామాజిక-సాంస్కృతిక, ఇంకా భౌగోళిక సంబంధి విశిష్ట గుర్తింపు మరియు దివ్యాంగత్వం కూడా భాగం అయి ఉన్నాయి. ఇందులో వంచిత ప్రాంతాలు మరియు సమూహాల కోసం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ తో పాటు స్పెశల్ ఎడ్యుకేశన్ జోన్ ల ఏర్పాటు కూడా చేరివుంటుంది. దివ్యాంగ బాలల ను పునాది దశ మొదలుకొని ఉన్నత విద్య వరకు నియమిత విద్య బోధన ప్రక్రియ లో పూర్తి గా భాగం పంచుకోవడం లో సమర్ధులను చేయడం జరుగుతుంది. దీనిలో ఎడ్యుకేటర్స్ యొక్క పూర్ణ సహకారం లభిస్తుంది. దీనితో పాటు దివ్యాంగుల సంబంధిత సమస్త ప్రశిక్షణ, రిసోర్స్ సెంటర్ లు, వసతి, సహాయక ఉపకరణాలు, సాంకేతిక విజ్ఞానాధారిత ఉపయుక్త ఉపకరణాలు, అలాగే వారి అవసరాలకు అనుగుణం గా ఇతర సహాయక వ్యవస్థల ను అందించడం జరుగుతుంది. కళకు సంబంధించిన, కరియర్ కు సంబంధించిన మరియు క్రీడలకు సంబంధించిన కార్యకలాపాల లో విద్యార్థులు పాలుపంచుకోవడం కోసం పగటి పూట పనిచేసే ఒక ప్రత్యేకమైన బోర్డింగ్ స్కూలు తరహా లో ‘‘బాల భవనాల’’ను స్థాపించవలసిదిగా ప్రతి ఒక్క రాష్ట్రాన్ని/జిల్లా ను ప్రోత్సహించడం జరుగుతుంది. పాఠశాల యొక్క ఉచిత మౌలిక సదుపాయాల ను సామాజిక చేతన కేంద్రాల రూపం లో వినియోగించుకొనేందుకు వీలు ఉంటుంది.
ప్రభావశీల ఉపాధ్యాయ భర్తీ మరియు ఉద్యోగజీవన పురోగతి పథం
ప్రభావశీలమైన మరియు పారదర్శకమైన ప్రక్రియ ల ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల ను చేపట్టడం జరుగుతుంది. పదోన్నతులు యోగ్యత ఆధారితమైనవి గా ఉంటాయి. దీని లో పలు మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు పనితీరు ను గురించి తెలుసుకొంటూను మరియు ఉద్యోగజీవనం లో ముందుకు పోతూ విద్యా సంబంధి పరిపాలకులు గానో లేక ఉపాధ్యాయ శిక్షకులు గానో ఎదిగేందుకు తగిన ఏర్పాటు చేయబడుతుంది. ఉపాధ్యాయుల కోసం ఒక ఉమ్మడి నేశనల్ ప్రొఫెశనల్ స్టాండర్డ్ స్ ఫార్ టీచర్ ఎడ్యుకేశన్ (ఎన్ పిఎస్ టి) ని ఎన్ సిఇఆర్ టి, ఎస్ సిఇఆర్ టి లు, ఉపాధ్యాయులు, ఇంకాఅన్ని స్థాయులు మరియు అన్ని ప్రాంతాల కు చెందిన నిపుణ సంస్థల తో నేశనల్ కౌన్సిల్ ఫార్ టీచర్ ఎడ్యుకేశన్ సమాలోచనల ను జరిపి, 2022వ సంవత్సరం కల్లా అభివృద్ధిపరుస్తుంది.
స్కూల్ గవర్నెన్స్
పాఠశాలల ను పరిసరాలు లేదా క్లస్టర్ లు గా వ్యవస్థీకరించే వీలు ఉంటుంది. ఇవి గవర్నెన్స్ తాలూకు ప్రాథమిక యూనిట్ గా ఉంటాయి. అంతే కాక మౌలిక సదుపాయాలు, అకాడమిక్ లైబ్రరీ లు మరియు ఒక బలమైన వృత్తినైపుణ్యం కలిగిన ఉపాధ్యాయ సముదాయం సహా అన్ని వనరుల లభ్యత కు పూచీ పడడం సాధ్యమవుతుంది.
పాఠశాల విద్య కై ప్రమాణాల నిర్ధారణ మరియు అక్రెడిటేశన్
ఎన్ఇపి 2020 విధాన రూపకల్పన కు, వ్యవస్థీకరణ కు, కార్యకలాపాల కు మరియు విద్యాసంబంధి అంశాల కు స్పష్టమైన, వేరు వ్యవస్థలు ఉండటం ముఖ్యమని సూచిస్తున్నది. రాష్ట్రాలు/యుటి లు స్వతంత్ర స్టేట్ స్కూల్ స్టాండర్డ్ స్ ఆథారిటి (ఎస్ఎస్ఎస్ఎ) ని ఏర్పాటు చేస్తాయి. ఎస్ఎస్ఎస్ఎ నిర్దేశించిన ప్రకారం ప్రాథమిక వ్యవస్థీకరణ సంబంధి సమాచారాన్నంతా కూడాను సార్వజనిక పర్యవేక్షణ మరియు జవాబుదారీతనం కోసం పారదర్శకమైన రీతి లో విస్తృత రీతి ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ సిఇఆర్ టి స్టేక్ హోల్డర్స్ అందరి తో సంప్రదింపులు జరపడం ద్వారా ఒక స్కూల్ క్వాలిటీ అసెస్ మెంట్ ఎండ్ అక్రెడిటేశన్ ఫ్రేంవర్క్ (ఎస్ క్యుఎఎఎఫ్) ను అభివృద్ధిపరుస్తుంది.
ఉన్నత విద్య
జిఇఆర్ ను పెంచి 2035 వ సంవత్సరం కల్లా 50 శాతానికి చేర్చడం
వృత్తి విద్య సహా ఉన్నత విద్య లో గ్రాస్ ఇన్ రోల్ మెంట్ రేశియో (జిఇఆర్) ను 2018 లో నమోదైన 26.3 శాతం నుండి 2035వ సంవత్సరం కల్లా 50 శాతానికి పెంచాలని ఎన్ఇపి 2020 లక్షిస్తున్నది. ఉన్నత విద్య సంస్థల లో 3.5 కోట్ల నూతన సీట్ల ను జోడించడం జరుగుతుంది.
సమగ్ర బహువిషయిక విద్య
మారే కాలాని కి తగిన పాఠ్యక్రమాలు, సబ్జెక్టుల లో సృజనాత్మకమైన సంయోజన, వృత్తి విద్యాంశాల యొక్క ఏకీకరణ, వివిధ ప్రవేశ పాయింట్లు/ నిష్క్రమణ పాయింట్ల కు ఆస్కారం ఉండే విస్తృతమైన, బహువిషయకమైన (మల్టి- డిసిప్లినరీ) మరియు సముచిత సర్టిఫికేశన్ తో కూడిన 3 లేదా 4 సంవత్సరాల సమగ్ర పూర్వ స్నాతక (అండర్ గ్రాడ్యుయేట్) విద్య ను బోధించాలని ఈ విధానం సూచిస్తున్నది. ఉదాహరణ గా చెప్పుకోవాలంటే గనక, ఒక సంవత్సరం అనంతరం సర్టిఫికెట్, 2 సంవత్సరాల అనంతరం ఎడ్వాన్స్ డిప్లొమా, 3 సంవత్సరాల అనంతరం బ్యాచిలర్ డిగ్రీ మరియు 4 సంవత్సరాల తరువాత పరిశోధన జతపరచబడే డిగ్రీ ఇలాగ అన్నమాట.
వేరు వేరు హెచ్ఇఐ ల నుండి సంపాదించుకొనేన అకాడమిక్ క్రెడిట్స్ ను డిజిటల్ రూపం లో నిలవ చేయడం కోసం ఒక అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ను స్థాపించడం జరుగుతుంది. దీని ద్వారా అంతిమ డిగ్రీ ఆర్జన దిశ లో ఈ యొక్క అకాడమిక్ క్రెడిట్స్ ను బదలాయించుకోవడానికి మరియు లెక్కించడానికి వీలు ఉంటుంది.
దేశం లో ప్రపంచ ప్రమాణాలు కలిగివుండే సర్వశ్రేష్ఠ బహువిషయక విద్య బోధన నమూనా ల రూపం లో మల్టిడిసిప్లినరీ ఎడ్యుకేశన్ ఎండ్ రిసర్చ్ యూనివర్సిటీస్ (ఎమ్ఇఆర్ యు స్) ను ఐఐటి లు, ఐఐఎమ్ లతో సమానం గా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఉన్నత విద్య లో ఒక బలమైనటువంటి పరిశోధక సంస్కృతి ని మరియు పరిశోధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం కోసం ద నేశనల్ రిసర్చ్ ఫౌండేశన్ రూపం లో ఒక ప్రధాన సంస్థ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వ్యవస్థీకరణం
మెడికల్ ఎడ్యుకేశన్ మరియు లీగల్ ఎడ్యుకేశన్ లను మినహాయించి యావత్తు ఉన్నత విద్య కై ఒకే అతి మహత్వపూర్ణమైన విస్తృత వ్యవస్థ నున ఏర్పాటు చేయడం జరుగుతుంది.
హెచ్ఇసిఐ లో నాలుగు స్వతంత్ర వర్టికల్ లు ఉంటాయి. అవి:- వ్యవస్థీకరణం కోసం నేశనల్ హయ్యర్ ఎడ్యుకేశన్ రెగ్యులేటరీ కౌన్సిల్ (ఎన్ హెచ్ ఇఆర్ సి), ప్రమాణ నిర్ధారణ కోసం జనరల్ ఎడ్యుకేశన్ కౌన్సిల్ (ఇజిసి), నిధులు ఇవ్వడం కోసం హయ్యర్ ఎడ్యుకేశన్ గ్రాంట్స్ కౌన్సిల్ (హెచ్ ఇజిసి) మరియు అక్రెడిటేశన్ కోసం నేశనల్ అక్రెడిటేశన్ కౌన్ససిల్ (ఎన్ఎసి). సాంకేతిక విజ్ఞానం ద్వారా ముఖరహిత జోక్యం యొక్క మాధ్యమం ద్వారా హెచ్ఇసిఐ కార్యకలాపాల ను పూర్తి చేస్తుంది. మరి దీనికి నియమాలను, ఇంకా ప్రమాణాల ను పాటించని హెచ్ఇఐ లను దండించే శక్తి ఉంటుంది. సార్వజనిక మరియు ప్రైవేటు ఉన్నత విద్య సంస్థలు వ్యవస్థీకరణం, అక్రెడిటేశన్, ఇంకా విద్యా ప్రమాణాలతాలూకు అదే సమూహం ద్వారా పాలింపబడతాయి.
సంస్థాగత నిర్మాణ శిల్పాన్ని సక్రమం గా వ్యవస్థీకరించడం
ఉన్నత విద్య సంస్థ (హెచ్ఇఐ)లకు అధిక నాణ్యత తో కూడిన బోధన, పరిశోధన మరియు సాముదాయిక సహభాగిత్వం లను సమకూర్చడం ద్వారా వాటి ని పెద్ద సంస్థలు, మంచి వనరులు కలిగిన సంస్థలు, ఇంకా గతిశీల బహువిషయక సంస్థలు గా పరివర్తన కు లోను చేయడం జరుగుతుంది. విశ్వవిద్యాలయ నిర్వచనం లో సంస్థల కు ఒక విస్తృత శ్రేణి ఉంటుంది; అందులో పరిశోధన ప్రధానమైనటువంటి విశ్వవిద్యాలయాల నుండి బోధన కేంద్రితమైన విశ్వవిద్యాలయాలు మరియు స్వతంత్రప్రతిపత్తి కలిగివుండే డిగ్రీల ను ప్రదానం చేసే మహావిద్యాలయాల వరకు భాగం గా ఉంటాయి.
కళాశాల ల అనుబంధం (అఫిలియేశన్) పద్దతి ని 15 సంవత్సరాల లోపల దశలవారీగా సమాప్తం చేయడం జరుగుతుంది. మహావిద్యాలయాలకు గ్రేడెడ్ అటానమీ ని ప్రదానం చేయడం కోసం ఒక రాష్ట్రంవారీ యంత్రాంగాన్ని నెలకొల్పడం జరుగుతుంది. కొంత కాలం తరువాత ప్రతి ఒక్క మహావిద్యాలయం అయితే అటానమస్ డిగ్రీ ప్రదానం చేసే మహావిద్యాలయం గా అభివృద్ధి చెందడమో, లేదా ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క ఒక సంఘటక మహావిద్యాలయంగా మారడమో జరిగేటట్టు సూచించడమైంది.
ప్రేరితమైన, శక్తియుతమైన మరియు సమర్థమైన ఫేకల్టి
స్పష్టం గా నిర్వచించిన స్వతంత్ర, పారదర్శక నియామక విధానం, పాఠ్యక్రమాల ను/బోధన శాస్త్రాన్ని రూపొందించడం లో స్వేచ్ఛ, శ్రేష్ఠత్వాన్ని ప్రోత్సహించడం, సంస్థాగత నాయకత్వం ల ద్వారా ప్రేరణాత్మకమైన, శక్తివంతమైన, ఇంకా సమర్థమైన ఫేకల్టి ని నిర్మించవచ్చంటూ ఎన్ఇపి సిఫారసులు చేసింది. ఈ మౌలిక నియమాల ను పాలించని ఫేకల్టి లను జవాబుదారులు గా చేయడం జరుగుతుంది.
ఉపాధ్యాయ విద్య
ఎన్ సిఇఆర్ టి తో సంప్రదింపు జరిపి ఉపాధ్యాయ విద్య కోసం ఒక నూతన మరియు సమగ్ర జాతీయ పాఠ్యక్రమ ఫ్రేం వర్క్ (ఎన్ సిఎఫ్ టిఇ) 2021 ని ఎన్ సిటిఇ రూపొందిస్తుంది. 2030వ సంవత్సరానికల్లా, బోధన కార్యాన్ని నిర్వహించడం కోసం 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ డిగ్రీ కనీస అర్హత అయిపోతుంది. అప్రామాణిక స్వచాలిత ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (టిఇఐ) లపై కఠిన చర్య తీసుకోబడుతుంది.
మెంటారింగ్ మిశన్
ఒక నేశనల్ మిశన్ ఫార్ మెంటారింగ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో అసాధారణ సీనియర్ ఫేకల్టీ/ పదవీవిరమణ చేసిన ఫేకల్టీ లతో కూడిన ఒక పెద్ద సమూహం ఉంటుంది. వీరి లో భారతీయ భాషల లో బోధన ను అందించే సామర్థ్యం కలిగిన వారు కూడా ఉంటారు. వీరు విశ్వవిద్యాలయ అధ్యాపకులు/కళాశాల అధ్యాపకుల కు స్వల్ప కాలిక మరియు దీర్ఘకాలిక మెంటారింగ్/వృత్తినైపుణ్యం సంబంధి సహాయాన్ని అందజేసేందుకు సిద్ధం గా ఉంటారు.
విద్యార్థుల కు ఆర్థిక సహాయం
ఎస్ సి, ఎస్ టి, ఒబిసి, ఇంకా ఇతర విశిష్ట శ్రేణుల తో కూడిన విద్యార్థుల యొక్క యోగ్యత ను ప్రోత్సహించడం కోసం ప్రయాస లు తీసుకోవడం జరుగుతుంది. ఉపకార వేతనాల ను అందుకొనే విద్యార్థుల యొక్క ప్రగతి ని సమర్థన ను అందించడం కోసం, దానిని పెంచడం కోసం మరియు వారి యొక్క ప్రగతిని ట్రాక్ చేయడం కోసం నేశనల్ స్కాలర్ శిప్ పోర్టల్ ను విస్తరించడం జరుగుతుంది. ప్రైవేటు ఉన్నత విద్య సంస్థ (హెచ్ఇఐ) లను వాటి విద్యార్థుల కు పెద్ద సంఖ్య లో ఉచిత శిక్షణ ను మరియు ఉపకార వేతనాల ను ఇవ్వజూపవలసిందంటూ ప్రోత్సహించడం జరుగుతుంది.
ఓపన్ లర్నింగ్ మరియు దూర విద్య
జిఇఆర్ ను పెంపొందించడం లో ఓపన్ లర్నింగ్ ను మరియు దూర విద్య ను విస్తరించడం జరుగుతుంది. ఆన్ లైన్ పాఠ్యక్రమాలు మరియు డిజిటల్ సంగ్రహాలు, పరిశోధన కై ఆర్థిక సహాయం, మెరుగైనటువంటి విద్యార్థి సేవ లు, ఎమ్ఒఒసి ల ద్వారా క్రెడిట్ ఆధారిత గుర్తింపు మొదలగు చర్యల ను- అవి అత్యున్నతమైన నాణ్యత తో కూడిన ఇన్-క్లాస్ కార్యక్రమాల కు తులతూగేవి గా ఉండేలా పూచీపడేందుకు- తీసుకోవడం జరుగుతుంది.
ఆన్ లైన్ ఎడ్యుకేశన్ మరియు డిజిటల్ ఎడ్యుకేశన్
సాంక్రామిక వ్యాధులు మరియు ప్రపంచవ్యాప్త వ్యాధులు ఇటీవల పెరిగిన నేపథ్యం లో, ఆన్ లైన్ విద్య ను ప్రోత్సహించడం కోసం సమగ్రమైనటువంటి సిఫారసుల ను చేయడమైంది. వీటి తో ఎప్పుడైనా మరియు ఎక్కడైనా సాంప్రదాయకమైన విద్యార్జన, ఇంకా వ్యక్తిగత విద్యార్జన సాధనాల లభ్యత సంభవం కాదో, అటువంటప్పుడు నాణ్యమైన విద్య బోధన కు సంబంధించిన ప్రత్యామ్నాయ పద్ధతుల సన్నాహాలకు పూచీపడడం కోసం పాఠశాల విద్య మరియు ఉన్నత విద్య.. ఈ రెంటిలో ఇ-ఎడ్యుకేశన్ యొక్క ఆవశ్యకతల ను తీవేర్చడం కోసం మానవ వనరుల వికాస మంత్రిత్వ శాఖ (ఎమ్ హెచ్ ఆర్ డి) లో డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ కంటెంట్ మరియు కెపాసిటీ బిల్డింగ్ లను సంతరించే ఉద్దేశం తో ఒక ప్రత్యేక యూనిట్ ను నెలకొల్పడం జరుగుతుంది.
విద్య లో సాంకేతిక విజ్ఞానం
నేర్చుకోవడం, మూల్యాంకనం చేయడం, ప్రణాళిక రచన, పరిపాలన లను ప్రోత్సహించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించే విషయం లో ఆలోచనలు స్వేచ్ఛ గా వెల్లడి చేసుకొనేందుకు గాను ఒక వేదిక గా ద నేశనల్ ఎడ్యుకేశనల్ టెక్నాలజీ ఫోరమ్ (ఎన్ఇటిఎఫ్) పేరు తో ఒక స్వతంత్ర ప్రతిపత్తియుత సంస్థ ను స్థాపించడం జరుగుతుంది. తరగతి గది ప్రక్రియల ను మెరుగుపరచడం కోసం ఉపాధ్యాయ లోకం యొక్క వృత్తినిపుణత వికాసానికి సమర్థన ను అందించడం కోసం, వంచిత సమూహాల కోసం విద్య యొక్క లభ్యత ను విస్తరించడం కోసం మరియు విద్య సంబంధి ప్రణాళిక, పరిపాలన, ఇంకా నిర్వహణ లను సరళతరం చేయడం కోసం, ఇలాగ విద్య యొక్క అన్ని స్థాయుల లోను సాంకేతిక విజ్ఞానాన్ని ఏకీకరించి ఉపయోగించడం జరుగుతుంది.
భారతీయ భాషల కు ప్రోత్సాహం
అన్ని భారతీయ భాషల ను పరిరక్షించడం, అవి వృద్ధి చెందేలా చూడడం మరియు వాటి సజీవత్వాన్ని కాపాడడానికి పూచీ పడడం కోసం ఒక ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ లేశన్ ఎండ్ ఇంటర్ ప్రిటేశన్ (ఐఐటిఐ) ని, ఇంకా పాలీ, పర్షియన్, ఇంకా ప్రాకృత భాష ల కోసం నేశనల్ ఇన్స్ టిట్యూట్ (లేదా ఇన్ స్టిట్యూట్స్) ను ఏర్పాటు చేయాలని, సంస్కృతాన్ని, అలాగే హెచ్ఇఐ లలో అన్ని భాషా విభాగాల ను కూడాబలోపేతం చేయాలని, ఇంకా మరిన్ని హెచ్ఇఐ కార్యక్రమాల లో బోధన మాధ్యమం గా మాతృభాష/స్థానిక భాష ను ఉపయోగించాలని ఎన్ఇపి సిఫారసు చేస్తున్నది.
విద్య యొక్క అంతర్జాతీయీకరణ కు సంస్థాగత సహకారం అందించడం తో పాటు విద్యార్థిలోకం, ఫేకల్టి ల గతిశీలత.. ఈ రెండు మార్గాల ద్వారా మార్గాన్ని సుగమం చేయడం జరుగుతుంది. ఇంకా, ప్రపంచం లో అగ్రస్థానాల లో ఉంటున్న విశ్వవిద్యాలయాల ను మన దేశం లో క్యాంపస్ లను తెరచేందుకు అనుమతి ని ఇవ్వడం జరుగుతుంది.
వృత్తినిపుణత తో కూడిన విద్య
అన్ని విధాలైన వృత్తినైపుణ్య సంబంధి విద్యలు ఉన్నత విద్య విధానం లో ఒక విడదీయలేనటువంటి భాగం గా ఉంటాయి. స్టాండ్- అలోన్ టెక్నికల్ యూనివర్సిటీ స్, ఆరోగ్య విజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయాలు, న్యాయ విశ్వవిద్యాలయాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మొదలైనవి బహుళ విభాగాల తో కూడుకొన్న విద్యాసంస్థలు గా మారాలన్న ధ్యేయం తో ముందడుగు వేస్తాయి.
వయోజన విద్య
ఈ విధానం 100 శాతం యువజన మరియు వయోజన అక్షరాస్యత ను సాధించడాన్ని లక్ష్యం గా నిర్దేశించుకొన్నది.
విద్య కు ఆర్థిక సహాయం
విద్య రంగం లో పబ్లిక్ ఇన్ వెస్ట్ మెంట్ ను పెంచడం కోసం, సదరు పెట్టుబడి వీలైనంత త్వరగా జిడిపి లో 6 శాతాని కి చేరడం కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పాటుపడతాయి.
ఇదివరకు ఎన్నడూ లేనంతగా సంప్రదింపు లు
ఎన్ఇపి 2020 ని మున్నెన్నడూ లేని రీతి లో పెద్ద ఎత్తున సంప్రదింపులను జరిపిన తరువాత రూపొందించడమైంది. 2.5 లక్షల గ్రామ పంచాయతీ లు, 6600 బ్లాకు లు, 6000 పట్టణ స్థానిక సంస్థ లు, 676 జిల్లా ల నుండి దగ్గర దగ్గర 2 లక్షల కు పైగా సూచన లు వచ్చాయి. 2015 వ సంవత్సరం జనవరి నుండి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మున్నెన్నడూ లేనంతగా సమగ్రమైనటువంటి మరియు ఉన్నత స్థాయి సంప్రదింపుల ప్రక్రియ ను చేపట్టింది. కేబినెట్ సెక్రటరి గా పనిచేసిన కీర్తిశేషుడు శ్రీ టి.ఎస్.ఆర్. సుబ్రమణియన్ నేతృత్వం లో, ‘కమిటీ ఫార్ ఈవలూశన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేశన్ పాలిసి’ తన నివేదిక ను 2016 వ సంవత్సరం మే మాసం లో సమర్పించింది. దాని ఆధారం గా మంత్రిత్వ శాఖ ముసాయిదా జాతీయ విద్య విధానం- 2016 కొన్నిఅంశాల ను రూపొందించింది. 2017 వ సంవత్సరం జూన్ లో, ప్రముఖ శాస్త్రవేత్త పద్మ విభూషణ్ డాక్టర్ కె. కస్తూరిరంగన్ నేతృత్వం లో ‘కమిటీ ఫార్ ద డ్రాఫ్ట్ నేశనల్ ఎడ్యుకేశనల్ పాలిసీ’ ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముసాయిదా జాతీయ విద్యా విధానం, 2019 ని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి కి 2019 వ సంవత్సరం లో మే 31వ తేదీ నాడు అందజేసింది. ఈ ముసాయిదా జాతీయ విద్య విధానం 2019 ని ఎమ్ హెచ్ ఆర్ డి యొక్క వెబ్సైట్ లో మరియు ‘MyGov Innovate’ పోర్టల్ లో అప్ లోడ్ చేసి, ప్రజల తో పాటు స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలను/సలహాల ను/వ్యాఖ్యల ను వెల్లడి చేయవలసింది గా కోరింది.
పిపిటి ని చూడటం కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
I wholeheartedly welcome the approval of the National Education Policy 2020! This was a long due and much awaited reform in the education sector, which will transform millions of lives in the times to come! #NewEducationPolicyhttps://t.co/N3PXpeuesG
— Narendra Modi (@narendramodi) July 29, 2020
NEP 2020 is based on the pillars of:
— Narendra Modi (@narendramodi) July 29, 2020
Access.
Equity.
Quality.
Affordability.
Accountability.
In this era of knowledge, where learning, research and innovation are important, the NEP will transform India into a vibrant knowledge hub.
NEP 2020 gives utmost importance towards ensuring universal access to school education. There is emphasis on aspects such as better infrastructure, innovative education centres to bring back dropouts into the mainstream, facilitating multiple pathways to learning among others.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
Replacing 10+2 structure of school curricula with a 5+3+3+4 curricular structure will benefit the younger children. It will also be in tune with global best practices for development of mental faculties of a child. There are reforms in school curricula and pedagogy too.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
NEP 2020 has provisions to set up a Gender Inclusion Fund and also Special Education Zones. These will specially focus on making education more inclusive. NEP 2020 would improve the education infrastructure and opportunities for persons with disabilities.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
Thanks to NEP 2020, the Indian Higher Education sector will have a holistic and multi-disciplinary approach. UG education will offer flexible curricula, creative combinations of subjects, integration of vocational education.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
UG education would also include multiple entry and exit points with appropriate certification. An Academic Bank of Credit will be set up to enable digital storage of credits earned from different HEIs, which can also be transferred and counted as a part of the final degree.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
Respecting the spirit ‘Ek Bharat Shreshtha Bharat’, the NEP 2020 includes systems to promote Indian languages, including Sanskrit. Many foreign languages will also be offered at the secondary level.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
Indian Sign Language (ISL) will be standardised across the country.
Aspects such as widening the availability of scholarships, strengthening infrastructure for Open and Distance Learning, Online Education and increasing the usage of technology have received great attention in the NEP. These are vital reforms for the education sector.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
Framing of NEP 2020 will be remembered as a shining example of participative governance. I thank all those who have worked hard in the formulation of the NEP 2020.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
May education brighten our nation and lead it to prosperity.